క్రిస్మస్‌ పేరెలా వచ్చింది
కిస్మస్‌ అనే మాట క్రీస్తు-మాస్‌ అనే ఒక ఆచారం నుంచి వచ్చింది. ఏసు తమ కోసం మరణించి, పునరుద్ధానుడయ్యాడని క్రైస్తవులు విశ్వసిస్తారు. అందుకు గుర్తుగా అందరూ కలిసి ద్రాక్ష రసం, రొట్టె తీసుకుంటారు. ఆ కార్యక్రమాన్ని సమభోక్తం (కమ్మ్యూనియన్‌) అనే పేరుతో నిర్వహిస్తారు. సమభోక్తం సూర్యాస్తమయం తరువాత, సూర్యోదయం ముందు తీసుకోవచ్చు. అందువల్ల దానిని అర్ధరాత్రి తీసుకునేవాళ్లు. క్రీస్తు..మాస్‌ క్రమంగా క్రిస్మస్‌గా మారింది. 


Also Read: విసిరిన చెప్పు ఇంటి ముందు సరిగ్గా పడితే చాలు పెళ్లైపోతుంది, క్రిస్మస్ రోజు వింత సంప్రదాయాలివే!


క్రిస్మస్‌ అనాలా ఎక్స్‌ మస్‌ అనాలా 
క్రిస్టియానిటీ అనే పదాన్ని 1100వ సంవత్సర ప్రాంతంలో క్సియానిటీ అని పలికేవారు. ఆ పదం ఆంగ్ల అక్షరం ఎక్స్‌తో మొదలవుతుంది. గ్రీక్‌ భాషలో ఎక్స్‌ అనే అక్షరాన్ని కై అని పలుకుతారు. దాంతో గ్రీకు భాషలో క్రైస్తు పదంలో మొదటి అక్షరం ఎక్స్‌తో ఉండేది. 1551లో క్రిస్మస్‌ని ఎక్స్‌ టేమాస్‌ అనేవారు. క్రమేపీ అదే ఎక్స్‌మస్‌గా రూపాంతరం చెందింది. వాడుకలో ఎవరి వీలు వాళ్లది.


డిసెంబరు 25నే ఎందుకు
సుమారు 2 వేల సంవత్సరాల క్రితం రోమ్ ను పాలించే ఆగస్టస్ సీజర్ తన రాజ్యంలో ఎంత మంది ప్రజలున్నారో లెక్కించాడు. ఈ లెక్కలను ఈజీగా సేకరించేందుకు ప్రజలంతా ఎవరి స్వగ్రామాలకు వారు డిసెంబర్ 25వ తేదీలోపు చేరుకోవాలని ఆదేశించాడు. అదే సమయంలో రోమన్ రాజ్యంలో నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసెఫ్ పెళ్లి నిశ్చయమైంది. ఒకరోజున మేరీకి గాబ్రియేల్ అనే దైవదూత కలలో కనబడి ‘ఓ మేరీ! నీవు దైవానుగ్రహం పొందావు. కన్యగానే గర్భం దాల్చి ఓ కుమారుడికి జన్మనిస్తావని చెప్పాడు. పుట్టే బిడ్డకు ఏసు అనే పేరు పెట్టాలని చెప్పింది. ఏసు అంటే రక్షకుడు అని అర్థం. ఆ తర్వాత అచ్చం దేవదూత చెప్పిన విధంగానే మేరీ ప్రెగ్నెంట్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న జోసెఫ్ ఆమెను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఒకసారి జోసెఫ్ కలలో కనిపించిన దైవదూత ‘మేరీని విడిచిపెట్టకు.. ఆమె దేవుని వరంతో గర్భం దాల్చిందని..ఆమెకు పుట్టిన బిడ్డ దేవుడి బిడ్డ..నమ్మిన ప్రజలకు పాపాల నుంచి విముక్తి కల్పిస్తాడని చెప్పాడు. దైవదూత మాటమేరకు జోసెఫ్..మేరీని ప్రేమతో ఆదరించాడు.


Also Read: చెడు పనులు చేస్తే బొగ్గు - మంచి పనులు చేస్తే బహుమతి, ఆ దేశంలో శాంటాక్లాజ్ బదులు మంత్రగత్తె


రాజు ఆదేశాల మేరకు జోసెఫ్, మేరీలు తమ స్వగ్రామమై బెత్లేహామ్ కు వెళ్లినప్పటికీ వారికి ఉండటానికి చోటు దక్కలేదు. చివరికి ఒక సత్రం యజమాని తన పశువుల పాకలో వారికి ఆశ్రయం కల్పించాడు. అక్కడే మేరీ ఏసుకు జన్మనిచ్చింది. ఆ రాత్రి ఆ ఊరి పక్క పొలాల్లో కొంతమంది తమ గొర్రెల మందలకు కాపలా కాస్తుండగా.. ఆ సమయంలో ఆకాశంలో నుంచి ఓ వెలుగు రావడంతో గొర్రెల కాపరులంతా భయపడ్డారు.  అప్పుడు దైవదూత ‘మీరు భయపడొద్దు.. ఓ శుభవార్తను చెప్పడానికి ఇక్కడికొచ్చాను ఈరోజు లోకరక్షకుడు పుట్టాడు. ఆయనే మీ అందరికీ ప్రభువు అని అన్ని ఆనవాళ్లు చెబుతాడు. పశువుల పాకలో పుట్టిన బిడ్డని చూసి దేవదూత చెప్పిన విషయాన్ని ఆ గొర్రెల కాపరులు అందరికీ చెబుతారు. అప్పుడు సమయం డిసెంబరు 24 అర్థరాత్రి. అప్పటి నుంచి డిసెంబర్ 25వ తేదీన ఏటా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు.


2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి