Geetha Jayanthi2022: భగవద్గీత అర్జునుడి ద్వారా సర్వజగత్తుకూ ఉపదేశించిన బ్రహ్మవిద్యాశాస్త్రం. ఈ పవిత్రగ్రంధం ఆవిర్భవించిన రోజైన మార్గశిర శుక్ల ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటారు. భగవద్గీత పూజించడానికో, పఠించడానికో నిర్దేశించింది కాదు.. మనిషిగా బతకడానికి కావాల్సిన సూత్రాలు అందించిన గ్రంధం.


భగవద్గీత శ్లోకాలు వినిపించగానే..అక్కడ ఎవరో చనిపోయి ఉంటారు అందుకే భగవద్గీత పెట్టారనే వారి సంఖ్య ఎక్కువే.  కేవలం ఎవరైనా చనిపోయినప్పుడు వినే గ్రంధంగా మైండ్ ట్యూన్ అయిందంటే తప్పెక్కడుంది. భగవద్గీత వింటున్నా అని ఎవరైనా చెప్పినప్పుడు ఎందుకంత వైరాగ్యం అంటారు. వాస్తవానికి భగవద్గీత అంటే వైరాగ్యం కాదు చేయాల్సిన కార్యాన్ని గుర్తుచేస్తూ కర్తవ్య నిర్వహణను  సూచించే ప్రేరకం. భగవద్గీత అంటే జీవిత చరమాంకంలో కాలక్షేపం కోసం చదివే పుస్తకం కాదు... రకరకాల ఉద్రేకాల మధ్య కొట్టుకుపోతున్న యువత వాటినుంచి ఎలా బయటపడాలో చెప్పే గ్రంధం. జీవితంలో ప్రతి మలుపులోనూ ఉపయోగపడుతుంది. ఎదురయ్యే ప్రతిప్రశ్నకీ సమాధానం ఇస్తుంది.  సాక్షాత్తూ శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించిన జీవిత సారాంశమే భగవద్గీత. కురుక్షేత్ర సంగ్రామంలో తన సోదరులని, బంధువులని, గురువులని, స్నేహితులని చూసి, హృదయం వికలమై.. రాజ్యం కోసం వారిని నేను వధించలేనని బాధపడిన అర్జునుడికి చెప్పిన బ్రహ్మజ్ఞానం భగవద్గీత. ఈ పవిత్రగ్రంధ్రం ఆవిర్భవించిన రోజైన మార్గశిర శుక్ల ఏకాదశిని గీతా జయంతిగా జరుపుకుంటారు. భగవధ్గీతలో మొత్తం 700 శ్లోకాలున్నాయి. 


Also Read: ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు


మహాభారతంలో  భీష్మ పర్వం 25వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయం వరకు 18 అధ్యాయాలు భగవద్గీతగా చెబుతారు. ఒక అధ్యాయాన్ని ఒక యోగం అంటారు. ఆరు యోగాలని కలిపి ఒక షట్కమంటారు. 1 నుంచి 6 అధ్యాయాలను కర్మ షట్కమని, 7 నుంచి 12 వరకు భక్తి షట్కమని, 13 నుంచి 18 వరకు జ్ఞాన షట్కమని అంటారు. మహా భారతంలో భగవద్గీత ఒక భాగమైనా, భగవద్గీతకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక్క భగవద్గీత ఎన్నో పురాణేతిహాసాలకు సమానం. అంటే అన్నీ ఇతిహాసాలు చదవనక్కరలేదు ఒక్క భగవద్గీత చదివితే చాలు, జీవిత పరమార్ధం తెలుస్తుంది. కర్తవ్య విముఖుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి, కర్తవ్యం వైపు మళ్ళించడమే గీత లక్ష్యం. 


శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం ఎందుకు చేశాడో రెండో అధ్యాయంలోనే స్పష్టం చేశాడు. ‘క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప’- క్షుద్రమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని వీడమని హెచ్చరించాడు. ఈ హృదయమే అన్ని ఆలోచనలకూ, రాగద్వేషాలకు కేంద్రం. బుద్ధిస్థితిలో ఆలోచన ఉంటుంది. తర్కం పనిచేస్తుంది. హృదయం దగ్గరికి వచ్చేసరికి భావోద్వేగాలు, ఆశాపాశాలు, మాయామోహాలు అడుగు ముందుకు వేయకుండా కళ్లెం వేస్తాయి. అందుకే హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టమని చెప్పిన తర్వాతే బోధ ప్రారంభించాడు. 


Also Read: డిసెంబర్ నెల ఈ 5 రాశులవారికి బావుంది, ఆ రాశివారికి అత్యద్భుతంగా ఉంది


గీతోపదేశంలో శ్రీకృష్ణుడు అస్త్రశస్త్రాల విశేషాల గురించి చెప్పలేదు. వాటిని ఎలా సంధించాలో వివరించలేదు. యుద్ధ వ్యూహాలు నేర్పించలేదు. శత్రువులను సంహరించే మెలకువలనూ నేర్పలేదు. ఈ విషయాలన్నింటిలో తనకు తానే సాటి అయిన అర్జునుడిని ఆవహించిన మాయను తొలగించి రణరంగంలోకి దిగేలా బోధించాడు. ‘నీకు నిర్దేశించిన కర్మలను నువ్వు చేయడమే సరైనది. దేనినీ చేయకపోవడం కన్నా నీ ధర్మాన్ని అనుసరించి పని చేయడమే ఉత్తమం. ఏ పనీ చేయకుండా ఉంటే శరీర నిర్వహణ కూడా ముందుకు కొనసాగదు’. ‘అర్జునా! యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గం లభిస్తుంది. గెలిస్తే రాజ్యలక్ష్మి సిద్ధిస్తుంది. ఏదైనా ప్రయోజనమే, కృతనిశ్చయంతో యుద్ధానికి సిద్ధమవ్వు’ అని పార్థుడికి బోధించాడు  శ్రీకృష్ణుడు.  చెప్పడం వరకే ఆయన పని, చెప్పింది శ్రద్ధగా విన్నాడు. విన్నది అర్థం చేసుకున్నాడు, అర్థమైన దాన్ని అర్థవంతంగా ఆచరించి తన కర్తవ్యాన్నినిర్వర్తించాడు అర్జునుడు.  


2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి