అక్టోబరు 31 రాశిఫలాలు


మేష రాశి


ఈ రోజు మీరు ఒత్తిడి లేకుండా ఉంటారు. పెండింగ్‌లో ఉన్న డబ్బు తిరిగి వస్తుంది. మీరు వ్యాపారంలో చాలా మంచి ఫలితాలను పొందుతారు. ప్రేమ సంబంధాలకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. అవివాహితుల వివాహాలు స్థిరపడతాయి. 


వృషభ రాశి


ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. సమయానుకూలంగా వర్కింగ్ స్టైల్‌లో మార్పులు తీసుకురావడం సముచితంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ రోజు చాలా బాగుంటుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. 


మిథున రాశి


ఈ రోజు చాలా మంచి రోజు. మీరు ప్రియమైన వ్యక్తిని కలుస్తారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.  పిల్లల కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచాలి. మీరు కార్యాలయంలో గౌరవం పొందుతారు. మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించండి.


Also Read: దీపావళి రోజు లక్ష్మీ పూజ ఏ సమయానికి చేయాలి - పూజా విధానం ఇదిగో ఫాలోఅయిపోండి!


కర్కాటక రాశి


మీరు వ్యాపారంలో ఊహించని లాభాన్ని అందుకుంటారు. రచనతో అనుబంధం ఉన్న వ్యక్తులు కొత్త విషయాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. మీ జీవిత భాగస్వామి మీ మనోధైర్యాన్ని పెంచుతారు. సానుకూల స్వభావం గల వ్యక్తులతో సమయం గడుపుతారు. మతపరమైన యాత్రను ప్లాన్ చేస్తారు. పెట్టుబడుల నుంచి లాభం ఉంటుంది.


సింహ రాశి


ఈ రోజు మీ సామర్థ్యం ప్రకారం పని చేయడం ద్వారా లాభం ఉంటుంది. కళ, సాహిత్యం,  సంగీతం పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. దూర ప్రయాణాలకు ప్రణాళికలు వేసుకోవచ్చు. ముఖ్యమైన వస్తువులను  మీతో ఉంచుకోండి. తోబుట్టువుల మద్దతు పొందుతారు. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి


కన్యా రాశి


మీరు ఈరోజు జీవితంలో కొత్తదనాన్ని అనుభవిస్తారు. రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. ఇంటికి అతిథులు రావచ్చు. మీ సలహాలు స్వీకరిస్తారు.  పెద్దల ఆశీస్సులు పొందుతారు. రాజకీయ పరిచయాలు లాభిస్తాయి. పిల్లల ప్రవర్తనతో చాలా సంతోషిస్తారు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.


Also Read: మీ బంధుమిత్రులకు దీపావళి శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో తెలియజేయండి!


తులా రాశి


ఈ రాశివారు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు బాగా సాగుతాయి. రోజంతా బిజీగా ఉంటారు. రాజకీయాల్లో ఉండేవారికి పదవీ కాంక్ష పెరుగుతుంది. మీరు ప్రజాసేవలో నిస్వార్థంగా వ్యవహరిస్తే మీ కీర్తి పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆధ్యాత్మిక వ్యవహారాలపై ఆసక్తి ఉంటుంది.


వృశ్చిక రాశి


ఈ రోజు అతిథుల రాకతో మీరు ఇబ్బంది పడవచ్చు.  వ్యాపారంలో నిపుణుల సలహాలు తీసుకున్నానే నూకన పెట్టుబడులు పెట్టాలి.  ప్రభుత్వ పనుల్లో కొంత ఆటంకాలు ఏర్పడవచ్చు. ప్రత్యర్థులు మిమ్మల్ని తక్కువ చేస్తారు. వైవాహిక జీవితంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది.


ధనస్సు రాశి


కొత్త వ్యక్తులతో సర్దుకుపోవడం సులభం అవుతుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది.  ప్రయోగాత్మకంగా ఏదైనా చేయాలనే కోరిక ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారంలో మార్పులు చేయవద్దు.


మకర రాశి


వ్యాపారంలో అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మతపరమైన ప్రదేశంలో ఒంటరిగా గడుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. స్నేహితులను కలుస్తారు. ఉన్నతాధికారులతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి.


Also Read: దీపావళి రోజు లక్ష్మీ దేవిని ఎలా స్వాగతించాలి - పూజలో అనుసరించాల్సిన ప్రత్యేక విషయాలేంటి!
 
కుంభ రాశి


ఈ రోజు మీరు వ్యాపారం కోసం అప్పు చేయాల్సి ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. మీరు విదేశాల నుంచి ఉద్యోగ ఆఫర్లను పొందవచ్చు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. 


మీన రాశి


కెరీర్‌కు సంబంధించి కొనసాగుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి. విద్యార్థులకు శుభ సమయం.  మేనేజ్‌మెంట్ రంగానికి సంబంధించిన వ్యక్తులు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. అపరిచితులను ఎక్కువగా నమ్మవద్దు. కుటుంబ కార్యక్రమాలతో బిజీగా ఉంటారు.


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.