TDP Party leaders are planning to strengthen TDP in Telangana: తెలుగుదేశం పార్టీ తెలంగాణపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం యాక్షన్ ప్లాన్ రెడీ చేసే బాధ్యతను ప్రశాంత్ కిషోర్ తో పాటు షో టైమ్ కన్సల్టెన్సీకి చెందిన రాబిన్ శర్మకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్టుగా పని చేయడం లేదు. కానీ తన ఐడియాలు మాత్రం ఇస్తున్నారు. రాబిన్ శర్మ గత ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి స్ట్రాటజిస్టుగా పని చేశారు. ఈ క్రమంలో వారు తెలంగాణలో చతికిలపడిన టీడీపీకి మళ్లీ ఊపిరి పోయడానికి రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది.  


చంద్రబాబు, లోకేష్‌కు ప్రజెంటేషన్ ఇచ్చిన పీకే, రాబిన్ శర్మ


ఇటీవల చంద్రబాబు నివాసంలో పీకే, రాబిన్ శర్మ హైలెవల్ మీటింగ్ నిర్వహించినట్లుగా తెలుస్తోంది.  చంద్రబాబు,లోకేష్‌లకు వారు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో టీడీపీ బలోపేతమయ్యే మార్గాలపై పలు మార్గాలను చర్చించినట్లుగా తెలుస్తోంది.  పలు వర్గాల్లో టీడీపీకి ఉన్న అభిప్రాయాలతో పాటు  మళ్లీ టీడీపీ వస్తే తెలంగాణ సెంటిమెంట్ పెరుగుతుందా లేదా అన్న అంశాలపైనా సర్వే చేసినట్లుగా చెబుతున్నారు. ఆ ఫలితాల ఆధారంగా స్ట్రాటజీల్ని ఖరారు చేశారని అంటున్నారు. టీడీపీకి బలమైన నాయకత్వం ఉంటే..  పాత క్యాడర్ అంతా తిరిగి వస్తుందని..ఓటర్లు కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని వారిద్దరూ ప్రజెంటేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 


మహబూబ్ నగర్ నుంచి కార్యాచరణ ?  


తెలుగుదేశం పార్టీ రివైవింగ్ ప్రోగ్రామ్‌ ను మహబూబ్ నగర్ నుంచి ప్రారంభించాలని పీకే, రాబిన్ శర్మ సూచించినట్లుగా తెలుస్తోంది. ఆ జిల్లా గతంలో తెలుగుదేసం పార్టీకి కంచుకోటలా ఉండేది. తెలంగాణ ఉద్యమం తర్వాత బలహీనపడింది. తర్వాత ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో క్యాడర్ అంతా చెల్లా చెదురు అయిపోయింది. వేర్వేరు పార్టీల్లో చేరిపోయారు. మహబూబ్ నగర్ నుంచి ప్రారంభించి..  గ్రేటర్, నల్లగొండ, ఖమ్మం , రంగారెడ్డి జిల్లాల్లో బలమైన ముద్ర వేయగలిగితే నిర్ణయాత్మక శక్తిగా మారవచ్చని అంచనా వేసినట్లుగా తెలుస్తోంది. 


నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవడం కూడా ముఖ్యమే !


అయితే పీకేతో పాటు రాబిన్ శర్మ పార్టీలో కొంత బలమున్న, గుర్తింపు ఉన్న నేతల్ని చేర్చుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు రావాలనుకున్న వారు కాంగ్రెస్, బీజేపీల్లో ఇమడలేని వాళ్లను, పోరాడే తత్వం ఉన్న యువనేతల్ని ఆకర్షించి ముందుగా చేరికల్ని ప్రారంభించాలని సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. చేరికలు పెరిగితే తర్వాత పార్టీ కార్యక్రమాలను పెంచి ... ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో జమిలీ ఎన్నికలే జరుగుతాయి కాబట్టి  టీడీపీని ఆంధ్రా పార్టీగా చేసే ప్రచారం అంత బలమైన ప్రభావం చూపదని అంచనా వేస్తున్నారు. 


మొత్తంగా తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్ గానే తెలంగాణలో బలపడే ప్రయత్నం చేస్తోంది. ఇది తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలను తీసుకురానుంది. 



Also Read: Pawan Kalyan: 'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