Supreme Court pauses police action against Sadhguru Isha Foundation : మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీలకు బ్రేక్ పడింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ పిటిషన్‌ను విచారించిన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం కామరాజ్ కుమార్తెలతో తాను మాట్లాడానని వారు ఇష్టపూర్వకంగానే ఈషా ఆశ్రమంలో ఉంటున్నట్లుగా చెప్పారన్నారు. ఈషా ఆశ్రమంపై దాఖలైన ఇథర కేసుల వివరాలన్నింటినీ తమ ముందుఉంచాలని ఆదేశిచిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఆక్టోబర్ 18వ తేదీకి వాయిదా వేసింది.


ఈషా ఫౌండేషన్‌లో సోదాలకు మద్రాస్ హైకోర్టు ఆదేశం                               


కామరాజ్ అనే  రిటైర్డ్ ప్రొఫెసర్ ఇద్దరి కుమార్తెలు పెళ్లి చేసుకోకుండా ఈషా ఫౌండేషన్‌లో సన్యాసినులగా చేరిపోయారు. వారిద్దరూ ఇంటికి వచ్చేందుకు నిరాకరించారు. దీంతో కామరాజ్ ఈషా ఫౌండేషన్ లో తన కుమార్తెలకు బ్రెయిన్ వాష్ చేసి సన్యాసం స్వీకరించేలా చేశారని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు కామరాజ్ ఇద్దరు కుమార్తెల్ని కూడా హైకోర్టు పిలిపించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు కామరాజ్ కుమార్తెల అభిప్రాయం తెలుసుకున్నారు. తాము ఇష్టపూర్వకంగానే  ఈషా ఫౌండేషన్ లో ఉన్నామని అక్కడే జీవనం సాగిస్తామని తెలిపారు. వారిద్దరికీ దాదాపుగా 40 ఏళ్ల వయసు ఉంటుంది. 


వాయిదా కోరిన సొలిసిటల్ జనరల్ - తిరుపతి లడ్డూ కేసు శుక్రవారానికి వాయిదా !


యువతుల్ని సన్యాసినులుగా మారుస్తున్నారని పలు కేసులు ఉన్నాయన్న లాయర్లు                      


ఇదే సమయంలో కామరాజ్ తరపు లాయర్లు ఇషా ఫౌండేషన్ పై ఇలాంటి కేసులు చాలా ఉన్నాయని వాదించారు. దీంతో ధర్మాసనం అ కేసుల వివరాలన్నింటినీ తమ ముందు ఉంచారని ఆదేశించి.. అదే  సమయంలో ఆశ్రమంలో సోదాలు నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పు కారణంగా నూట యాభై మంది పోలీసులు కోయంబత్తూరు ఈషా ఆశ్రమంలో తనిఖీలు చేశారు. అయితే తమపై ఎలాంటి ఆరోపణలు లేకపోయినా వేధిస్తున్నారని చెప్పి  ఈషా ఫౌండేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. 



Also Read: తమిళనాడులోనూ పవన్ కల్యాణ్ హాట్ టాపిక్ - దక్షిణాది హిందూత్వ నేతగా మరో అడుగు ముందుకేసినట్లేనా ?




తాము ఎవరినీ సన్యాసం తీసుకోమని బ్రెయిన్ వాష్ చేయడం లేదని అందరూ ఇష్టప్రకారమే వచ్చి ఆశ్రమంలో ఉంటున్నారని ఈషా ఫౌండేషన్ తెలిపింది. తమపై తప్పుడు ప్రచారం చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో జరిగే తదుపరి విచారణలో  ఈషా ఫౌండేషన్ పై పెట్టిన కేసుల స్టేటస్ ఆధారంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.