అగ్ని నీడే పురోహితం-యజ్జ్ఞస్య దేవ మృత్విజం
యోధారం రత్న ధాతామం
అగ్ని దేవం నమామ్యహం
శివుడి ఆజ్ఞ మేరకు అగ్ని మూడు పనులు చేస్తుంది.
1. యజ్ఞం జరిగినప్పుడు హవిస్సును ఇస్తుంది( హోమంలో వేసేందుకు హవిస్సు వండుతారు)
2. పితృదేవతలకు పిండం పెట్టడం( అగ్నిహోత్రం చేసి పిండం పెడతారు)
3. నిత్యం ఇంట్లో ఆకలి తీరుస్తోంది ( వంట )
ఇప్పుడు మనం చర్చించుకుంటున్న విషయం మూడోది. అగ్నిహోత్రుడు లేనిదే ఆకలి తీరదు. అంటే ప్రతిఇంట్లోనూ అగ్నిహోత్రుడు ఉంటాడు. హిందూ ధర్మాన్ని అనుసరించేవారు పూర్వం స్నానం చేస్తే కానీ అగ్నిహోత్రుడిని వెలిగించేవారు కాదు. ఎందుకంటే లోకాన్ని కాల్చేయగల అగ్నిహోత్రుడు, ఈశ్వర ప్రసాదంగా మీ ఇంట వంటవాడిగా వెలుగుతున్నాడు. అంటే ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నింటికీ ఆయనే కారణం. అలాంటి దైవాన్ని అసౌచంగా అంటే స్నానం చేయకుండా వెలిగించడం సరైన చర్యేనా. వాస్తవానికి చాలా పూజలు ఆచారాలు స్నానం తో మొదలవుతాయి. ఎందుకంటే స్నానం చేస్తే అది ఒక వ్యక్తిని మానసికంగా, ఎమోషనల్ గా కూడా శుభ్రం చేస్తుంది.అందుకే అన్ని పవిత్ర ప్రార్థనా స్థలాల్లో చెరువులు, బావులు, కోనేర్లు, నదులు ఉంటాయి.
Also Read: కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న 50 లక్షల మందికి వండిపెట్టింది ఎవరు, ఇక్కడో ట్విస్ట్ ఉంది
పూర్వం పొయ్యి వెలిగించగానే కర్రలుపెట్టి ముందు ఓ చుక్క నెయ్యి వేసి..అగ్నిహోత్రుడికి నమస్కరించి గిన్నెపెట్టేవారు. మళ్లీ వంట పూర్తైన తర్వాత మరో చుక్క నెయ్యివేసి కొన్ని మెతుకులు అగ్నిహోత్రుడికి సమర్పించేవారు. సాధారణంగా ఆలోచనలు,తీరు, ప్రవర్తనా విధానం అన్నీ తినే భోజనం ఆధారంగానే ఉంటాయని చెబుతారు. ఇందుకు ఉదాహరణ ఏంటంటే...పండుగ రోజుల్లో ఇల్లంతా శుభ్రం చేసుకుని స్నానం చేసి వంటచేసి దేవుడికి నివేదించి తింటారు....మిగిలిన రోజుల్లో ఇంట్లో పనంతా అయ్యాక స్నానం చేస్తారు. పండుగ రోజు తిన్న భోజనం మీలో సానుకూల ఆలోచనలు, దైవత్వాన్ని నింపితే...స్నానం చేయకుండా వండిన వంటను తిన్నవారిలో ఆ సున్నితత్వం ఉండదని, శౌచం లేకుండా వండిన వంట తిన్నవారిలో రాక్షస ఆలోచనలే వస్తాయని పండితులు చెబుతారు
అప్పట్లో పొయ్యిలో నెయ్యి వేసినట్టు ఇప్పుడు స్టౌపై నెయ్యి వేయమంటారా అని అమాయకంగా అడగొద్దు.. కనీసం స్నానం చేశాక అగ్నిహోత్రుడిని వెలిగించండని చెప్పడమే ఈ కథనం ఉద్దేశం. ఈశ్వరుడు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ అగ్నిహోత్రుడు నిత్యం మీ ఇంట్లో వెలుగుతున్నాడు కానీ..స్త్రీలు తాము ఆచరించాల్సిన విధిని ఆచరిస్తున్నారా....
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
ఆరోగ్యపరంగా కూడా స్నానానికి ప్రాముఖ్యత
- స్నానం అనేది దినచర్యలో భాగం. వ్యక్తిగత పరిశుభ్రతకోసం కొంత సమయాన్ని వెచ్చించి మరీ సేదతీరుతాం. స్నానం శరీరంలో ఉత్తేజాన్ని పెంచుతుంది, బద్దకం వీడేలా చేస్తుంది.
- బతకడానికి అత్యంత ముఖ్యమైన పని తినడం..అలాంటి ఆహారాన్ని స్నానం చేయకుండా, బద్దకాన్ని వీడకుండా వండటం అనారోగ్యానికి సూచన.
- నిద్రలో మన శరీరం కొన్ని మరమత్తులు చేసుకుని నూతన ఉత్సాహాన్ని సంతరించుకుంటుంది. ఈ సమయంలో ఎన్నో రకాల విష పదార్థాలను విడుదల చేస్తుంది. లేవగానే స్నానం చేయడం ద్వారా ఈ విషపదార్థాలు పోయి మన శరీరం ఆ రోజు కోసం సిద్ధంగా ఉంటుంది.