Broom: సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనం దీపావళి. ఈ రోజు ఏ ఇంట దీపాలు వెలుగులు విరజిమ్ముతాయో ఈ ఇంట్లో శ్రీ మహాలక్ష్మి అడుగుపెడుతుందని విశ్వశిస్తారు. అందుకే వెండి, బంగారం వస్తువులతో పూజ చేస్తారు. అయితే ఈ రోజు శ్రీయంత్రం, దక్షిణావర్తి శంఖం కొనుగోలు చేస్తారు...ఇనుము వస్తువులు, పదునైన వస్తువులు కొనుగోలు చేయరు. ఏం కొన్నా లేకున్నా చీపురు మాత్రం దీపావళి రోజు కొనాలంటారు పండితులు. 


చీపురును లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారు..అందుకే దీపావళి రోజు చీపురు కొనుగోలు చేస్తే..శ్రీ మహాలక్ష్మి స్వయంగా ఇంటికొచ్చినట్టు భావిస్తారు. అందుకే కొత్త చీపురు కొనుగోలు చేసి తీసుకొచ్చి పూజచేసి..ఆ తర్వాత రోజు నుంచి ఉపయోగిస్తారు.  


Also Read: దీపావళి రోజు లక్ష్మీ పూజ ఏ సమయానికి చేయాలి - పూజా విధానం ఇదిగో ఫాలోఅయిపోండి!


దీపావళి రోజు మాత్రమే కాదు ఏ రోజైనా చీపురు కొనుగోలు చేయొచ్చు. శనివారం రోజు చీపులు కొనకూడదు.


ఇంట్లో బహిరంగ ప్రదేశంలో చీపురు ఉంచడం అశుభం అంటారు పెద్దలు.  ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నుంచి చూస్తే చీపురు ఎవరికీ కనిపించకుండా  ఉంచాలి. వినియోగించని చీపుర్లు ఇంట్లో ఉండకూడదు. చీపురుని ఉత్తర దిశగా పెట్టాలంటారు వాస్తు నిపుణులు. పూజగదిలో, పడకగదిలో చీపురు  ఉండకూడదు...ఈ రెండు ప్రదేశాల్లో చీపురు పెడితే వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయంటారు.  చీపురును కాళ్లతో తన్నడం, నిర్లక్ష్యంగా విసిరికొట్టడం చేయకూడదు.


Also Read: దీపావళి రోజు లక్ష్మీ దేవిని ఎలా స్వాగతించాలి - పూజలో అనుసరించాల్సిన ప్రత్యేక విషయాలేంటి!


శ్రీ దీపలక్ష్మీ స్తవం (Deepa Lakshmi Stavam) - శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి పారాయణ గ్రంథం


అంతర్గృహే హేమసువేదికాయాం
సమ్మార్జనాలేపనకర్మ కృత్వా |
విధానధూపాతుల పంచవర్ణం
చూర్ణప్రయుక్తాద్భుత రంగవల్యామ్ ||  


అగాధ సంపూర్ణ సరస్సమానే
గోసర్పిషాపూరిత మధ్యదేశే |
మృణాలతంతుకృత వర్తియుక్తే
పుష్పావతంసే తిలకాభిరామే || 


పరిష్కృత స్థాపిత రత్నదీపే
జ్యోతిర్మయీం ప్రజ్జ్వలయామి దేవీమ్ |
నమామ్యహం మత్కులవృద్ధిదాత్రీం
సౌదాది సర్వాంగణ శోభమానామ్ ||  


భో దీపలక్ష్మి ప్రథితం యశో మే
ప్రదేహి మాంగళ్యమమోఘశీలే |
భర్తృప్రియాం ధర్మవిశిష్ట శీలాం
కురుష్వ కల్యాణ్యనుకంపయా మామ్ ||  


యాంతర్బహిశ్చాపి తమోఽపహంత్రీ
సంధ్యాముఖారాధిత పాదపద్మా |
త్రయీసముద్ఘోషిత వైభవా సా
హ్యనన్యకామే హృదయే విభాతు ||  


భో దీప బ్రహ్మరూపస్త్వం జ్యోతిషాం ప్రభురవ్యయః |
ఆరోగ్యం దేహి పుత్రాంశ్చ అవైధవ్యం ప్రయచ్ఛ మే || 


సంధ్యాదీపస్తవమిదం నిత్యం నారీ పఠేత్తు యా |
సర్వసౌభాగ్యయుక్తా స్యాల్లక్ష్మ్యనుగ్రహతః సదా ||  


శరీరారోగ్యమైశ్వర్యం అరిపక్షక్షయః సుఖమ్ |
దేవి త్వద్దృష్టిదృష్టానాం పురుషాణాం న దుర్లభమ్ ||  


ఇతి శ్రీ దీపలక్ష్మీ స్తవమ్ |


Also Read: మీ బంధుమిత్రులకు దీపావళి శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో తెలియజేయండి!


శ్రీ దీపలక్ష్మీ స్తోత్రం  (Deepa Lakshmi Stotram) - శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి పారాయణ గ్రంథం
 
దీపస్త్వమేవ జగతాం దయితా రుచిస్తే
దీర్ఘం తమః ప్రతినివృత్యమితం యువాభ్యామ్ |
స్తవ్యం స్తవప్రియమతః శరణోక్తివశ్యం
స్తోతుం భవంతమభిలష్యతి జంతురేషః ||  


దీపః పాపహరో నౄణాం దీప ఆపన్నివారకః
దీపో విధత్తే సుకృతిం దీపః సంపత్ప్రదాయకః |
దేవానాం తుష్టిదో దీపః పితౄణాం ప్రీతిదాయకః
దీపజ్యోతిః పరం బ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః ||  


దీపో హరతుమేపాపం సంధ్యాదీప నమోస్తు తే ||  


ఫలశ్రుతిః |
యా స్త్రీ పతివ్రతా లోకే గృహే దీపం తు పూరయేత్ |
దీపప్రదక్షిణం కుర్యాత్ సా భవేద్వై సుమంగళా ||


ఇతి శ్రీ దీపలక్ష్మీ స్తోత్రమ్ ||