Sai Dharam Tej Vs YSRCP: అన్న క్యాంటీన్‌లో శుభ్రత లేదంటూ వైసీపీ సోషల్ మీడియా రచ్చరచ్చ చేస్తోంది. దీనిపై ప్రభుత్వం, టీడీపీ నేతలు వివరణ ఇస్తున్నా వారి మాత్రం వివాదాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. దీంట్లోకి హీరో సాయిధరమ్ తేజ్‌ను కూడా లాగేశారు వైసీపీ మద్దతుదారులు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ సేఫ్ హ్యాండ్స్‌లోకి వెళ్లిందని ఎన్నికల ఫలితాలు తర్వాత సాయిధరమ్ తేజ్ పెట్టిన పోస్టును గుర్తు చేస్తే వైసీపీ మద్దతుదారులు ప్రదీప్‌రెడ్డి అనే ఎన్‌ఆర్‌ఐ పోస్టు పెట్టాడు.
మెడలు రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు వైసీపీ మద్దతుదారుడు. నేరుగా సాయిధరమ్‌తేజ్‌ను ట్యాగ్ చేస్తూ అన్న క్యాంటీన్‌లో వెళ్లి ప్లేట్లు కడగొచ్చు కదా అంటూ ఉచిత సలహా ఇచ్చారు. దీనిపై రియాక్ట్ అయిన సాయిధరమ్ తేజ్... డాక్టర్ గారూ మీరు ఎక్కడ ఉంటారని ప్రశ్నించారు. దానికి నేరుగా సమాధానం చెప్పని ఆ వైసీపీ మద్దతుదారుడు తన బయోలో వివరాలు ఉన్నాయని చెప్పారు. దాన్ని మీరు మిస్ కాలేరు కానీ, ఆంధ్రప్రదేశ్‌లో సేఫ్ హ్యాండ్స్ మాత్రం మిస్ అయ్యాయి అంటూ రియాక్ట్ అయ్యారు.
అవునా ఓకే ఓకే అంటూ రిప్లై ఇచ్చిన సాయిధరమ్ తేజ్... ఎగ్ పఫ్ బిల్ పెరగడంలో పెద్దగా ఆశ్చర్యంలేదు. బాగా తినే ఉంటారని అనుకుంటున్నాను. జాగ్రత్త సార్ అంటూ పోస్టు పెట్టారు. దీనిపై మరోసారి సినిమాల ప్రస్తావన తీసుకొచ్చారు వైసీపీ మద్దతుదారుడు. తన ఎగ్ పఫ్‌లను తను కొనుక్కొని తినగలనని... దానికి వేరే వాళ్ల సాయం అక్కర్లేదంటూనే చిన్న పిల్లలకి కూడా తినింపిచండంలో చాలా జాగ్రత్తగా ఉంటానంటూ వంగ్యంగా స్పందించారు. వాళ్లతో రొమాంటిక్ సీన్స్‌లో నటించడం గురించి వదిలేయండీ అంటూ వెటకారం ధ్వనించే ట్వీట్ చేశారు. నేను ఎం చేస్తానో అదే చెబుతానంటూ ముగించారు. అంతేకాదు ఉప్పెన సినిమా హీరోయిన్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ పెట్టారు.