శ్రీ సూక్తం ఎంతో మహిమాన్వితమైనది. ఐశ్వర్య ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మీదేవి కరుణాకటాక్షాన్ని పొందాలంటే శ్రీ సూక్తాన్ని మించిన వేదసూక్తం మరొకటి లేదని చెబుతారు. ఇంట్లో నిత్య పూజ చేసేవారు, శుభకార్యాల నిర్వహణలోనూ శ్రీ సూక్త పఠనానికి ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా శుక్రవారం, శనివారం శ్రీసూక్తాన్ని పఠిస్తూ కుంకుమతో పూజచేస్తే ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోవడమే కాదు..లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతారు.
శ్రీ సూక్తమ్
ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్ I
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ II
తాం మాహవ జాత వేదో లక్ష్మీ మనపగామినీమ్
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్
అశ్వపూర్వాం రథ మధ్యాం హస్తినాదஉప్రబోధినీమ్ I
శ్రియం దేవీ ముపాహ్వయే శ్రీర్మా దేవిర్జుష తామ్ II
కాంసోస్మితాం హిరణ్యప్రాకారమార్దాం జ్జ్వలన్తీం తృప్తాం తర్పయన్తీమ్
పద్మేస్థితాం పద్మవర్ణాం తామిహో పాహ్వయే శ్రియమ్ II
చంద్రాం ప్రభాసాం యశసాజ్జ్వలంతీం శ్రియం లోకే దేవ జుష్టాముదారామ్ I
తాం పద్మినీం శరణ మహం ప్రపద్యేஉలక్ష్మీర్మేనశ్యతాం త్వాం వృణే II
ఆదిత్యవర్ణే తపసోஉధిజాతో వనస్పతిస్తవ వృక్షో உథ బిల్వః తస్య ఫలాని తపసా నుదన్తు
మాయాం తరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః II
ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ
ప్రాదుర్భూతోஉస్మిన్ రాష్ట్రే உస్మిన్ కీర్తిమృద్ధిం దదాతుమే II
క్షుత్పిపాసా మలాం జ్యేష్ఠా మలక్ష్మీం నాశయామ్యహమ్ I
అభూతిమ సమృద్ధిం చ సర్వాం నిర్ణుదమే గృహాత్ II
గంధద్వారాం దురాదర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్ II
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహో పాహ్వయే శ్రియమ్ II
మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి I
పశూనాం రూప మన్నస్యమయి శ్రీః శ్రయతాం యశః
కర్థమేవప్రజాభూతా మయి సంభవ కర్ధమ
శ్రియం వాసయ మేకులే మాతరం పద్మమాలినీమ్ II
ఆపః సృజంతు స్నిగ్ధాని చిక్లీత వస మే గృహే
నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మేకులే I
ఆర్ధ్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీమ్ I
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ II
ఆర్ధ్రాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీమ్
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావాహ II
తాం మావాహ జాతవేదో లక్ష్మీం మనపగామినీమ్ I
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోஉశ్వాన్, విందేయం పురుషానహమ్ II
యః శుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్య మన్వహమ్ II
శ్రియః పచదశర్చం చ శ్రీకామః సతతం జపేత్ II
ఆనన్దః కర్దమ శ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః ఋషయస్తే త్రయః ప్రోకాస్వయాం శ్రీరేవ దేవతా II
పద్మాసనే పద్మోరుపద్మాక్షీపద్మసంభవే త్వం మాం భజస్వ పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహమ్ II
అశ్వదాయీచ గోదాయీ ధనదాయీ మహాధనే I
ధనం మే జుషతాం దేవీ సర్వకామాంశ్చ దేహిమే II
పుత్రపౌత్ర ధనం ధాన్యం హస్త్యశ్వాది గవే రథమ్ I
ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతుమామ్ II
ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః I
ధన మింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే II
చంద్రాభాం లక్ష్మీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీమ్ I
చంద్రసూర్యాగ్ని వర్ణాభాం శ్రీ మహాలక్ష్మీం ముపాస్మహే II
వైనతేయ సోమం పిబసోమం పిబతు వృత్రహా II
సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినిః II
న క్రోధో న చ మాత్సర్యం న లోభోనాశుభా మతిః
భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీ సూక్తం జపే త్సదా II
వర్షంతుతే విభావరి దివో అభ్రస్య విద్యుతః I
రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మద్విషో జహి II
పద్మపియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షీ
విశ్వప్రియే విష్ణు మనోஉనుకూలే తత్పాద పద్మంమయీ సన్నిధత్స్వ II
యాసా పద్మాసనస్థా విపులకఠితటీ పద్మపత్రాయతాక్షీ I
గంభీరా వర్తనాభిః స్తనభర నమితా శుభ్ర వస్త్రోత్తరీయా II
లక్ష్మీర్దివ్యైర్గజేంద్రై మణిగణ ఖచితైస్స్నాపితా హేమ కుంభైః I
నిత్యం సా పద్మహస్తా మమ వసతుగృహే సర్వ మంగల్యయుక్తా I
“లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీమ్
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్
శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియామ్” II
సిద్దలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీ లక్ష్మీ సర్వ లక్ష్మీశ్చ ప్రసన్నా మమసర్వదా I
వరాంకుశౌ పాశమ భీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థామ్ బాలార్క కోటిప్రతిభాం
త్రినేత్రాం భజేஉహమంబాం జగధీశ్వరీం త్వామ్
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోஉస్తుతే II
మహాలక్ష్మీచ విద్మహే విష్ణు పత్నీచ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్
ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః
ఋణరోగాది దారిద్ర్య పాపక్షుద్ర మమృత్యవః
భయశోక మనస్తాపా నశ్యంతు మమ సర్వదా
Also Read: ఆధ్యాత్మికంగా 24 కు ఇంత ప్రత్యేకత ఉందా!
Also Read: స్నానం చేయకుండా వంట చేస్తున్నారా, ఆ భోజనం తిన్నవారు ఎలా తయారవుతారో తెలుసా