Iran Israel Crisis : కొన్నాళ్లుగా లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు నిరంతరం సాగుతుండగా.. మరోవైపు ఇరాన్ యుద్ధభేరి మోగించింది. కొన్ని రోజులుగా భీకరమైన దాడులతో మిడిల్ ఈస్ట్ మండుతోంది. ఈ మంటల మధ్య నుంచే ABP న్యూస్ తొలిసారిగా గ్రౌండ్ జీరో నుంచి రిపోర్టింగ్ చేస్తోంది.
ABP ప్రతినిధి జగ్విందర్ పాటియల్ లెబనాన్‌లోని బీరూట్‌లో ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్న ప్రాంతాలకు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ సమీపంలో జరిగిన ఈ క్షిపణి దాడుల్లో అక్కడ భవనాలు పూర్తిగా నేలమట్టం అయినట్లు కనిపిస్తున్నాయి. ప్రధానంగా హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకునే ఇజ్రాయెల్ ఈ దాడులు చేసింది. కిందటి నెలలో ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన హిజ్బుల్లా చీఫ్ హషీమ్ నస్రల్లా సోదరుడు హషీమ్ సైఫిద్దీన్ సైతం నిన్న జరిగిన దాడుల్లో మరణించినట్లు తెలుస్తోంది. సైఫుద్దీన్ మరణించిన ప్రాంతానికి శుక్రవారం పాటియల్ చేరుకున్నారు. సైఫుద్దీన్ హిజ్బుల్లాకు కాబోయే నాయకుడు అని కూడా ప్రచారం ఉంది.
సౌత్ బీరూట్‌లోని జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతంలో సైఫిద్దీన్ హత్యకు గురైన భవనం ఉందని పాటియాల్ తెలిపారు. దాడి జరిగిన 15-20 నిమిషాల తర్వాత కూడా అటుగా పోలీసులు కానీ వైద్యులు కానీ రాలేదు. డ్రోన్ సాయంతో ఈ దాడి జరిగింది. ఇజ్రాయెల్ డ్రోన్‌లు ఆకాశంలో నిరంతరం ఎగురుతూ కనిపిస్తున్నాయి. మొదట హిజ్బుల్లా ఉండే స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటారు. తర్వాత వాటిపై మూకుమ్మడి దాడి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో అనేక భవనాలు ఉన్నాయి. అయినా అవి ఖాలీగానే దర్శనమిస్తున్నాయి. అంటే ఇజ్రాయెల్ దాడిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఖాళీ చేసినట్టు అర్థమవుతుంది.
డ్రోన్ తో హిజ్బుల్లా నేతను చంపేశారు
సౌత్ బీరూట్‌లోని జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతంలో సైఫిద్దీన్ హత్యకు గురైన భవనం ఉందని పాటియాల్ గ్రౌండ్ జీరో నుంచి తెలిపారు. దాడి జరిగిన 15-20 నిమిషాల తర్వాత కూడా పోలీసులు లేదా వైద్య సహాయం అందలేదు. డ్రోన్‌తో ఈ దాడి జరిగింది. డ్రోన్ ద్వారా ఈ దాడి జరిగింది. ఇజ్రాయెల్ డ్రోన్‌లు ఆకాశంలో నిరంతరం ఎగురుతున్నాయి. ఇజ్రాయెల్ దాడులతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు.
దక్షిణ బీరుట్ లక్ష్యం
ఏడాది కాలంగా తమపై నిరంతరం జరుగుతున్న దాడులతో ఇజ్రాయెల్ రగిలిపోతోంది. శత్రువులెవ్వరూ తమ పొరుగున ఉండటానికి వీలులేదన్నట్లుగా చెలరేగిపోతోంది. రెండు రోజుల కిందట ఇరాన్ చేసిన దాడులకు ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటుందని ఊహించిందే. అనుకున్నట్లుగా హిజ్బుల్ కేంద్రాలు ఎక్కువుగా ఉన్న బీరుట్‌పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకు పడుతోంది. ఇజ్రాయెల్ ఇక్కడ దాదాపు 30-40 క్షిపణి దాడులు చేసింది. హిజ్బుల్లాకు చెందిన అనేక మంది పెద్ద ఉగ్రవాదులే కాకుండా, దాని మద్దతుదారులు కూడా ఈ దాడుల్లో మరణించారు.
డ్రోన్లు అత్యంత ప్రభావవంతంగా మారుతున్నాయి
ఇజ్రాయెల్ మొదట్లో బీరూట్‌పై క్షిపణి దాడులు చేసింది. తర్వాత వ్యూహం మార్చుకొని డ్రోన్‌లను ఉపయోగిస్తోంది. మొదట హిజ్బుల్లా ఉగ్రవాద స్థావరాలను ఐడెంటిపై చేస్తుంది. ఆ పై వాటిపై మూకుమ్మడి దాడి చేస్తుంది. ఇలా చేయడం వల్ల వాళ్లు తప్పించుకునే ఛాన్స్ ఉండటం లేదు. బిగ్ హెడ్స్ టార్గెట్ అవుతున్నారు.