2022 జూన్ 07 మంగళవారం రాశిఫలాలు


మేషం
మీ కుటుంబ వాతావరణం బావుంటుంది.స్నేహితులను కలుస్తారు. మంచి ప్రవర్తనను కొనసాగించండి. తలపెట్టిన పనులు పూర్తిచేయగలుగుతారు. ప్రేమ సంబంధాలు బావుంటాయి. సమయాన్న దుర్వినియోగం చేయకండి. సోమరితనం వీడండి. 


వృషభం
కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వివాదాలు పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. న్యాయపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆదాయం తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది.


మిథునం
ఈ రోజు కార్యాలయంలో అధికారులతో సమావేశం అవుతారు. మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. ముఖ్యమైన ప్రాజెక్టుల్లో భాగస్వాములవుతారు. ఉద్యోగులకు పై అధికారుల మద్దతు లభిస్తుంది. ప్రేమికులకు మంచి రోజు. బంధువులను కలుస్తారు. 


Also Read:  ఈ రాశులవారికి ఆకస్మిక ధనలాభం, ఈ వారం మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి


కర్కాటకం
మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కార్యాలయంలో ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు చదువు విషయంలో అజాగ్రత్తగా ఉంటారు. మార్కెటింగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులకు రోజు చాలా మంచిది. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.


సింహం
ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. వైవాహిక జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు మంచిరోజు. బంధువులతో చర్చ ఉంటుంది. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. 


కన్య 
వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. ప్రవర్తనలో మార్పు తీసుకురండి. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంటుంది. ఇంటి సభ్యుల్లో ఒకరి అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. ఉద్యోగం మారాలి అనుకుంటే మంచి రోజు. 


తులా
అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. మీ గురించి మీరు గొప్పగా చెప్పుకోవడం మానేయండి.  మీ చతురతకు ఫుల్ మార్క్స్ పడతాయి. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. 


వృశ్చికం
ఎప్పటినుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. మీరు చేసే పనివిషయంలో సీరియస్ గా ఉంటారు. సహోద్యోగుల నుంచి మీకు సహకారం అందుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఇనుము వ్యాపారులు కొన్ని సాంకేతిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అత్యవసర విషయాలపై నిర్ణయం తీసుకుంటారు. 


ధనుస్సు
ఈరోజు మీరు పనిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. మీ తప్పులకు ఇతరులను నిందించవద్దు. మీ ప్రవర్తన చాలామంది ఇబ్బందిపడతారు. వ్యాయామం చేయడం మానెయ్యవద్దు. ప్రభుత్వ పనులు ముందుకు సాగుతాయి. 


Also Read: ఈ అమ్మవారికి కుంకుమ పెట్టి ఏదైనా కోరుకుంటే 41 రోజుల్లో నెరవేరతుందట


మకరం
ఆరోగ్య సమస్య ఉంటుంది. పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. ఎవరికీ సలహాలు ఇవ్వకండి. మీకు ఎవరితోనైనా వివాదం ఉండవచ్చు. విద్యార్థులు చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ప్రయాణం వాయిదా వేసుకోండి. వాహనం జాగ్రత్తగా నడపండి. రిస్క్ తీసుకోవద్దు. 
 
కుంభం
కుటుంబంతో సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో కొత్త  ఒప్పందాలు కుదురుతాయి. మీ పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. టెన్షన్ తగ్గుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. కళారంగంలో వారికి ఈరోజు మంచి రోజు అవుతుంది. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభిస్తారు.


మీనం
అవివాహితులకు మంచి సంబంధం కుదురుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయి. కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోకండి. లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి. స్నేహితుడితో వాగ్వాదం ఉండొచ్చు. 


Also Read: రాహు మహర్ధశ ప్రభావాన్ని తగ్గించే ఆలయం