YS Jagan On Supreme Court : తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని..  సుప్రీంకోర్టు తీర్పుతో సీఎం చంద్రబాబు నిజస్వరూపం బట్టబయలైందని  మాజీ సీఎం జగన్ ప్రకటించారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా  సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను మీడియాకు వివరించారు.  తిరుమల లడ్డూ కల్తీ వ్యవహరంపై చంద్రబాబు వేసిన సిట్ ను సుప్రీంకోర్టు రద్దు చేసిందన్నారు.    తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారన్నారు.   


తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో సిట్‌ అవసరంలేదు.. బిట్‌ అవసరం లేదని జగన్ స్పష్టం చేశారు.  అసలు ఏం జరగనిదానికి విచారణ ఎందుకని ప్రశ్నించారు.  జరగనిదాన్ని జరిగిందని పదేపదే ప్రచారం చేసుకుంటున్నారు.. వేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే మామూలుగా ఉండదని హెచ్చరించారు.  ఏ అధికారులు వచ్చి ఏం చేస్తారు.. తప్పుడు రిపోర్ట్‌ ఇచ్చినా.. తప్పుడు ప్రచారం చేసినా స్వామివారే చూసుకుంటారని వ్యాఖ్యానించారు. 


చంద్రబాబుకు దేవుడు అంటే భయం, భక్తి లేదన్నారు.  తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు చంద్రబాబుకు మొట్టికాయలు వేస్తే  మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆదేశాలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును సుప్రీంకోర్టు తిడితే వైవీ సుబ్బారెడ్డిని తిట్టినట్లుగా ప్రచారం చేస్తున్నారన్నారు.  చంద్రబాబు నిజ స్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించిందని..  పొలిటికల్‌ డ్రామాలు చేయవద్దని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పిందన్నారు.              


తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీం తీర్పు - స్వాగతించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్


 చంద్రబాబుకు దేవుడంటే భక్తి ఉంటే ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. చంద్రబాబు భయం, భక్తి ఉంటే.. ఇప్పటికైనా పశ్చాత్తాపం రావాలని కానీ ఆయన  చెప్పిన అబద్దాన్నే మళ్లీ మళ్లీ చెబుతున్నారని మండిపడ్డారు.  తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ లో జగన్‌కు షాక్ ఇని పోస్టులు పెడుతున్నారని..  కోర్టులు వారిని తప్పుబడితే సోషల్‌ మీడియాలో మాపై తప్పుడు ప్రచారానికి తెరలేపారని ఆరోపించారు.  లడ్డూ విషయంలో కల్తీ జరగలేదని టీటీడీ ఈవోనే చెప్పారు. చంద్రబాబు చెప్పింది తప్పు అని ఈవోనే అంటున్నారని కొన్ని వీడియోలను జగన్  మీడియా ప్రతినిధుల ఎదుట ప్లే చేశారు.  లడ్డూ వివాదంలో జాతీయ మీడియా కూడా చంద్రబాబును తప్పు పట్టిందని పేపర్ క్లిప్పింగులు చదివి వినిపించారు. 


తిరుమలలో గొప్ప వ్యవస్థ ఉందని  కల్తీ నెయ్యి వస్తే రిజెక్ట్ చేస్తారన్నారు.  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 18 సార్లు ట్యాంకర్లను తిరస్కరించామని..  ప్రతీ నెయ్యి ట్యాంక​ర్‌ సర్టిఫికెట్‌ తీసుకుని రావాలvdvejg.  నెయ్యిలో వెజిటబుల్‌ ఫ్యాట్‌ మాత్రమే ఉంద చంద్రబాబు మాత్రం లడ్డూ ప్రతిష్టను దిగజార్చారజగన్ మండిపడ్డారు.  చంద్రబాబు మంచి వ్యక్తి అయితే ఆధారాలను చూసి సిగ్గుపడాలని ఆయన చేసిన పాపాని ఆయన.. కూటమి.. ఆయనను సమర్థించేవాళ్లే శిక్ష అనుభవించాలని జగన్ అన్నారు.  



Also Read: Sharmila On Pawan : మోడీ డైరక్షన్‌లో పవన్ - రాహుల్‌ను విమర్శించే అర్హత ఉందా - షర్మిల విమర్శలు