Christmas 2022: క్రిస్మస్ అంటేనే కానుకల పండుగ. అందుకే చిన్న పిల్లలకు ఈ పండుగ అంటే భలే ఇష్టం. కుటుంబ సభ్యులు కొందరు శాంటాక్లాజ్ గా మారి సర్ ప్రైజ్ గిఫ్టులు ఇస్తుంటారు. కొందరైతే పేదలకు ఆహారం, బహుమతులు అందిస్తారు. మరికొందరు వారితోనే వేడుక జరుపుకుంటారు. అసలు క్రిస్మస్ అంటేనే ట్రీ, శాంటా క్లాజ్ . అందుకే ఈ పండుగ వచ్చిందంటే వీటిపై చాలా దృష్టి పెడతారు. ఇంటిని అందంగా అలంకరించడం, ఆ చెట్టుకింద బహుమతులు పెట్టి ఇంట్లో వాళ్లని సర్ ప్రైజ్ చేయడం చేస్తుంటారు. అంతా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటారు. కొంచెం స్పెషల్ గా జరుపుకోవాలనుకునే వారు రమ్ కేక్, హాట్ చాక్లెట్ మేకింగ్ చేస్తుంటారు. అయితే అలంకారం, కేక్, బహుమతులు ఇవన్నీ కామన్...కొన్ని దేశాల్లో వింత వింత సంప్రదాయాలు ఫాలో అవుతుంటారు. అవేంటంటే...
Also Read: డిసెంబర్ నెల ఈ 5 రాశులవారికి బావుంది, ఆ రాశివారికి అత్యద్భుతంగా ఉంది
- స్లోవాకియాలో క్రిస్మస్ రోజున ఒక విచిత్ర సాంప్రదాయం అమలుచేస్తారు. పెళ్లి కానివారు ఆ రోజు గుమ్మానికి అంటే ఇంటి ఎంట్రన్స్ కి వెనక్కు తిరిగి నిల్చుని చెప్పు తీసి విసురుతారు. ఆ చెప్పు ఇంటి ముందు సరిగ్గా పడిందంటే త్వరలో పెళ్లవుతుందని నమ్ముతారు
- పాశ్చాత్య దేశాల్లో క్రిస్మస్ రోజు సాంప్రదాయంగా 'టర్కీ' పక్షిని తింటారు
- జపాన్లో చికెన్ అమ్మకాలు మామూలు రోజులకన్నా పదిరెట్లు ఎక్కువగా ఉంటాయి
- అంతటా ప్లం కేక్ సాంప్రదాయంగా ఉంటే జపాన్‌లో స్పాంజ్ కేక్ ఎక్కువ.. అయితే క్రిస్మస్ రోజు అమ్మకం కాని కేకులను ఆ తర్వాత రోజు ఎవ్వరూ కొనుగోలు చేయరు, ఇంట్లో ఉండిపోయినవి కూడా తినరు... పారేయాల్సిందే...
- ఫిన్లాండ్‌లో క్రిస్మస్ ముందురోజు సాయంత్రం స్మశానాలకి వెళ్లి వారి ఆత్మీయులను తలచుకుంటూ వారి సమాధులపై కొవ్వొత్తులు వెలిగిస్తారు. ఆ రోజు వంట చేసి అవన్నీ బల్లపై పెట్టేసి..మంచాలు సిద్ధం చేసి ఇంట్లో వాళ్లంతా నేలపై పడుకుంటారు. గతించిన వారు వచ్చి తినేసి పడుకునేందుకు వీలుగా అలా చేస్తారట
- స్వీడన్లో పట్టణ వీధుల్లో భారీ మేక బొమ్మను నిలబెడతారు. క్రిస్మస్ ఈవ్ అర్ధరాత్రి ఆ మేకను కాల్చేస్తారు. ఈ సాంప్రదాయం 1966లో మొదలయ్యింది.
- మామూలుగా అయితే క్రిస్మస్ ట్రీకి అందమైన దీపాలు, గంటలు, బొమ్మలు వేలాడదీస్తారు. కానీ ఉక్రెయిన్‌లో ఆ చెట్టుకు సాలెపురుగు గూళ్లను వేలాడదీస్తారు. దీని వెనుక స్థానికులు ఓ కథ చెబుతారు...ఒక నిరుపేద కుటుంబానికి క్రిస్మస్ చెట్టుని అలంకరించే స్థోమత లేదు. ఆ చెట్టుకి అప్పటికే సాలెగూళ్లు అల్లుకుని ఉన్నాయి. క్రిస్మస్ రోజు తొలి సూర్య కిరణం తగలగానే ఆ సాలెపోగులే బంగారం, వెండి పోగులుగా కనిపించి సంతోషాన్ని కలిగించాయట. అందుకే సాలెగూళ్లను వేలాడదీస్తారు
Also Read: చెడు పనులు చేస్తే బొగ్గు - మంచి పనులు చేస్తే బహుమతి, ఆ దేశంలో శాంటాక్లాజ్ బదులు మంత్రగత్తె
ఇంకా ఒక్కో దేశంలో ఒక్కో పద్ధతి.. కొన్ని కొన్ని దేశాల్లో వింత సంప్రదాయాలు. ఏవరు ఏం అనుసరించినా ప్రతి పండుగ ఉద్దేశం కుటుంబాల్లో, సమాజంలో సంతోషం నింపాలి. ఇరుగు-పొరుగు వారితో సత్సంబంధాలు నెలకొనాలి. సాటివారిపై ప్రేమ, కరుణ పెరగాలి.
2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి