దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ రెండో రోజు ఫ్యూచర్ ప్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్ అంశంపై మాట్లాడారు. కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్ తీసుకున్న చర్యలు గురించి వివరించారు. కరోనా సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 44 సార్లు ఇంటింటి సర్వే చేశామన్నారు. ప్రతి యాభై ఇళ్లకు ఒక వలంటీర్ వ్యవస్థ సహాయంతో సర్వేలు చేశామన్నారాయన.
ఈ సర్వేలో వాలంటీర్లతోపాటు 42వేల మంది ఆశావర్కర్కు కూడా భాగస్వాములై ఉన్నారని తెలిపారు. ఈ సర్వే ద్వారా జ్వరం ఉన్న రోగులను గుర్తించి ప్రత్యేకంగా ఐసోలేషన్ సెంటర్‌కు పంపించామన్నారు. వారి కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఐసోలేషన్ సెంటర్స్‌లో రోగులకు పౌష్టికాహారంతోపాటు మందులు అందించామన్నారు. అన్నింటినీ పక్కగా అమలు చేసి మరణాల రేటు తగ్గించామని వివరించారు. ఇలాంటి మెరుగైన విధానాలతో ఏపీలో కరోనా మరణాల రేటు దేశంలోనే అత్యల్పంగా ఉందని తెలిపారు.
ప్రభుత్వాలు నివారణ, చికిత్సపై దృష్టి పెట్టాలన్నారు సీఎం జగన్. సామాన్యుల స్థోమతకు తగ్గట్టు వైద్యసేవలు అందుబాటులోకి రావాలని సూచించారు. ఆ దిశగానే తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం పని చేస్తున్న విధానం కూడా అక్కడికి వచ్చిన వారికి సమగ్రంగా వివరించారు సీఎం జగన్ .
వైద్యసదుపాయాలని బలోపేతం చేసే దిశగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో వైద్యకళాశాల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు సీఎం జగన్. వైద్య కళాశాలల్లో పీజీ స్థాయి వైద్య విద్యార్థులు అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలకు వ్యాధులు రాకుండా చూడటం ఒకెత్తైతే... రోగాలు వచ్చిన తర్వాత వైద్యం అందివ్వడం మరో ఎత్తు అన్నారు సీఎం జగన్. ఈ రెంటిండినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఏపీలో ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థను డెవలప్ చేసినట్టు వివరించారు. రెండు వేల జనాబా కల్గిన గ్రామంలో విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి మండలం యూనిట్‌గా రెండు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ తీసుకొచ్చామన్నారు. ప్రతీ పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉంటారని.. ఆ కేంద్రంలో 104 అంబులెన్స్ ఉంటుందన్నారు. వైద్యులు ఆయా గ్రామాల్లో అంబులెన్స్‌లో తిరుగుతూ అక్కడి వారికి ఫ్యామిలీ వైద్యుడిగా మారుతారన్నారు.