Malaysia PM Anwar Ibrahim On Kashmir:మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం పాకిస్థాన్ పర్యటనలో మూడు రోజుల పాటు పర్యటిస్తున్నారు. ఇలా కశ్మీర్‌పై అడుగు పెట్టారో లేదో జమ్ముకశ్మీర్‌పై తన అక్కసు వెల్లగక్కారు. కశ్మీర్‌పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానానికి మలేషియా మద్దతు ఇస్తుందని ఇబ్రహీం తెలిపారు. 


పాకిస్థాన్‌ ప్రధాని సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ... 


పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్‌తో సమావేశం అనంతరం మలేషియా ప్రధాని విలేకరులతో మాట్లాడుతూ కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు. ఇది కాస్త ఆందోళనకరమైన అంశం అంటూ చెప్పుకొచ్చారు. కశ్మీర్ సమస్యపై చర్చలు కొనసాగించాలని, పరస్పర సమన్వయంతో పరిష్కరించుకోవాలని మలేషియా కోరుకుంటుందని అన్నారు. 


ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చర్యలు 


పాకిస్తాన్ మీడియా అందిస్తున్న వివరాల ప్రకారం పాకిస్తాన్, మలేషియా ప్రధానులు తమ దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడేలా చర్యలు తీసుకున్నానరు. వాణిజ్యం, ఆర్థికం, పెట్టుబడులు, పర్యాటకం, విద్య, రక్షణ అంశాలపై సహకరించుకునేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. పరస్పర సహకారంతో ఇరు దేశాలు ఆర్థికంగా బలపడాలని నిర్ణయానికి వచ్చారు. ఈ భేటీలో ఇరు దేశాల నేతలు ఒకరిపై ఒకరు ప్రశంసలు జల్లు కురిపించుకున్నారు. 


ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్తాన్‌లో అలజడి






కశ్మీర్‌లో ఏమైనా సమస్యలు ఉంటే అది భారత్‌కు సంబంధించిన అంశం... వాటి పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో పాకిస్తాన్‌కు అర్థమయ్యే భాషల్లో భారత్ వివరించింది. అయినా దాయాది దేశం తన కుట్ర పూరిత ఆలోచనలు మాత్రం వీడటం లేదు. ప్రపంచ వేదికలపై, వేరే దేశాలతో సమావేశాల వేళ ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఉంటుంది. ఇదే అంశంపై నాలుగు యుద్ధాలు కూడా చేసి పరాభవం ఎదుర్కొంది అయినా పాకిస్తాన్ బుద్ది మార్చుకోలేదు. 


ఈ అక్కసు కొనసాగుతున్న టైంలోనే 2019లో కశ్మీర్‌లో అమలు అవుతున్న  ఆర్టికల్ 370, 35Aని కేంద్రం రద్దు చేసింది. ఇది పాకిస్తాన్‌కు మరింత కడుపు మంట పుట్టిస్తోంది. భారత్‌లోని ఆ భూభాగం ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేని దాయాది దేశం మొన్నీ మధ్య ఐక్యరాజ్యసమితిలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. దానికి భారత్‌ కూడా గట్టిగానే సమాధానం చెప్పింది. అయినా పాకిస్థాన్ చిప్‌ సరిచేసుకోలేదు. మరోసారి మలేషియా ప్రధాని పర్యటన సందర్భంగా కూడా ఈ అంశంపై చర్చించింది. అందుకే తమ మద్దతు పాకిస్థాన్‌కు ఉంటుందని మలేషియా ప్రధాని చెప్పుకొచ్చారు. 


Also Read: సుప్రీంకోర్టులో జగ్గీ వాసుదేవ్‌పై ఊరట - ఈషా ఫౌండేషన్‌పై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు నిలిపివేత