Navratri 2024 8th Day Mahagauri Durga  Alamkaram : ఆశ్వయుజ మాసంలో వచ్చే శుక్ల పక్ష అష్టమిని దుర్గాష్టమి అంటారు. నవదుర్గలలో మహాగౌరి అలంకారంలో దర్శనమిస్తోంది శ్రీశైల భ్రమరాంబిక. శరన్నవరాత్రుల్లో దుర్గాష్టమికి అత్యంత విశిష్టత ఉంది. ఈ ఏడాది దుర్గాష్టమి అక్టోబరు 10 గురువారం వచ్చింది.


నవదుర్గలలో ఎనిమిదో అవతారం మహాగౌరి. శంకరుడిని భర్తగా పొందేందుకు నారదుడి సూచన మేరకు కఠోర తపస్సు ఆచరించింది అమ్మవారు. తపస్సు చేసేందుకు సకల భోగాలను త్యజించి.. అడవికి చేరుకుని పరమేశ్వర ధ్యానంలో మునిగిపోయింది.


ఎండా, వానా, భయంకరమైన తుపానులను కూడా లెక్కచేయలేదు. ఆ సమయంలో పార్వతీ దేవి శరీరం మొత్తం దుమ్ము, ధూళి, చెట్ల ఆకులతో నిండిపోయింది. ఆ కఠోర తపస్సుకి కరిగిన శివుడు ప్రత్యక్షమై..ఆమె కోరిన వరమిచ్చి...అనంతరం గంగాజలంతో ప్రక్షాళన చేశాడు. ఆ క్షణం అమ్మవారు గౌర వర్ణం అంటే తెల్లటి శరీరంతో దర్శనమిచ్చింది..అప్పుటి నుంచి ఆమె మహాగౌరిగా పూజలందుకుంటోంది.


నవదుర్గలలో ఎనిమిదో అవతారం అయిన మహాగౌరిని ఆశ్వయుజ శుక్ల అష్టమి..దుర్గాష్టమి రోజు పూజిస్తారు. వృషభ వాహనంపై దర్శనమిచ్చే మహాగౌరి నాలుగు చేతుల్లో...త్రిశూలం, అభయముద్ర, ఢమరుకం, వరముద్ర ఉంటాయి. 


Also Read: సతీదేవి కురులు పడిన ప్రదేశం.. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి - దసరాల్లో ఈ అమ్మవారి వైభోగం చూసేందుకు రెండు కళ్లు సరిపోవ్!


శ్లోకం
శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః| 
మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||


తెలుపు లేదా ఎరుపు రంగుని గౌరవర్ణం అని పిలుస్తారు. గౌరీదేవిని పూజించినా, ఈ అలంకారంలో దర్శనమిచ్చే అమ్మవారిని ఆరాధించినా సకల పాపాలు, అష్ట దరిద్రాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. జీవితంలో ఎదురయ్యే కష్టాలను తొలగించుకోవాలంటే గౌరీ ఉపాసన చేయాలని చెబుతారు పండితులు.  


ధ్యాన మంత్రం
పూర్ణేన్దు నిభాం గౌరీ సోమచక్రస్థితాం అష్టమం మహాగౌరీత్రినేత్రామ్।
వరాభీతికరాం త్రిశూల డమరూధరాం మహాగౌరీ భజేమ్॥


హే గౌరీ శంకరార్ధాంగీ
యథా త్వం శంకర ప్రియా,
తథా మాం కురూ కల్యాణీ
కాన్తాకాంతా సుదుర్లభామ


Also Read: అష్టాదశ శక్తిపీఠం - సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశం - వివాహం కానివారికి ప్రత్యేకం!
 
ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ |
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ ||
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ |
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ ||
నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||
ఇలా దుర్గాదేవి తొమ్మిది రూపాలతో విరాజిల్లుతుంది


దుర్గాష్టమి రోజు చదువుకోవాల్సిన నవదుర్గల శ్లోకాలు
 
దేవీ శైలపుత్రీ


వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్
 
దేవీ బ్రహ్మచారిణీ


దధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా
 
దేవీ చంద్రఘంటేతి


పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా
 
దేవీ కూష్మాండా


సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే


దేవీ స్కందమాతా


సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ
 
దేవీ కాత్యాయని


చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ
 
దేవీ కాళరాత్రి


ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ
 
దేవీమహాగౌరీ


శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా
 
దేవీసిద్ధిదాత్రి


సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ


Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే