Tirupati Laddu Adulteration : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించిన తర్వాత మొదట స్వతంత్ర దర్యాప్తు కావాలని కోర్టుకు వెళ్లింది వైసీపీ నేతలు. అప్పటికి ప్రభుత్వం సిట్ కూడా వేయలేదు. ముందుగా హైకోర్టులో పిటిషన్ వేశారు. అక్కడ విచారణ జరగక ముందే వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వైవీ సుబ్బారెడ్డితో పాటు మరో ముగ్గురు పిటిషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని ఆ పిటిషన్ల సారాంశం. విచారణ జరిపిన సుప్రీంకోర్టు శుక్రవారం ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు సీబీఐ, ఇద్దరు రాష్ట్ర, ఒక FSSAI అధికారితో సిట్ ఉంటుంది. వైసీపీ పోరాడింది దీనికోసమే. అయితే జగన్ సుప్రీంకోర్టు విచారణ తర్వాత మీడియా ముందుకు వచ్చి చేసిన ప్రకటన మాత్రం భిన్నంగా ఉంది. 


సిట్ బిట్ అవసరం లేదన్న జగన్


అంతా కళ్ల ముందే ఉందని లడ్డూ కల్తీ జరిగే చాన్సే లేదని కాబట్టి ఇక విచారణ అవసరం లేదని సిట్ .. బిట్ అసలే వద్దని జగ్మన్మోహన్ రెడ్డి తేల్చేశారు. ఒక వేళ వాళ్లేమైనా విచారణ జరిపి అందులో తప్పు జరిగిందని రిపోర్టు వస్తే అది తప్పుడు రిపోర్టేనని తేల్చేశారు. అంటే సుప్రీంకోర్టుకు వెళ్లినా.. అక్కడ కమిటీ వేసినా జగన్ ఆ సిట్ వేసే రిపోర్టును ఆమోదించే ప్రశ్నే లేదని ముందుగానే తేల్చేశారు. తాము తప్పు జరగలేదని చెబుతున్నాం కాబట్టి అదే తీర్పు అని... ఇక ఏ విచారణం అవసరం లేదన్నట్లుగా జగన్ తీరు ఉంది. ఇలాంటి తీరు రాజకీయనాయకుల్లో ఉండటం కాస్త కష్టమే. ఎందుకంటే వ్యవస్థల్ని గౌరవించకపోతే మొత్తం రాజ్యాంగాన్ని గౌరవించనట్లే. రాజకీయం అంతా రాజ్యాంగం ఆధారంగానే నడుస్తుంది. 


'వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చండి' - సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ లేఖ


దొరికిపోతానని జగన్‌కు భయం పట్టుకుందన్న టీడీపీ 


జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత టీడీపీ తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతోంది. సుప్రీంకోర్టు వేసిన సిట్ కు నిజాలు తెలిసిపోతాయని జగన్ బయపడుతున్నారని టీడీపీ నేతలు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు ఏఆర్ డెయిరీ నెయ్యి గురించి అనేక సంచలన విషయాలు  బయట పెట్టారు. ఏఆర్ డెయిరీకి టెండర్లు కట్టబెట్టేందుకు నిబంధనలు మార్చడం దగ్గర నుంచి అసలు ఏఆర్ డెయిరీకి సామర్థ్యం లేదని టీటీడీ టెక్నికల్ టీమ్ ఇచ్చిన రిపోర్టు వరకూ అన్నీ బయట  పెట్టారు. అలాగే ఏఆర్ డెయిరి పంపించిన ట్యాంకర్లు ఎన్ని వాడారో కూడా స్పష్టత ఉంది. అసలు ఏ ఆర్ డెయిరీ  పేరుతో నెయ్యి ఎక్కడి నుంచి తెచ్చారన్నది సిట్ రిపోర్టులో వెల్లడి అవుతుంది. అప్పుడు  అసలు కల్తీ ఎలా జరిగిందన్నది కూడా తేలే అవకాశం ఉందని అందుకే జగన్ మోహన్ రెడ్డి భయపడుతున్నారని అంటున్నారు. 


జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం


జగన్ తప్పు ఒప్పుకున్నట్లయిందా ?


ఎలాంటి విచారణకు అయినా సిద్ధమని  రాజకీయ నేతలు గంభీరంగా  ప్రకటించడం కామన్. అయితే జగన్ మోహన్ రెడ్డి మాత్రం తమకు స్వతంత్ర దర్యాప్తు కావాలని సప్రీంకోర్టుకు వెళ్లి అనుకూల తీర్పు తెచ్చుకున్న తర్వాత కూడా వ్యతిరేకంగా మాట్లాడటం.. అసలు విచారణే అవసరం లేదని తాము చెప్పిందే నిజమని మాట్లాడుతూండటం సామాన్యుల్ని విస్మయపరిచేదే. అదే నిజమైతే సిట్ దర్యాప్తులో అదే తేలుతుంది. అప్పుడు జగన్ ఇప్పుడు చేస్తున్న వాదనను మరింత బలంగా వినిపించుకోవచ్చు. కానీ తాము  చెప్పేదే నిజమన్న ఒకే ఒక్క పాయింట్ తో ఎదురుదాడికి దిగితే ఆ వాదనలో బలం ఉండదు. వివేకా హత్య కేసు విచారణ విషయంలోనూ ఇలాగే వ్యవహిరంచారు.అప్పుడు కూడా ఆయన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు లడ్డూ కేసు విషయంలోనూ అదే జరుగుతోంది.