తులసీదాసు రామభక్తుడు. నిరంతరం రామనామస్మరణలో, రామనామగానంలో మునిగి తేలేవాడు.  ఆయన గానామృతానికి పరవశించిపోయిన ఎంతోమంది తులసీదాస్‌ దగ్గరకు వచ్చి రామనామ దీక్ష తీసుకునేవారు.  కేవలం హిందువులే కాదు, ఇతర మతాలవారు కూడా తులసీదాస్‌ వద్ద రామనామ దీక్ష తీసుకోవడం, రామ భజన చేయడం ప్రారంభించారు. ఇది సహజంగానే ఆయా మతగురువులకు ఆగ్రహం తెప్పించింది. మతచాందసవాదులు కొందరు, కబీరు మా మతాన్ని కించపరచి, మతమార్పిడులకు పాల్పడుతున్నాడని పాదుషాకి ఫిర్యాదు చేశారు.  అప్పుడో సంఘటన జరిగింది. 


ఆ ఊరిలో అన్యోన్యంగా జీవించే ఒక జంట ఉండేది. అతను హఠాత్తుగా కన్నుమూయడంతో భార్య  దుఃఖం వర్ణనాతీతం. అంత్యక్రియలకు సన్నాహాలు చేశారు. భర్తశవాన్ని తీసుకుపోనీయకుండా అడ్డుకుంటున్న ఆ అమ్మాయిని బంధుమిత్రులు కలిసి బలవంతంగా ఆపగా, శవయాత్ర ముందుకు నడిచింది. ఆ శవయాత్ర తులసీదాస్‌ ఆశ్రమం ముందునుంచి వెళుతోంది. ఆ ఆశ్రమం చూడగానే...ఆ ఆశ్రమంలో భక్తుడు శ్రీరామచంద్రుడి అనుగ్రహం వల్ల తన శోకాన్ని తీర్చగలడు అనుకుంది. హఠాత్తుగా ఆ ఆశ్రమంలోకి వెళ్లి తులసీదాస్ పాదాలమీద పడి వేడుకుంది. నుదుట బొట్టు, చేతులకు గాజులు చూసి దీర్ఘసుమంగళీభవ అని దీవించాడు తులసీదాస్. ఆ దీవెనతో మరింత బాధపడిన ఆమె...మా ఆయన చనిపోయారు. ఆ వెళుతున్న శవయాత్ర ఆయనదే. ఇక నా సౌభాగ్యానికి అర్థమేముంది" అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. తనతో రామభద్రుడే అలా పలికించాడు..ఇందులో సందేహం లేదన్న తులసీదాస్ ఆ శవయాత్ర ఆపించి..  రామనామం జపించి తన కమండలంలో నీళ్లు చల్లుతాడు. వెంటనే ఆ జీవం వచ్చింది. 


Also Read:  అనారోగ్యం, శనిబాధలు తొలగిపోవాలంటే మంగళవారం ఇలా చేయండి


తులసీదాస్ పై కంప్లైట్
ఈ సంఘటన తర్వాత రామనామదీక్ష తీసుకునేవారి సంఖ్య అమితంగా పెరిగిపోయింది. దీంతో ఇతర మతగురువులు ఢిల్లీ పాదుషావారి దగ్గరికి వెళ్ళి, తులసీదాసు మతమార్పిడికి ప్రోత్సహిస్తున్నాడని అభియోగం మోపారు. విచారించేందుకు పిలిచిన షాదుషా... రామనామం శక్తివంతమైనదని చెబుతాడు. చనిపోయిన వారిని బతికించగలగా మీ రామనామం...అయితే ఇప్పుడే ఒక శవాన్ని తెప్పిస్తాం  మీ రామనామ మహిమతో బ్రతికించగలరా అని సవాలు చేశాడు పాదుషా.  రామనామం చనిపోయిన వ్యక్తిని బతికించగలదు కానీ జనన మరణాలు దైవనిర్ణయాలు కదా అంటాడు తులసీదాస్.  ఇన్ని మాటలు వద్దు. రామనామానికి మహిమ లేదని చెప్పు. లేదా శవాన్ని బతికించు. అంతే అని కఠినంగా ఆజ్ఞాపించాడు పాదుషా. తులసీదాసు కళ్లుమూసుకుని రామచంద్రా ఇదేం పరీక్ష అనుకుని ఉండిపోవడంతో..తనను శరణువేడకపోవడం షాదుషాకి కోపం తెప్పించింది. తులసీదాస్‌ని బంధించమని ఆజ్ఞాపించాడు. 


