Politics Of Alliances In Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతూండటంతో రాజకీయ కూటములు ఫైల్ అవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, ( TDP ) జనసేన ( Janasena ) కూటమిగా వెళ్తున్నట్లుగా ప్రకటించాయి. బీజేపీ ( BJP ) కలుస్తుందా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. అయితే గత కొంత కాలంగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను చూస్తే. బీజేపీ మెల్లగా కూటమిలో భాగం అయ్యేందుకు సిద్ధమయినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో.. సంక్రాంతి పండగ పూర్తయ్యేలోపు కూటమి సంగతి తేల్చాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
ఢిల్లీలోనే పూర్తిగా పొత్తుల అంశంపై చర్చలు
ఏపీలో పొత్తుల గురించి రాష్ట్ర బీజేపీ నేతలకు ఎలాంటి సమాచారం లేదు. కానీ ఢిల్లీలో మాత్రం వేగంగా ఈ విషయంపై వ్యూహకర్తలు చర్చలు పూర్తి చేసినట్లుగా చెబుతున్నారు. సీనియర్ నేతలు మూడు పార్టీలు కలిసి వెళ్లాలన్న అంశానికే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అందుకే హైకమాండ్ కూడా పొత్తులకు అంగీకారం తెలిపిందని అంటున్నారు. ఎన్ని సీట్లు తీసుకోవాలన్న దానిపైనే ఇప్పుడు దృష్టి పెట్టారని.. అంటున్నారు. టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు అంశాలపై స్పష్టత రాకపోవడానికి ఇది కూడా ఓ కారణమన్న చర్చ జరుగుతోంది.
ఉంటే ఉండండి పోతే పొండి - అసంతృప్తులకు ఒకటే మాట ! వైఎస్ఆర్‌సీపీ ధైర్యమేంటి ?
కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందంటున్న రాష్ట్ర నేతలు
మేం జనసేనతో పొత్తులో ఉన్నామని.. పవన్ కల్యాణ్ కూడా అదే చెబుతున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చెబుతున్నారు. టీడీపీతో పొత్తు విషయం కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని మీడియాతోతెలిపారు. నేను పలానాచోట పోటీ చేస్తానని అడగలేదని స్పష్టం చేశారు. పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానన్నారు. జనవరి మూడు, నాలుగు తేదీల్లో కేంద్ర ప్రతినిధులు ఢిల్లీ నుంచి విజయవాడ రానున్నారు. రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి పొత్తులపై పూర్తి స్థాయి అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలన్నదానిపైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
'పవన్ కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తాడు' - జనసేనానిపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు
వైసీపీ సన్నిహితంగా ఉన్నా వైసీపీ కూటమిలో చేరదనే !
వైసీపీ జాతీయ స్థాయిలో బీజేపీకి పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచింది. కేంద్రాన్ని ఇబ్బంది పెట్టేలా ఎప్పుడూ వ్యవహరించలేదు. అయితే ఆ పార్టీ ఎన్డీఏలో చేరే అవకాశం లేదు. ఎందుకంటే వైసీపీ ప్రధానమైన ఓటు బ్యాంక్ మైనార్టీలు, దళితులు. బీజేపీతో జట్టు కడితే వారు దూరమవుతారని వైసీపీలో ఆందోళన ఉంది. మరో వైపు షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటారని చెబుతున్నారు. ఈ క్రమంలలో టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీ రావడంపై విస్తృత చర్చ ప్రారంభం కావడం ఆసక్తికరంగా మారింది.