శ్రీ శుభకృత్ నామసంవత్సరం(2022-2023)లో కర్కాటక రాశి ఫలితాలు
కర్కాటరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయం : 5 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 5 అవమానం : 2
శ్రీ శుభకృత్ నామసంవత్సరంలో ఈ రాశి వారికి గురుడు మీనరాశిలో ఉండటం వల్ల చాలా యోగదాయకంగా ఉంటుంది. శని సప్తమంలో, రాహుకేతువులు 10,4 స్థానాల్లో ఉండటం వల్ల ఈ ఉగాది నుంచి మీకు అంతా శుభసమయమే. రాజకీయంగా, సాంఘికంగా , ఇంటా-బయటా గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఇంకా 2022-2023లో ఎలా ఉందంటే....
- భాగ్య స్థానంలో గురు, రాజ్య స్థానంలో రాహువు వల్ల విశేష లాభాలున్నాయి
- స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, ఆనందంగా ఉంటారు
- శని, కేతువు వల్ల మధ్యమధ్యలో ఆటంకాలు ఎదురవుతాయి, తలపెట్టిన పనులు పూర్తి చేసేందుకు కష్టపడాలి
- మొండిబాకీలు అతి కష్టంమీద వసూలవుతాయి, ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి
- సన్నిహితుల సలహాలు, సూచనలు పాటిస్తే మీకు అంతా మంచే జరుగుతుంది
- సంతానం విషయంలో సంతోషంగా ఉంటారు, అవివాహితులకు వివాహయోగం
- వాహనయోగం, వస్త్రప్రాప్తి ఉన్నాయి
- ఆరోగ్య సమస్యలు వెంటాడినా వైద్యసేవలతో కుదుటపడతారు
- నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది, అధికారులకు పదోన్నతి ఉంటుంది, విద్యార్థులు పోటీపరీక్షల్లో సక్సెస్ అవుతారు
- ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు ఉద్యోగం మారే అవకాశం ఉంది
- వ్యవసాయం, తోటల రంగాల వారికి గిట్టుబాటు ధర విషయంలో సంతృప్తి ఉండదు. పంట చేతికొచ్చే సమయానికి వాతావరణం ఆందోళన కలిగిస్తుంది.
- వ్యాపారం బాగాసాగుతున్నా వారిలో సంతృప్తి ఉండదు, భాగస్వామ్య వ్యాపారాలు అస్సలు కలిసిరావు
- ఆస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు పరిష్కారం దిశగా సాగుతా
- పుణ్యకార్యాలు చేస్తారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు
- అప్పుడప్పుడు కుటుంబంలో చికాకులు ఉన్నప్పటికీ అవన్నీ త్వరలోనే సమసిపోతాయి
- ఈ రాశి పురుషులు...స్త్రీల వల్ల లాభపడతారు
- మీ తెలివితేటలకు గురుబలం తోడవటం వల్ల ఈ ఏడాది మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది
నోట్: పండితుల సూచనలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన విషయాలివి...వీటిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం
ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు.
Also Read: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో
Also Read: ఉగాది నుంచి ఈ రాశివారు ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
Also Read: ఈ ఉగాది నుంచి ఈ రాశివారికి మహర్థశ పడుతుంది, ఆ ఒక్క విషయంలో తప్ప