Chanakya Niti In Telugu:  చాణక్య నీతిలో ప్రస్తావించిన అంశాలను అనుసరించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే ఏ సమస్య నుంచి అయినా బయటపడొచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు ఆచార్యుడిగా చాణక్యుడు బోధనలు నేటి తరం కూడా పాటించేలా ఉంటాయి. విద్యార్థి జీవితం విలువైనది అందుకే దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి, చదువు పట్ల సీరియస్ గా ఉండాలి, ఆజాగ్రత్త, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని చాణక్యుడు విద్యార్థులకు బోధించాడు.  జీవితంలో అత్యంత ముఖ్యమైన ఈ దశలో ఏ చిన్న తప్పు చేసినా ఆ ప్రభావం జీవితం మొత్తం ఉంటుందని హెచ్చరించాడు చాణక్యుడు. . అలాగే విద్యార్థులు చదువు పట్ల సీరియస్‌గా ఉండాలి. అజాగ్రత్త, చెడు సహవాసం మరియు సోమరితనం విద్యార్థి జీవితానికి అత్యంత హాని కలిగిస్తాయి. విద్యార్థుల జీవితం విలువైనదని చాణక్య నీతి చెబుతోంది. ఇది విద్యార్థి జీవితంలో ఒక ముఖ్యమైన దశ, ఇక్కడ ఒకసారి తప్పు చేయడం మొత్తం జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే విద్యార్థి జీవితం మొత్తం విద్యకు మాత్రమే అంకితం కావాలి...అప్పుడే తమ లక్ష్యాలను సులభంగా సాధిస్తారని బోధించాడు చాణక్యుడు. విద్యార్థి దశలో తప్పనిసరిగా అనుసరించాల్సిన విషయాలివే...


Also Read: ఈ యూనివర్శిటీలో సిలబస్ ఉండదు...కోర్సుకి కాలపరిమితి లేదు…పరీక్షలుండవు.. నేర్చుకున్న విద్యే కొలమానం…


సకాలంలో పనులు పూర్తిచేయాలి (Time Sense)


చేయాల్సిన పనులు, ప్రాజెక్టులు సకాలంలో పూర్తిచేయాలి. ముఖ్యంగా విద్యార్థి దశలో వాయిదా అనే మాటకు అవకాశం ఇవ్వకూడదు. ఏ పని అయినా పూర్తిచేసేందుకు నిర్ణీతసమయం పెట్టుకున్నప్పుడే కెరీర్లో దూసుకెళ్లగలరు...


క్రమశిక్షణ (Discipline)


విద్యార్థి జీవితంలో క్రమశిక్షణ చాలా చాలా ముఖ్యం అని బోధించాడు ఆచార్య చాణక్యుడు. క్రమశిక్షణ లేని విద్యార్థులు కేవలం చదువుకునే దశలోనే కాదు కెరీర్లో కూడా అస్సలు సక్సెస్ కాలేరు. క్రమశిక్షణ ఉన్న విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే తమ లక్ష్యాలను సులభంగా సాధిస్తారు. 


Also Read: భర్త దగ్గర భార్య కామన్ గా దాచే 6 ముఖ్యమైన విషయాలు!


చెడు స్నేహాలు (Bad Friends)


బాగుపడాలన్నా, చెడిపోవాలన్నా నిర్ణయించేది మీ చుట్టూ ఉన్న స్నేహాలే. ఫ్రెండ్స్ ఉత్తములు, క్రమశిక్షణ కలిగినవారు అయినప్పుడు మీరు కూడా అలానే ఉంటారు. మీ స్నేహితులు వ్యసనపరులు, సమయపాలన, క్రమశిక్షణ లేనివారు అయితే మీలో ఎన్ని మంచి లక్షణాలున్నా అవన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. అక్కడి నుంచే మీ పతనం ప్రారంభమవుతుంది. అందుకే విద్యార్థి దశలో ఉండే స్నేహాలు మీ భవిష్యత్ ను నిర్ణయిస్తాయని మర్చిపోకూడదు. 


Also Read: పడకగది పనులు కూడా బహిరంగం.. కాకిని చూసి ఈ విషయాలు నేర్చుకోవాలన్న చాణక్యుడు


వ్యసనాలకు బానిస కావొద్దు  (Don't be Addicted to Addictions)


విద్యార్థి దశలో బాగుపడే విషయాలపై కన్నా చెడగొట్టే విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెరుగుతుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మంచి కన్నా చెడే ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది. అందుకే ఈ దశలో వ్యసనాలకు దూరంగా ఉంటేనే భవిష్యత్ వెలుగుతుంది. చెడు అలవాట్లు విజయానికి ఆటంకం మాత్రమే కాదు..శరీరాన్ని, సంపదను నాశనం చేస్తుంది. ఇంటా బయటా గౌరవం తగ్గిస్తుంది..ఎన్నో సమస్యలు, మరెన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.


Also Read: తెలివైనవాడికి శత్రువులు ఎందుకుండరు?


సోమరితనం (laziness)


విద్యార్థులకు సోమరితనం పెద్ద శత్రువు అని చాణక్య నీతి చెబుతోంది. సోమరితనానికి దూరంగా ఉంటేనే నిర్ధేశించుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు...దానికి అవసరమైన కృషి చేయగలుగుతారు.