తులసీదాస్ కి అండగా రామదండు
చెరసాలలో ఉన్న తులసీదాస్  శ్రీరాముడు, హనుమంతుడిని గుర్తుచేసుకుంటాడు. ఇంతలో ఎక్కడినుండి వచ్చాయో తెలియదు గానీ వేల సంఖ్యలో కోతులు అక్కడికి వచ్చాయి. సైనికులమీద పడి, వారి దగ్గర ఆయుధాలను లాక్కుని వారిమీదకే గురిపెట్టాయి. సభికులు, సైనికులు, పాదుషా, ఎవ్వరూ కదలలేదు. ఏ కోతి మీదపడి కరుస్తుందో అనే భయంతో సభలో ఉన్నవారంతా భయాందోళనకు గురయ్యారు.  సభలో కలకలం రేగింది. ఆ సవ్వడికి కనులు తెరచిన తులసీదాసుకి సైనికులకి ఆయుధాలు గురిపెట్టిన వానరాలు కనిపించాయి. అవి కోతులు కాదు, రామదండు. తులసీదాసు ఆశ్చర్యంతో, ఆనందంతో చుట్టూ పరికించాడు. ఎదురుగా సింహద్వారం మీద కూర్చుని అభయహస్తాన్ని చూపుతున్న ఆంజనేయుడు దర్శనమిచ్చాడు. తులసీదాసు భక్తిభావంతో తన్మయుడయి, స్వామికి చేతులు జోడించి స్తుతించాడు. ఆయన నోటినుండి అప్రయత్నంగా, ఆశువుగా జయహనుమాన జ్ఞానగుణసాగర అంటూ హనుమాన్‌ స్తుతి ప్రవహించింది. అదే హనుమాన్‌ చాలీసా.


Also Read: పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయ్ అంటారు కదా, ఆ పాతకాలు ఏంటో తెలుసా


కష్టాల్లో ఉన్నవారు హనుమాన్ చాలీశా పారాయణం చేస్తే
తులసీదాసు స్తుతికి హనుమంతుడు ప్రసన్నుడైన, ఆ భక్తుని అనుగ్రహించాడు. "నాయనా! నీస్తుతితో, ప్రసన్నం చేసుకున్నావు.  ఈ మూకని సంహరించాలా? తరిమికొట్టాలా? నీ కోరిక ఏమిటో చెప్పు తీరుస్తాను అని అన్నాడు స్వామి. చేతులు జోడించి భక్తిగా తలవాల్చిన తులసీదాసు.... "స్వామీ! ఇప్పటికే ప్రాణాలరచేతిలో పెట్టుకున్న వీరిగురించి నేనేమీ అడగను. ఇప్పటికే వీరికి అజ్ఞానం తొలగిపోయింది. కానీ, ఒక్క ప్రార్థన ప్రభూ! ఈ స్తోత్రంతో నిన్ను ఎవరు స్తుతించినా వారికి ప్రసన్నుడ వవు స్వామీ... నాకు ఈ వరాన్ని అనుగ్రహించు'' అని వేడుకున్నాడు. ఆ మాటలకు స్వామి మరింత ప్రసన్నుడై తథాస్తు అని అనుగ్రహించాడు. తనను జైలు కష్టాల నుంచి గట్టెక్కించి హనుమంతుడు...ఎవరు కష్టాల్లో ఉన్నా ఇలా పారాయణం చేస్తే కష్టాలు తీరుస్తాడని తులసీదాస్ చెబుతాడు. ఇదంతా విన్న అక్బర్ తులసీదాస్ కి క్షమాపణలు చెప్పి సత్కరించి పంపించాడు.