Polala Amavasya 2024 Date:  ఈ ఏడాది శ్రావణమాసం ఆగష్టు 05 సోమవారం ప్రారంభమై సెప్టెంబరు 03 అమావాస్యతో ముగుస్తుంది. నెలంతా మంగళవారాల్లో మంగళగౌరీ వ్రతాలు ఆచరిస్తే... పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. ఆ రోజు కుదరని వారు శ్రావణంలో ఏ శుక్రవారం అయినా వరలక్ష్మీవ్రతం చేసుకోవచ్చు. అయితే దక్షిణాదిన తెలుగు నెలలు పాడ్యమి తో మొదలై..అమావాస్యతో ముగుస్తాయి. ఇందులో భాగంగా శ్రావణమాసం చివరిరోజు అయిన అమావాస్య సెప్టెంబరు 03న వచ్చింది. ఈ రోజుకున్న విశిష్టత ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం...



  • సెప్టెంబరు 03 సోమవారం మొత్తం అమావాస్య ఘడియలున్నాయి

  • సెప్టెంబరు 04 మంగళవారం ఉదయం 6 గంటవ 7 నిముషాల వరకూ అమావాస్య ఘడియలున్నాయి. అంటే..సూర్యోదయానికి అమావాస్య ఉండడంతో ఈ రోజుని కూడా అమావాస్యగానే పరిగణిస్తారు...

  • సెప్టెంబరు 05నుంచి భాద్రపదమాసం ప్రారంభమవుతుంది


అమావాస్య వ్రతం చేసేవారంతా సెప్టెంబరు 03నే ఆచరించాలి.  ఈ రోజుని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో శ్రావణ అమావాస్య రోజు పోలాల అమావాస్య వ్రతం చేస్తే..మరికొన్ని ప్రాంతాల్లో భాద్రపద అమావాస్య రోజు పోలాల అమావాస్య జరుపుకుంటారు. ఈ రోజుని మహారాష్ట్రలో పిరోరి అమావాస్య అని, ఉత్తర భారతదేశంలో హాలియా అమావాస్య అని అంటారు.  


Also Read: 2024 లో 'అజ ఏకాదశి'ఎప్పుడొచ్చింది.. పూజా విధానం , ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి!


వృషభ పూజకు ప్రత్యేకం


పోలాల అమావాస్య రోజు వృషభ పూజ చేస్తారు. దీని వెనుక ఓకథనం ప్రచారంలో ఉంది. అంధకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి తపస్సు ఆచరించి ఎన్నో వరాలు పొందుతాడు. ఆ వరగర్వంతో దేవతలను వేధించేవాడు..ఓసారి పార్వతీదేవిని చూసి ఆమె కావాలిఅనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శివుడు భూలోకానికి వచ్చి అంధకాసురుడిని శ్రీ మహావిష్ణువు సహకారంతో సంహరించాడు. ఈ సమయంలో నంది తనకు చేసిన సహాయానికి మెచ్చి..ఏదైనా వరం కోరుకోమన్నాడు పమరేశ్వరుడు. అప్పుడు నంది.. స్వామీ మహర్షియైన శిలాధుని పొలంలో ఆదివృషభ రూపంగా నేను తనకి దొరికిన రోజు  శ్రావణబహుళ అమావాస్య. అందుకే ఆ రోజు వృషభ పూజ చేసిన భక్తుల అభీష్టాలు నెరవేరేలా ఆశీర్వదించమనే వరం కోరుకున్నాడు నంది. అప్పటి నుంచి శ్రావణమాసం అమావాస్య రోజు వృషభ పూజ చేయడం ప్రారంభించారు. ఇదే రోజు కొన్ని ప్రాంతాల్లో పోలాల అమావాస్య పూజను ఆచరిస్తారు. 


Also Read: తిరుమల భోజనశాలలో ఉన్న ఈ పెయింటింగ్ ఏంటో తెలుసా!
 
పోలాల అమావాస్య


పోలాల అమావాస్య వ్రతం ఆచరించేవారికి సంతానానికి సంబంధించి ఉన్న దోషాలు తొలగిపోతాయి. సంతానం ప్రసాదించడమే కాదు వారి ఆయురారోగ్యాలను కూడా పోలమ్మ ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం.ఈరోజు కందమొక్కను పూజించి దానికి పసుపుకొమ్ములు కట్టి..పూజ అనంతరం ముత్తైదువులు ఆ పసుపు కొమ్ములను మంగళసూత్రానికి కట్టుకుంటారు.. అ పసుపుకొమ్ములు చిన్నారుల చేతికి కానీ మొలకు కానీ కడతారు. ఈ తోరం కడితే పిల్లలకు మృత్యభయం ఉండదని విశ్వశిస్తారు..


పోలాల అమావాస్య పూజా విధానం గురించి మరో కథనంలో తెలుసుకుందాం...


Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?