అక్టోబరులో జన్మించినవారెలా ఉంటారంటే
- అక్టోబరులో పుట్టినవారు ఆకర్షణీయంగా ఉంటారు. ఈ వ్యక్తులు ఎవరినైనా మంత్రముగ్ధులను చేయగల సాటిలేని మనోజ్ఞతను కలిగి ఉంటారు. వీరితో స్నేహంగా ఉండేందుకు చాలామంది తాపత్రయపడతారు. వీరి ఆశావాదం, సానుకూల ధృక్పథం ఎదుటివారిని ప్రభావితం చేస్తుంది.
- అక్టోబరులో జన్మించిన వారు ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారు. తమ భావాలను, భావోద్వేగాలను మనసులోనే దాచుకునేందుకు ఇష్టపడతారు. వీరు అంతర్ముఖులు.
- శత్రువుల కన్నా స్నేహితులను సంపాదించుకోవడమే గొప్పతనం అని నమ్ముతారు. అందుకే వీరివల్ల చాలామందికి మేలు తప్ప హాని జరగదు.
- ఇతరుల సమస్యలపట్ల చాలా సున్నితంగా ఉంటారు. తమవంతు అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంటారు.
- పట్టుదలకు కేరాఫ్ అన్నట్టు ఉంటారు అక్టోబరులో పుట్టిన వ్యక్తులు. పని మొదలుపెట్టరు..పెట్టారంటే పూర్తిచేయనిదే వదలరు. ఎంత కష్టమైన పని అయినా తమ సామర్థ్యంలో పూర్తిచేస్తారు. ఈ కారణంవల్లే ఇతరులతో కన్నా సింగిల్ గా పనిచేయడానికే ఇష్టపడతారు.
- జీవితంలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంటారు, ఓ దశలో పూర్తిగా నిరుత్సాహపడతారు..కానీ పడిలేచిన కెరటంలా కెరీర్లో దూసుకెళతారు.స్థిరమైన జావితాన్ని ఆస్వాదించగలుగుతారు.
- అక్టోబర్‌లో జన్మించిన వారు విలాసవంతమైన వస్తువులను కలిగి ఉండటానికి ఇష్టపడతారు. తమ కోసం ఖర్చు చేయడమే కాదు, తమ ప్రియమైన వారికోసం కూడా ఖర్చుచేయడంలో ముందుంటారు.
- ఈ నెలలో పుట్టినవారు సాధారణంగా తెలివైన వారు. తమకు ఆసక్తి ఉన్న రంగంలో మరింత జ్ఞానాన్ని సంపాదించడానికి తమ సమయాన్ని, డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు.
- వీరికి ఏకాగ్రత ఎక్కువ. పరిస్థితులను గమనించి, విశ్లేషించి, సాధారణంగా అందరినీ మెప్పించే ఉత్తమమైన పరిష్కారాలతో ముందుకు వస్తారు. వారి ఆలోచన పదును తెలుసుకున్నవారు జీవితంలో ఎదురైన కష్టాలనుంచి బయట పడేందుకు వీరి సలహాలు అడుగుతారు.
- జీవితాన్ని సరదాగా గడపాలనే యోచనతో ఉంటారు. భవిష్యత్ , గతం గురించి ఆలోచించడానికి ఇష్టపడరు..ఈ క్షణం సంతోషంగా ఉన్నామా లేదా అన్నదే ఆలోచిస్తారు.
- సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఆందోళన చెందుతారు..దాని పరిష్కార మార్గాలు ఆలోచిస్తారు. ఎప్పుడో ఏ ఏదో జరుగుతుందని భయపడరు.
- అక్టోబరులో జన్మించిన వారు రొమాంటిక్‌గా ఉంటారు. వీరు ప్రేమకు, ప్రేమికులకు ఎక్కువ విలవనిస్తారు.
- మంచి తెలివితేటలు, లౌకిక జ్ఞానం ఉంటుంది, కళలపై మంచి అభిరుచి ఉంటుంది, వీరికి దైవభక్తి కూడా ఎక్కువే
- ఆత్మవిశ్వాసం, తెలివితేటల్నే నమ్ముకుని ముందడుగు వేస్తారు, వీలైనంతవరకూ బ్యాలెన్సెడ్ గా మాట్లాడతారు
- సున్నితమైన మనస్సు వీరిసొంతం, పరిస్థితులు అనుకూలించని పక్షంలో సర్దుకుపోతారు కానీ ఇతరులను ఇబ్బందిపెట్టరు
అక్టోబరులో జన్మించిన వారి ఆరోగ్యం: ఈ నెలలో పుట్టిన వారి ఆరోగ్యం నార్మల్ గా ఉంటుంది. చర్మవ్యాధులు,షుగర్ రావొచ్చు
ఆర్థిక పరిస్థితి: శ్రమ, తెలివితేటలతోనే సంపాదిస్తారు
కలిసొచ్చే వారాలు: సోమవారం, గురువారం, శుక్రవారం
కలిసొచ్చే రంగులు: బ్లూ, రోజ్ కలర్
Also Read: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు
Also Read: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి
Also Read: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!