2022 ఏప్రిల్ 22 శుక్రవారం రాశిఫలాలు


మేషం
ఈ రోజు ఖర్చు ఎక్కువ చేస్తారు. కార్యాలయంలో పనులపై శ్రద్ధ వహించండి, మీ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారులకు అనుకూలంగా ఉంది. ఆందోళన వదిలిపెట్టి అనుకున్న ప్రణాళిక ప్రకారం ముందుకుసాగండి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా బాగానే ఉంటుంది. 


వృషభం
ఏదో విషయంలో కలవరపడతారు.మరీ ఎక్కువ ఆందోళనకు గురికావొద్దు. పోటీని ఎదుర్కొని గెలిచేందుకు సిద్ధపడండి. సహోద్యోగులను చూసి అసూయ పడొద్దు. వ్యాపారంలో నైపుణ్యం పెంచుకోండి. ఏదైనా కోర్సు చేయాలనుకుంటే ఇదే మంచి సమయం. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. స్త్రీలతో వివాదాలు జరిగే అవకాశం ఉంది జాగ్రత్త. అనవసర విషయాల్లో తలదూర్చకండి. 


మిథునం
ఇంట్లో వ్యక్తులతో మర్యాదపూర్వకంగా మెలగండి. ఖర్చుల చేసేటప్పుడు కోపాన్ని నియంత్రించుకోండి. మీ ఇంటి యజమానిని సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించండి. కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోవచ్చు..ఓపిక పట్టండి పూర్తవుతాయి. వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలి. మందులు నిర్లక్ష్యం చేయవద్దు. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు.


Also Read: శుక్రవారం,శనివారం ఈ శ్లోకం పఠిస్తూ కుంకుమ పూజ చేస్తే ఆర్థిక సమస్యలు, అశాంతి ఉండవట


కర్కాటకం 
మీ ప్రతిభను మరింత మెరుగుపర్చుకుంటారు. యువత సాంకేతికతను ఉపయోగించుకోవాలి కానీ దుర్వినియోగం చేయకూడదు. మీరు ఎక్కడ పని చేసినా మీకంటూ ఓ ప్రత్యేకత ఏర్పాటు చేసుకునేలా ముందుకు సాగండి. వ్యాపారాన్ని మరింత పటిష్ట పరుచుకునేందుకు ఇదే శుభసమయం. పొదుపుపై దృష్టి సారించండి. ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా వ్యవహరించండి. సమాజికంగా కలిసేందుకు ప్రయత్నించండి.


సింహం
మానసికంగా బాధపడతారు...అయితే దీనిగురించి ఎక్కువ ఆలోచించి గందరగోళానికి గురికాకుండా ప్రశాంతంగా ఉంటే పరిష్కార మార్గం దొరుకుతుంది. ఈ రాశి ఉపాధ్యాయులు శుభఫలితాలు పొందుతారు. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులు ఏ పని చేసినా లాభపడే అవకాశం ఉంది. శరీరంలో ఎక్కడైనా రాళ్లు ఉంటే దానికారణంగా నొప్పితో బాధపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వైవాహిక జీవితంలో ప్రశాంతతని పోగొట్టుకోవద్దు.నిరుద్యోగులు అనవసర హడావుడి పడకుండా ముందుకు సాగండి. 


కన్య 
ఈ రాశివారు నెట్ వర్క్ పెంచుకోవాల్సిన సమయం ఇదే. మీలో ఉన్న సృజనాత్మకతకు మరింత పదునుపెట్టండి. కార్యాలయంలో ఉద్యోగులు బాస్ తో వాదించవద్దు, మీ పాయింట్ ను నేరుగా చెప్పండి.  టోకు వ్యాపారం చేసే వ్యాపారులు మంచి లాభాలను ఆర్జించగలుగుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలున్నాయి. ఇంటికి సంబంధించిన ఏదైనా ఉపయోగకరమైన వస్తువు కొంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాల్సిన సమయం ఇది. మీ నెట్ వర్క్ ని పెంచుకోవాలి.


Also Read: ఆధ్యాత్మికంగా 24 కు ఇంత ప్రత్యేకత ఉందా!


తులా
మీ మాటతీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు.సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేసే వారికి కొత్త ప్రాజెక్ట్ లభిస్తుంది. ధాన్యం వ్యాపారులు లాభపడతారు.ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎప్పటి నుంచో వెంటాడుతున్న వ్యాధులు పూర్తిగా నయమవుతాయి.తల్లిదండ్రులతో వాదించకండి, గొడవపడకండి. ఇష్టదైవారాధనలో ఉంటే మీకు మంచి జరుగుతుంది.


వృశ్చికం
ఈ రాశివారు మోసపోకుండా జాగ్రత్తపడాలి. భారీ లాభం ఆశచూపించి మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నాలు కొందరు చేస్తారు. కొత్తగా ఏపని తలపెట్టినా ఆనందంగా చేయండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉదయాన్నే లేచి యోగా చేయండి.సామాజిక క్రమశిక్షణ పాటించాలి. 


ధనుస్సు  
మీ కష్టమే మీకు గుర్తింపు తీసుకొస్తుంది.ఉద్యోగులు ఒత్తిడి ఎదుర్కొంటారు. మీ పరిస్థితులు మెరుగుపడతాయి. పెద్ద వ్యాపారులు కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఎక్కువ నీరు తీసుకోవడంతో పాటు తేలికపాటి ఆహారం తీసుకోండి. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. నిరుద్యోగులు ఉద్యోగానికి సంబంధించి మంచి సమాచారం అందుకుంటారు. 


మకరం
ఈ రాశి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలోచించి అడుగేయండి. మీకు విదేశాల్లో ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే ప్రయత్నించేందుకు ఇదే మంచి సమయం. కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంది. మీ కష్టనష్టాలను కుటుంబంతో పంచుకుంటే ఉపశమనంతో పాటూ మద్దతు కూడా లభిస్తుంది. గురువులాంటి వ్యక్తితో పరిచయడం ఏర్పడుతుంది. 


Also Read: స్నానం చేయకుండా వంట చేస్తున్నారా, ఆ భోజనం తిన్నవారు ఎలా తయారవుతారో తెలుసా


కుంభం
ఈ రాశి అనవసరంగా ఆందోళన చెందడం వల్ల ఇబ్బందిపడతారు.సాఫ్ట్‌వేర్‌కు ఉద్యోగులకు మంచి సమయం నడుస్తోంది. వ్యాపారులు కష్టపడితేనే ఫలితం అందుకుంటారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధవహించండి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. జంక్ ఫుడ్ తినొద్దు..ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యాన్ని వీడండి. సామాజిక రంగంలో ఇతరులకు సహాయం చేసే అవకాశం మీకు లభిస్తే, మీ సామర్థ్యాన్ని బట్టి తప్పకుండా సహాయం చేయండి.


మీనం
సోమరితనం వీడి చురుకుగా ఉండి పూర్తి శక్తితో పనిచేయండి. సహోద్యోగులతో సామరస్యంగా పని చేయడం మీకు చాలా అవసరం. చిల్లర వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. ఇంటికి అతిథులు వచ్చే అవకాశం ఉంది. మీరు మరింత కష్టపడితేనే ఫలితాలు అందుకుంటారు.