Weather Updates in Andhra Pradesh : ఉత్తర భారత దేశం నుంచి వీస్తున్న పొడుగాలులు ఏపీ, తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడుతో పాటు యానాంలపై ప్రభావం చూపుతాయని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. నిన్న తెలంగాణలో హైదరాబాద్‌లో, కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. ఏపీలోనూ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాల ప్రభావం కనిపిస్తోంది. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. నేడు సైతం తీరం వెంట 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా అన్నదాతలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో..
ఎండలతో సతమతమవుతున్న ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రజలకు ఊరట లభించింది. నిన్న కురిసిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు ఇక్కడ పగటి ఉష్ణోగ్రతలు దిగొచ్చియి. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో నేడు సైతం వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా అరకు-పాడేరు పరిధిలో భారీ మేఘాలు కమ్ముకున్నాయి. ఇవి మెళ్లగా పార్వాతీపురం మణ్యం జిల్లా వైపుగా విస్తరిస్తున్నాయి. విశాఖ నగరంతో పాటుగా అనకాపల్లి, పార్వతీపురం మణ్యం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆకాశం ప్రస్తుతం మేఘావృతమై ఉంది. మధ్యాహ్నం తరువాత వర్షాలు పడే సూచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో పాడేరు -చింతపల్లి -మారేడుమిల్లి పరిధిలో వర్ష సూచన ఉంది. ఈ ప్రాంతాల్లో అత్యధికంగా జంగమేశ్వరపురంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.






రాయలసీమలో వాతావరణం..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ జిల్లాలకు నేడు ఎలాంటి వర్ష సూచన లేకపోవడంతో భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరిగిపోతోంది. రాయలసీమలో ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల మధ్యలో నమోదుకానుంది. దక్షిణ కోస్తాంధ్రలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎండ వేడి కొనసాగుతుంది. కర్నూలులో అత్యధికంగా 41.8 డిగ్రీలు, తిరుపతి, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలో 40.2 డిగ్రీల చొప్పున భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్ప, ఇళ్ల నుంచి బయటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. రోజుకూ దాదాపు 5 లీటర్ల వరకు నీరు తాగాలని, లేకపోతే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని ప్రజలను హెచ్చరించారు.


తెలంగాణలో వెదర్ అప్‌డేట్
తెలంగాణ రాష్ట్రంలో 45 ఉష్ణోగ్రతలకు చేరిన ఉష్ణోగ్రతలు నేడు తగ్గాయి. నిన్న కురిసిన వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో చలి గాలులు వీస్తున్నాయి. దాదాపు 5 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నేడు దిగివస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలోని తూర్పు, ఉత్తర జిల్లాలు - భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట​, నల్గొండ​, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, ములుగు, మంచిర్యాల​, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సిద్ధిపేట​, సిరిసిల్ల​, మేడ్చల్ మల్కాజ్ గిరి, కరీంనగర్, కమారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదుకానున్నాయి. నిన్న కురిసి వర్షాల ప్రభావంతో కొన్ని జిల్లాల్లో 2 నుంచి 3 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు తగ్గాయి.


Also Read: Gold-Silver Price: నిన్న భారీగా తగ్గి, నేడు మళ్లీ పెరిగిన బంగారం ధర - వెండి మాత్రం కిందికి


Also Read: Petrol-Diesel Price, 22 April: ఏపీలో తగ్గిన పెట్రోల్, డీజిల్ రేట్లు - తెలంగాణలో నిలకడగా, ఇక్కడ మాత్రం పెరుగుదల