Geetha Jayanthi2022: సాక్షాత్తూ శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన జీవిత సారాంశమే భగవద్గీత. కురుక్షేత్ర సంగ్రామంలో తన సోదరులని, బంధువులని, గురువులని, స్నేహితులని చూసి, హృదయం వికలమై.. రాజ్యం కోసం వారిని నేను వధించలేనని బాధపడిన అర్జునుడికి చెప్పిన బ్రహ్మజ్ఞానం భగవద్గీత. ఈ పవిత్రగ్రంధ్రం ఆవిర్భవించిన రోజైన మార్గశిర శుక్ల ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటారు. భగవధ్గీతలో మొత్తం 700 శ్లోకాలున్నాయి. ఉరకల పరుగుల జీవనంలో మొత్తం చదివే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. అందుకే చదివిన వారికి ఎంతవరకూ అర్థమైంది, చదవని వారు తెలుసుకోవాల్సిన విషయాలను కొన్ని ప్రశ్నలు
సమాధానాల రూపంలో ఇస్తున్నాం.
1. భగవద్గీతను రాసినదెవరు?
విఘ్నేశ్వరుడు
2. భగవద్గీత మహాభారతంలో ఏ పర్వంలోని భాగం?
భీష్మ పర్వము.
3. గీతాజయంతి ఏ మాసంలో ఎప్పుడు వస్తుంది?
మార్గశిర మాసం, ఏకాదశి
4. గీతాజయంతి ఏ ఋతువులో వస్తుంది?
హేమంత ఋతువు
5. ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పాడు?
వసంత ఋతువు
6. భగవద్గీత ఎవరు ఎవరికి బోధించారు?
శ్రీకృష్ణుడు అర్జునుడికి
7. భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించింది?
కురుక్షేత్ర సంగ్రామం
8. భగవద్గీత బోధిస్తున్న సమయంలో ఎవరెవరికి యుద్ధం జరుగుతోంది?
కౌరవ పాండవులకు
9. పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారధి?
అర్జునుడు
10. వేదాల్లో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పాడు?
సామవేదం
11. మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి?
పాంచజన్యం
12. భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలున్నాయి?
పద్దెనిమిది (18)
13. “నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడ్డాయో, నా బుద్ధి వికాసానికి భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడింది” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోథుడెవరు?
వినోబా భావే
14.“సంశయములు నన్నావరించినపడు, సంకటములు సంప్రాప్తమైనపుడు, నిరాశా నిస్పృహలు జనించినపుడు నేను భగవద్గీత తెరచి చూస్తా. అందు ఏదో ఒక శ్లోకము నన్నూరడించును.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?
మహాత్మా గాంధీ
15. భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు?
సంజయుడు.
16. సేనానాయకుల్లో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాడు?
కుమారస్వామి.
17. మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేంటి?
దేవదత్తం
18. భగవద్గీతలో వ్యాసుడు ఎన్ని ఛందస్సులు రాశారు?
ఐదు. (అనుష్టుప్, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, ఉపజాతి, విపరీతపూర్వ)
19. భగవద్గీతను సాక్షాత్తుగా (లైవ్) వినినవారెవరు?
నలుగురు ( అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు)
20. ఆయుధాలు ధరించిన వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాడు?
శ్రీరామచంద్రుడు
Also Read: ఈ రోజు గీతా జయంతి - భగవద్గీత మత గ్రంధం కాదు మనిషిగా ఎలా బతకాలో చెప్పే మార్గదర్శి
21. భగవద్గీతలో శ్రీకృష్ణునికి వాడిన ఏవైనా మూడు పేర్లు?
అచ్యుత, అనంత, జనార్ధన
22. భగవద్గీతలో అర్జునునికి వాడిన ఏవైనా మూడు పేర్లు?
ధనుంజయ, పార్ధ, కిరీటి
23. శ్రీకృష్ణపరమాత్మ తన అవతార సమయంలో రెండు గానాలు చేశాడు. ఒకటి మురళీగానం. మరి రెండోది?
గీతా గానం
24.“ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్” అనే పేరుతో భగవద్గీతను ఆంగ్లభాషలో పద్యరూపంలో వ్రాసిన ఆంగ్లకవి ఎవరు?
ఎడ్విన్ ఆర్నాల్డ్
25. మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు ఊదిన శంఖం పేరేమిటి?
పౌండ్రము
26. ఏకాదశ రుద్రుల్లో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాడు?
శంకరుడు
27.“నా తల్లి చాలా కాలం క్రితమే మరిణించింది. అప్పటినుంచీ భగవద్గీత ఆ స్థానం ఆక్రమించి పక్కనే ఉండి నన్ను కాపాడిందని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?
మహాత్మాగాంధీ.
28. భగవద్గీత ఏ వేదంలోది?
పంచమ వేదం-మహాభారతం
29. భగవద్గీతలో ఎన్నో అధ్యాయంలో విశ్వరూప సందర్శన ప్రత్యక్షంగా వర్ణించి ఉంటుంది?
11వ అధ్యాయము
30. ద్వాదశాదిత్యుల్లో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాడు?
విష్ణువు
31. భగవద్గీత మొదటి అధ్యాయం పేరేంటి?
అర్జున విషాద యోగం
32. భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పిన మహారథుడు అనగా ఎంతమంది యోధులతో ఒక్కడే యుధ్ధము చేయగలడు?
పదివేలమంది
33. మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖం పేరేమిటి?
అనంతవిజయం
34. భగవద్గీత మొదటి శ్లోకం ఏ పదం (శబ్దము)తో ప్రారంభమవుతుంది?
“ధర్మ” – శబ్దముతో గీత ప్రారంభమయినది.
35. ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతీ విషయమును గీత సంవాదముతో సహా ఎప్పటికపుడు ప్రత్యక్షంగా (లైవ్) వివరించినదెవరు?
సంజయుడు
36. భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటిరోజున పాండవుల తరపున వ్యూహ రచన చేసినది ఎవరు?
దృష్టద్యుమ్నుడు.
37. ఆయుధాలలో తాను ఏ ఆయుధమని శ్రీకృష్ణుడు చెప్పాడు?
వజ్రాయుధం
38. మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల యుద్ధవ్యూహం పేరేమిటి?
వజ్ర వ్యూహం
39. గీతా సంవాదం జరిగిన మహాభారత సంగ్రామ మొదటి రోజున కౌరవుల సేనాపతి ఎవరు?
భీష్ముడు
40. సర్పాల్లో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పాడు?
వాసుకి
2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి