‘ఇండియానా జోన్స్ అండ్ ద కింగ్‌డమ్’... 2008లో విడుదలైన హాలీవుడ్ సినిమా. ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అందులో ఒక పిల్లాడు బాంబుల మోత నుంచి తప్పించుకోవడం కోసం ఒక ఫ్రిజ్ లో దాక్కుంటాడు. అదంతా సినిమాలో కల్పితమే అయినా ఇప్పుడు నిజంగానే జరిగింది. ఓ పాత ఫ్రిజ్ పదకొండేళ్ల పిల్లాడి ప్రాణాన్ని కాపాడింది. అసలేం జరిగిందంటే...


పదకొండేళ్ల పిల్లాడు జాస్మే తన కుటుంబంతో కలిసి ఫిలిప్పీన్స్ లోని ఓ మారుమూల గ్రామంలో నివసిస్తున్నాడు. తల్లి తండ్రితో పాటూ ఒక తమ్ముడు, ఒక అన్నయ్య ఉన్నారు. ఫిలిప్పీన్స్ లో కొన్ని రోజులగా తుఫాను అల్లకల్లోలం సృష్టిస్తోంది. జాస్మే నివసిస్తున్న ప్రాంతం చుట్టు మట్టి కొండలు ఎక్కువ.అవి హఠాత్తుగా విరుచుకుపడడంతో తండ్రి అక్కడికక్కడే చనిపోయారు. తల్లి,చిన్న తమ్ముడు ఏమయ్యారో తెలియలేదు. పదమూడేళ్ల అన్నయ్య ఆచూకీ కూడా తెలియలేదు. ఇక జాస్మే మట్టిపెళ్లలు  పడుతుంటే ఆ బురదలో ఎలా తప్పించుకోవాలో తెలియక చివరికి ఓ పాత ఫ్రిజ్ లో దూరి తలుపు వేసుకున్నాడు. అలా 20 గంటలు లోపలే ఉన్నాడు. 


చివరికి అలా...
మట్టి పెళ్లలు పడడం ఆగాక ఫిలిప్పీన్స్ పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. అందులో ఓ నది ఒడ్డున ఈ ఫ్రిజ్ కనిపించింది. దాన్ని తెరిచి చూస్తే జాస్మే కనిపించాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం బాగానే ఉన్న కాలు విరిగినట్టు తేల్చారు వైద్యులు. కాకపోతే అంత చిన్న వయసులో కూడా తెలివిగా ఆలోచించి ప్రాణాలు కాపాడుకోవడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. అతడు ఫ్రిజ్ లో దొరికినప్పుడు తీసిన ఫోటోలను ఫిలిప్పీన్స్ పోలీసులు తమ సోషల్ మీడియా ఖాతాలలో పోస్టు చేశారు. అవిప్పుడు వైరల్ గా మారాయి.  కానీ ఇప్పుడు తన వారు ఏమయ్యారో తెలియక ఆవేదన పడుతున్నార ఆ పిల్లాడు.


ఫిలిప్పీన్స్ ఆగ్నేయాసియాలోని ఓ దేశం. పశ్చిమ పసిఫిక్ సముద్రంలో కొన్ని వందల దీవుల సమూహం ఈ దేశం. అందుకే తుఫానులు వస్తే ఫిలిప్పీన్స్ అతలాకుతలం అయిపోతుంది. పేదరికంతో అల్లాడుతున్న దేశాల్లో ఇది ఒకటి. కుటుంబ నియంత్రణ వ్యవస్థ సరిగా లేకపోవడంతో పిల్లల ఫ్యాక్టరీగా పేరు తెచ్చుకుంది. 


[fb]


Also read: భూమి బావుంటేనే మనం బావుంటాం, నేలతల్లిని ఇలా కాపాడుకుందాం


Also read: పిల్లలు పుట్టనివారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ, పరిశోధనలో కొత్త ఫలితం


Also read: ప్రపంచంలోనే ‘ఒంటరి ఇల్లు’, ఇప్పుడు అమ్మకానికి వచ్చింది, ధరెంతో తెలుసా?