Iran Israel Conflict: ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ఖాయంగానే కనిపిస్తోంది. పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుందా లేదా అని ఒక్క మధ్యప్రాచ్యంలోనే కాకుండా ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. అదే జరిగితే ఎవరు ఎటువైపు నిలబడతారు? ఇజ్రాయెల్, ఇరాన్‌లలో ఎవరు ఎవరిపై విజయం సాధిస్తారు?


బీరూట్‌లో జగ్విందర్ పటియాల్ 


ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య హోరాహోరీగా సాగుతున్న వేళ అక్కడ రిపోర్టింగ్ చేస్తున్న ABP న్యూస్ ప్రతినిధి జగ్విందర్ పటియాల్ ఈప్రశ్నలకు సమాధానాలు కనుక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. యుద్దభూమి లెబనాన్ నుంచి ప్రతి దాడికి సంబంధించిన న్యూస్ అందిస్తున్నారు. విధ్వంసం వివరాలు దృశ్యాలు కళ్లకు కట్టినట్టు చెబుతున్నారు. ఇలా లెబనాన్‌లో జరుగుతున్న వార్‌ జోన్‌లోకి వెళ్లిన ఇండియాకు సంబంధించిన మొదటి ఛానల్‌ ఏబీపీ. ఇజ్రాయెల్ ఎలా విధ్వంసం సృష్టిస్తోందో పటియాల్ కళ్లకుకట్టినట్టు అందిస్తున్నారు. 


జగ్విందర్ పటియాల్ మాట్లాడుతూ... తను బస చేసిన చోట ఇజ్రాయెల్ డ్రోన్లు ఎప్పుడూ ఆకాశంలో తిరుగుతూ కనిపిస్తున్నాయని వివరించారు. ఏ చిన్న సమాచారం లభించిన క్షణాల్లోనే క్షిపణులు, బాంబులు ఆ ప్రాంతాన్ని పేల్చి పడేస్తున్నాయి. అందుకే కనుచూపు మేర భవనాలు నేలమట్టమయ్యాయి. దక్షిణ బీరుట్ క్రమంగా శిథిలావస్థకు చేరుకుంటోంది. ఇజ్రాయెల్‌కు చెందిన వందల కొద్దీ డ్రోన్ దాడులు ఆకాశంలో చెక్కర్లు కొడుతున్నాయి. 


శత్రు శేషం లేకుండా చేయాలని


లెబనాన్‌లోని హిజ్బుల్లా ముఖ్యమైన స్థావరాలపై బాంబులతో విరుచుకుపడుతోంది. డ్రోన్‌లతో స్థావరాలను వెతికి మరీ విధ్వంసం సృష్టిస్తోంది. ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. డ్రోన్ నుంచి క్షిపణల వరకు అన్ని రకాలుగా విధ్వంసం సృష్టిస్తోనే ఉంది. హిజ్బుల్లా చీఫ్, కొత్త చీఫ్, చాలా మంది హెజ్బుల్లా పెద్దలను హతమారుస్తూ వస్తోంది. కీలకమైన వ్యక్తులు మృతి చెందిన తర్వాత కూడా ఇజ్రాయెల్ శాంతించడం లేదు. హిజ్బుల్లాను పూర్తిగా నాశనం చేయడమే లక్ష్యంగా సాగుతోంది. 


ఒక వేళ ఇరాన్ రంగంలోకి దిగితే 


సైన్యం, ఫైటర్ జెట్‌లు, యుద్ధ ట్యాంకుల విషయంలో ఇజ్రాయెల్ కంటే ఇరాన్ మెరుగైనదిగా కనిపిస్తోంది. కానీ వాస్తవం చూస్తే మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. రెండు దేశాల్లో వాయు రక్షణ వ్యవస్థలు బలంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ రక్షణ బడ్జెట్ ఇరాన్ కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. సైన్యాల విషయంలో ఇరాన్ ముందున్నప్పటికీ, ఇజ్రాయెల్‌లో అత్యవసర పరిస్థితుల్లో పోరాడే యోధులు ఎక్కువగా ఉన్నారు. ఇజ్రాయెలీ సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడల్లా వారు తెరపైకి వచ్చి సత్తా చాటుతుంటారు. 


ఎప్పుడూ ఇజ్రాయెల్‌దే విజయం 


ప్రస్తుతం ఇజ్రాయెల్ మూడు దేశాల నుంచి సవాళ్లు ఎదుర్కొంటోంది. ఇజ్రాయెల్‌ను దెబ్బకొట్టేందుకు ఇరాన్, లెబనాన్, పాలస్తీనా ఎదురు చూస్తున్నాయి. చాలా సార్లు ఇజ్రాయెల్‌ను దెబ్బకొట్టేందుకు ప్రయత్నించి పరాభవం ఎదుర్కొన్నాయి. ఇజ్రాయెల్‌పై 1948 మేలో అరబ్ ఉమ్మడి సైన్యం దాడి చేసింది. జోర్డాన్, లెబనాన్, సిరియా, ఇరాక్, ఈజిప్ట్ ఒక సంవత్సరం పాటు పోరాటం చేసి ఓడిపోయాయి. 1956లో సూయజ్ కెనాల్ పై యుద్ధం జరిగింది. ఈజిప్టు వెనుక అరబ్ సైన్యాలు నిలిచాయి. ఇజ్రాయెల్ 5 రోజుల్లో గాజా, రఫా, అల్-అరిష్‌ను స్వాధీనం చేసుకుంది. 1967 యుద్ధంలో ఈజిప్ట్, జోర్డాన్, సిరియాను ఇజ్రాయెల్ ఓడించింది. 6 రోజుల్లో సినాయ్ ద్వీపం, గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం, గోలన్ హైట్స్‌ను స్వాధీనం చేసుకుంది. 


1973లో 20 రోజుల యోమ్ కిప్పూర్ యుద్ధం జరిగింది. ఈజిప్ట్, సిరియా సినాయ్ ద్వీపకల్పం, గోలన్ హైట్స్‌పై దాడి చేశాయి. ఈ యుద్ధం కారణంగా శాంతి ఒప్పందం కుదిరింది. 1982 లెబనాన్‌లో PLO, హిజ్బుల్లా వంటి తీవ్రవాద సంస్థలు ఏర్పాటై పోరాడుతున్నాయి. ఇలా యుద్ధం వచ్చిన ప్రతిసారీ ఇజ్రాయెల్ విజయం సాధించింది.


Also Read: హిజ్బుల్లా కొత్త చీఫ్‌ను హతమార్చిన బంకర్‌లో ABP టీం- జగ్విందర్ పటియాల్ డేరింగ్‌ గ్రౌండ్ జీరో రిపోర్టింగ్