ప్రపంచంలో అధిక శాతం మందిని వేధిస్తున్న దీర్ఘకాలిక సమస్య డయాబెటిస్. దీన్ని తక్కువ అంచనా వేయద్దు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 2030 సంవత్సరంలో ప్రపంచంలో అధిక మరణాలు మధుమేహం వల్లే కలుగుతాయి. అందుకే ఆ రోగంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపై అవగాహనే లేక చాలా మంది చావు అంచుల దాకా తెచ్చుకుంటున్నారని నిపుణులు భావిస్తున్నారు. మధుమేహం ఉన్న వారు కచ్చితంగా తమ ఆహారాన్ని, జీవన శైలిని మార్చుకోవాలి. మధుమేహాన్ని త్వరగా నియంత్రణలోకి తేవాలంటే మంచి చిట్కా మెంతులు. మెంతుల రెండు వారాల్లో డయాబెటిస్ రీడింగులను సాధారణ స్థాయికి దించుతాయి. ఇంటర్నేషనల్ జర్నల్ పర్ విటమిన్ అండ్ న్యూట్రిషన్ రీసెర్చ్ లో ప్రచురితమైన కథనం ప్రకారం మెంతులు రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. మెంతుల్లో ఉండే ఫైబర్ మధుమేహానికి చెక్ పెడుతుంది.
ఎలా తీసుకోవాలి?
మెంతులను బరకగా పొడి చేసుకుని ఒక డబ్బాలో వేసుకుని దాచుకోవాలి. లేదా మెంతులనేనా నేరుగా వాడుకోవచ్చు. గ్లాసుడు నీటిలో పది గ్రాముల మెంతి పొడి లేదా, మెంతులను నానబెట్టుకోవాలి. ఉదయం లేచిన వెంటనే మెంతులతో సహా ఆ నీటిని తాగేయాలి. ఇలా మీరు రెండు వారాలు చేస్తే చాలు మీకు వెంటనే ఫలితం కనిపిస్తుంది. రోజూ ఇలా తాగడం అలవాటు చేసుకుంటే మధుమేహం పూర్తిగా నియంత్రణలోనే ఉంటుంది. మెంతుల్లో 4 హైడ్రోక్సీసోలేయూసీనే అని పిలిచే యాంటీ డయాబెటిక్ అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంతో పాటూ, కణాలు ఆ ఇన్సులిన్ ను తీసుకునేలా చేస్తాయి. శరీరానికి చక్కెర తగిన స్థాయిలో చేరేందుకు సాయపడుతుంది. రోజూ మెంతులను పెరుగులో నానబెట్టుకుని తిన్నా మంచిదే.
ఇంకా ఎన్నో లాభాలు
ఇందులో సొల్యుబల్ ఫైబర్ వల్లే మధుమేహుల్లో గ్లూకోజు మోతాదులు తగ్గుతాయని భారతీయ వైద్య పరిశోధన మండలి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు కూడా మెంతులు ఉపయోగపడతాయి. వీటిలోని సోపోనిన్సు రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గటానికి సాయపడతాయి. ఒకవేళ మెంతులు నేరుగా తినలేకపోతే పొడిని కూరల్లో వేసుకోవచ్చు. లేదా చపాతీ పిండిలో మెంతి పొడి తక్కువ మొత్తంలో కలిపి రొట్టెలు చేసుకోవచ్చు. ఎలాగోలా మెంతులు శరీరంలోకి వెళ్లడం ముఖ్యం. మెంతుల్లో కాపర్,పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మాంగనీసు, ఫోలిక్ యాసిడ్, రైబో ఫ్లావిన్, విటమిన ఎ, బి6, సి, కె వంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. మధుమేహం ఉన్నవారికే కాదు, లేనివారు తిన్నా కూడా ఎంతో ఆరోగ్యం.
Also read: హలీమ్ హైదరాబాద్ చేరింది ఆ దేశ సైనికుల వల్లే, దాని అసలు పేరు ఇదే