Ganesha Nimajjanam 2024: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వినాయక నిమజ్జనం కన్నుల పండువగా జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో గణపతి శోభాయాత్ర చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. నగరంలో అన్ని ప్రాంతాల నుంచి శోభాయాత్ర జరిగి చివరకు హుస్సేన్ సాగర్ చేసుకుంటాయి వినాయకుడి విగ్రహాలు. అటు ఆంధ్ర ప్రదేశ్ లో భీమిలి, రుషికొండ, విశాఖ బీచ్ లతో పాటూ గోదావరిలో, విజయవాడలో భవానీ ద్వీపం, తెలంగాణలో నాగార్జున సాగర్ ప్రాంతాల్లో నిమజ్జనోత్సవాలు ఘనంగా జరుగుతాయి...
రుషికొండ, ఆంధ్రప్రదేశ్ (Rushikonda)
విశాఖపట్నం - భీమిలి రహదారికి సమీపంలో ఉన్న అందమైన ప్రదేశం రుషికొండ. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈ ప్రదేశం గణేష్ నిమజ్జనం సమయంలో భక్తుల రద్దీతో కళకళలాడిపోతుంది. "జై బోలో గణేష్ మహారాజ్ కీ జై" అనే నినాదాలతో ప్రాంతమంతా మారుమోగిపోతుంది.
Also Read: గణేష్ నిమజ్జనం సమయంలో చేయాల్సినవి చేయకూడనివి ఇవే!
భీమిలి బీచ్ (Bheemili Beach)
భీమిలి బీచ్ విశాఖపట్నం నుంచి దాదాపు 24 కిలోమీటర్ల దూరంలో గోస్తని నది మూలం వద్ద ఉంది. ఏపీకి వచ్చే పర్యాటకులను ఆకర్షించే ముఖ్యమైన ప్రదేశాల్లో ఇంద౧కటి. విద్యుత్ కాంతుల మధ్య వెలిగిపోయే భారీ గణపయ్యలను చూసేందుకు రెండు కళ్లు సరిపోవు...
భవానీ ద్వీపం (Bhavani Island)
కృష్ణా నది మధ్యలో ఉన్న భవానీ ద్వీపం భారతదేశంలోని అతిపెద్ద నదీ ద్వీపాలలో ఒకటి అని చెబుతారు. వినాయక నిమజ్జనోత్సవాలకు ఈ ప్రదేశం చాలా ప్రసిస్ధి. రంగు రంగుల వినాయక విగ్రహాలతో భవానీ ద్వీపం వెలిగిపోతుంది. ఇంకా దుర్గా ఘాట్, పున్నమి ఘాట్ సహా పలు ఘాట్లలో వినాయక విగ్రహాల నిమజ్జనం సందడి సాగుతుంది...
హుస్సేన్ సాగర్ (Hussain Sagar)
హైదరాబాద్ బాలో వినాయక నిమజ్జన వేడుకల సందడి అంటే ట్యాంక్ బండ్ పైనే. నగరంలో అతి పెద్ద గణపయ్య అయిన ఖైరాతాబాద్ వినాయకుడి నిమజ్జనం ఓ పెద్ద క్రతువు. ఒకప్పుడు ఈ గణపతి నిమజ్జనానికి రెండు మూడు రోజులు కూడా సమయం పట్టేసేది.. కానీ ఇప్పుడు హైదరాబాద్ నగర పోలీసుల ప్లానింగ్ కారణంగా కొన్ని గంటల్లోనే ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం పూర్తైపోతోంది. ఈ సమయంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అడుగుపెట్టేందుకు కూడా అవకాశం లేనంత రద్దీ సాగుతుంది. ఈ ఏడాది తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ పరిధిలోని ట్యాంక్ బండ్‌పై నిమజ్జనానికి అనుమతి లేదు..కేవలం NTR మార్గ్, నెక్లెస్ రోడ్డులో నిమజ్జనానికి సర్వం సిద్ధం చేశారు.
Also Read: గణేష్ నిమజ్జనం 11వ రోజే ఎందుకు..ఆ రోజుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా!
నాగార్జున సాగర్ (Nagarjuna Sagar)
తెలంగాణ - ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల మధ్య ఉన్న నాగార్జున సాగర్ ఏడాది పొడవునా సందర్శించవలసిన ప్రముఖ ప్రదేశాలలో ఒకటి. గణేష్ నిమజ్జనోత్సవాలు జరిగే సమయంలో సాగర్ సమీపంలో ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు. పండుగ ఉత్సాహం మొత్తం ఇక్కడే ఉందా అనిపిస్తుంది. వినాయక నిమజ్జనోత్సవాలు సందర్శించాలి అనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్.
నిమజ్జనం చేసే సమయంలో పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నించండి. విగ్రహాల అలంకరణ కోసం వినియోగించే వస్తువులు ముందుగానే తొలగించండి.. నిమజ్జనం సమయంలో విగ్రహంతో పాటూ కవర్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు నీటిలో పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి..మీరు అవగాహన పెంచుకోవడంతో పాటూ ఇతరులకు కూడా పర్యావరణంపై అవగాహన కల్పించండి..మీ బాధ్యతగా పర్యావరణాన్ని రక్షించండి..
Also Read: మనదేశంలో గణేష్ నిమజ్జనానికి బెస్ట్ ప్లేసెస్ ఇవే!