యాబెటిస్ వంటి దీర్ఘకాలిక రోగాలకు చికిత్స ఉండదు. పూర్తిగా నివారించేందుకు మందులు కూడా లేవు. కేవలం మన డైట్, వ్యాయమం, మానసిక ప్రశాంతత మాత్రమే డయాబెటిస్‌ను ముదరనివ్వకుండా మన ఆయుష్షును పెంచుతాయి. డయాబెటిస్ రాకుండా అడ్డుకొనే ఆయుధం మన చేతిలోనే ఉంది. ముందస్తు జాగ్రత్తలు, లక్షణాలు గుర్తించిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం వంటివి మాత్రమే మనల్ని డయాబెటీస్ నుంచి రక్షిస్తాయి. మీ కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ సమస్య ఉన్నా, అతిగా తీపి, పిండి పదార్థాలను తీసుకుంటున్నా.. డయాబెటిస్ మీద ఓ కన్నేసి ఉంచాలి. ఈ వ్యాధిగానీ మనలోకి ఎంట్రీ ఇచ్చిందంటే.. అవయవాలు ఒక్కక్కటిగా పాడవ్వడం మొదలవుతుంది. 


రెండు రకాల డయాబెటీస్: డయాబెటీస్ రెండు రకాలు. ఒకటి టైప్-1, మరొకటి టైప్-2. మహిళల్లో ఎక్కువగా గెస్టేషనల్ అనే డయాబెటిస్‌ ఏర్పడే అవకాశాలుంటాయి. టైప్-1 రకం మధుమేహం పిల్లలు, యువతలో వస్తుంది. టైప్-1 బాధితులకు పుట్టుక నుంచే ఇన్సులిన్ అందించాలి. దీనికి నివారణ అస్సలు లేదు. టైప్-2 మధుమేహం శరీరానికి అందాల్సిన ఇన్సులిన్ మోతాదు తగ్గడం వల్ల వస్తుంది. డైట్, వ్యాయామాల ద్వారా దీన్ని కంట్రోల్ చేయొచ్చు.  గెస్టేషనల్ డయాబెటిస్ మహిళల్లో గర్భధారణ సమయంలో వస్తుంది. అతిగా మూత్రం రావడం, కాళ్లు తిమ్మిరి ఎక్కడం వంటివి డయాబెటిస్ సాధారణ లక్షణాలు. అయితే, కొందరిలో మాత్రం ఈ లక్షణాలు కనిపించవు. వేరే రకం లక్షణాలు బయటపడుతుంటాయి. ముఖ్యంగా చర్మంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక వేళ మీ చర్మంపై కింది పేర్కొన్న మార్పులు కనిపిస్తే వెంటనే చర్మ వ్యాధి, డయాబెటిస్ వైద్య నిపుణులను సంప్రదించి తక్షణ వైద్యం పొందండి.


❂ మీ చర్మం మీద ఏర్పడే దద్దర్లను నిర్లక్ష్యం చేయొద్దు. స్కిన్ అలర్జీ వల్లే కాకుండా డయాబెటిస్ వల్ల కూడా అలాంటివి ఏర్పడతాయి. 
❂ కొందరికి మెడ, చంకల్లో చర్మం నల్లగా మారుతుంది. ఈ సమస్యను ‘అకాంతోసిస్ నిగ్రికాన్స్’ అని అంటారు. 
❂ ఇన్సులిన్ లోపం లేదా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల అకాంతోసిస్ నిగ్రికాన్స్’ ఏర్పడుతుంది. 
❂ చర్మం దురద లేదా మంటగా ఉన్నా.. ప్రి-డయాబెటిక్ లక్షణమే. 
❂ చర్మంపై పసుపు, ఎరుపు, గోదుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ సమస్యను ‘నెక్రోబయోసిస్ లిపోయిడికా’ అని అంటారు. 
❂ డయాబెటిస్‌ వచ్చే ముందు ‘నెక్రోబయోసిస్ లిపోయిడికా’ లక్షణాలు బయటపడతాయి.
❂ డయాబెటిస్‌తో బాధపడేవారికి గాయాలు అంత త్వరగా మానవు. రక్తంలో మితిమీరిన చక్కెర స్థాయిల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
❂ డయాబెటిస్ వల్ల చర్మంలోని నరాలు దెబ్బతింటాయి. అది గాయాలపై ప్రభావం చూపుతుంది. దీన్నే ‘డయాబెటిక్ అల్సర్’ అని కూడా అంటారు. 


Also Read: రోజూ ఉదయానే ఇలా చేయండి, ఎంతటి మధుమేహం అయినా నియంత్రణలోకి వచ్చేస్తుంది


డయాబెటిస్‌కు ముందు కనిపించే మరికొన్ని లక్షణాలివే: 
❂ గొంతు పొడిగా ఉన్నా, అతిగా దాహం, ఆకలి వేస్తున్నా డయాబెటిస్‌గా అనుమానించాలి. వేసవిలో దాహం వల్ల వస్తుంది మాత్రం భావించకండి.
❂ రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటే మూత్ర పిండాలు సక్రమంగా వడపోయలేవు. 
❂ మూత్ర ద్వారం వద్ద చక్కెర పేరుకుపోవడం వల్ల తరచుగా మూత్రం వస్తుంది. అందుకే మధుమేహులు ఎక్కువ ‘అతి మూత్రం’ సమస్యతో బాధపడతారు.
❂ మూత్రంలో నిలువ ఉండే చక్కెర వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా సమస్యలు ఏర్పడవచ్చు. 
❂ మర్మాంగాల వద్ద దురద లేదా నొప్పి ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. 
❂ కొందరికి మర్మాంగాలపై శిశ్నాగ్ర చర్మము(Foreskin) లోపల తెల్లని పొర ఏర్పడుతుంది. మీలో అది ఏర్పడినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
❂ కంటి చూపు మందగించినా సరే డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవాలి. 
❂ తీవ్రమైన అలసట, అకస్మాత్తుగా బరువు తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తాయి. 
❂ అతిగా బరువు పెరిగే వారికి కూడా డయాబెటిస్ ముప్పు ఉంది. 


Also Read: ‘వడ దెబ్బ’ తగిలిన వెంటనే ఇలా చేయండి, లేకపోతే ప్రాణాలు పోతాయ్!