Happy Raksha Bandhan 2024 Best wishes in telugu: అన్నా చెల్లెల్ల అనురాగ బంధం మరింత బలపడే రోజు.. అమ్మ చూపించే ప్రేమ, నాన్న కనబరిచే భద్రత కలిపి ప్రతిబింబించే రూపం అన్న. రాకా అంటే నిండు పున్నమి. నిండుపున్నమి రోజు ధరించే రక్షకు రాఖీ అని పేరు. ఈ రక్షాబంధనంలో దాగిన మూడు పోగుల దారం..మూడు ముడులు...ఆరోగ్యం, ఆయువు, సంపదకు సంకేతం.

  


Also Read: రక్షాబంధన్ ఎలా మొదలైంది - రాఖీ కట్టేందుకు ఆగష్టు 19న శుభముహూర్తం ఎప్పుడు!


శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు  రక్షా బంధన్ జరుపుకుంటారు. సోదరి, సోదరుల ప్రేమకు ప్రతీక అయిన ఈ పండుగ ఈ ఏడాది ఆగష్టు 19 సోమవారం వచ్చింది. శుభ సమయంలో రాఖీ కడితే ఆ సోదరుడిపై భగవంతుడి ఆశీర్వాదం ఉంటుందంటారు. రాఖీ కట్టడం అంటే ఏదో అలా చేతికి కట్టేయడం కాదు.. ఓ శ్లోకం చదువుతూ రాఖీ కట్టాలి. రాఖీకి మూడు దారాల్లో ఎరుపు, పసుపు రంగులు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే శుభకార్యక్రమాలు దేనికైనా కానీ వేదమంత్రోచ్ఛరణ ఉండాల్సిందే. అందుకే రక్షాబంధన్ రోజు కూడా తూర్పు ముఖంగా సోదరుడిని కూర్చోబెట్టి..బొట్టుపెట్టి, రాఖీ కట్టి, స్వీట్ తినిపించి..హారతి ఇవ్వాలి.    


రాఖీ కడుతూ చదవాల్సిన శ్లోకం ఇది


‘యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః
తేనత్వామభిబధ్నామి రక్షే మా చల మా చల’


అత్యంత దయగల రాజు బలికి కట్టిన అదే పవిత్ర  దారాన్ని నేను నీ మణికట్టుపై కడుతున్నాను.. అది మీ కష్టాల నుంచి శాశ్వతంగా కాపాడుతుందని అర్థం. 


Also Read: రాఖీ కట్టించుకుంటే రోడ్డున పడాల్సిందే - రక్షాబంధన్ వేడుకలకు వీళ్లంతా దూరం!
   
శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి


మీకు మీ కుటుంబ సభ్యులకు రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు


అమ్మలో అనురాగం..నాన్నలో ప్రేమ
కలగలిపిన బంధం ఇది..
రక్షాబంధన్ శుభాకాంక్షలు


నన్ను ఆటపట్టించే అల్లరోడు
సంతోషాన్ని కలిగించే స్నేహితుడు
అనుక్షణం అండగా నిలిచే బంధం
రక్షాబంధన్ శుభాకాంక్షలు


చిరునవ్వుకు చిరునామావి
మంచిమనసుకి మారురూపానివి
మమతలకు ప్రాకారానివి
ఆప్యాయతకు నిలువెత్తు రూపానివి
రక్షాబంధన్ శుభాకాంక్షలు 


సోదరుడిని మించిన ధైర్యం.. సోదరిని మించిన స్నేహితులు ఎవరూ ఉండరు
హ్యాపీ రక్షా బంధన్


అలకలు, పోట్లాటలు ,బుజ్జిగింపులు, ఊరడింపులు
ఏళ్లు గడిచినా చెదరని బంధం 
రాఖీ పండుగ శుభాకాంక్షలు


అక్కా తమ్ముళ్ల అనురాగబంధం .. అన్నా చెల్లెళ్ల ఆప్యాయ బంధం
 అదే రక్షా బంధనం...హ్యాపీ రక్షా బంధన్ 


అమ్మలా అనురాగం పంచావు..నాన్నలా లాలించావు
నువ్వే నా ధైర్యం అన్నయ్య...
రాఖీ పండుగ శుభాకాంక్షలు


అపురూపమైన అన్న చెల్లెళ్ల అనుబంధం
ఆప్యాయతకు ప్రతిరూపం
రాఖీ పండుగ శుభాకాంక్షలు


ఒకే కడుపున పుట్టకపోయినా ప్రేమను పంచిన
సోదరులు, సోదరీమణులు అందరకీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు
 
నా జీవితంలోని ప్రతి మలుపులో అండగా నిలిచే సోదరుడికి
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు


తీసేసిన రాఖీ ఏం చేయాలి?
ఆగష్టు 19 సోమవారం రోజంతా పౌర్ణమి తిథి ఉంది.  వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలం లేని టైమ్ చూసుకుని రాఖీ కట్టొచ్చు. వర్జ్యం సోమవారం మధ్యాహ్నం 12.53 నుంచి 2.33 వరకు ఉంది. దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.29 నుంచి 1.20 వరకు...తిరిగి...మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.51 వరకు ఉంది. ఈ సమయాలు మినహాయించి ఏ టైమ్ లో అయినా రాఖీ కట్టొచ్చు...రాఖీ తీసేసిన తర్వాత దానిని ఎక్కడైనా చెట్టుమీద కానీ, నీటిలో కానీ వేయాలి..ఎక్కడంటే అక్కడ పడేయకూడదు...