'లైగర్'... విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కలయికలో రూపొందిన తొలి సినిమా. ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఆగస్టు 25న విడుదల కానుంది. 'లైగర్' విడుదల కంటే ముందు వీళ్ళిద్దరి కలయికలో మరో సినిమా రూపొందనుందనే విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన ప్రకటన మంగళవారం రానుంది. అయితే... అది 'జన గణ మణ' సినిమానా? మరొకటా? అనేదా రేపు అధికారికంగా తెలియనుంది.


విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ అయ్యింది. ముంబైలో సినిమాను ప్రకటించనున్నారు. ఆ విషయాన్ని పూరి కొత్తగా తెలిపారు. ఎక్కడ అనౌన్స్ చేసేదీ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ వివరాలు చెబుతూ చెప్పారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన థీమ్ పోస్టర్ విడుదల చూస్తే... వార్ డ్రామాగా సినిమా రూపొందనుందనే విషయం అర్థం అవుతోంది. ఇందులో విజయ్ దేవరకొండ ఎయిర్ ఫోర్స్ పైలట్ కనిపించనున్నారని తెలుస్తోంది. ఆయన పాత్ర అభినందన్ వర్థమాన్ స్ఫూర్తితో పూరి జగన్నాథ్ రాశారట. 


Also Read: ఆస్కార్స్ లైవ్‌లో గొడవ, కమెడియన్‌ని కొట్టిన విల్ స్మిత్