Pawan responded to a media representative's question on Allu Arjun arrest: అల్లు అర్జున్ అరెస్టు ఉదంతం చాలా రోజులుగా హాట్ టాపిక్ గా ఉంది. ఈ అంశంపై చాలా మంది స్పందించారు కానీ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఓ రోజు ఆయన అల్లు అర్జున్ ను పరామర్శిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఆ రోజు ఆయన మళ్లీ ఏపీకి వెళ్లిపోయారు. ఇప్పటి వరకూ పరామర్శించలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. అలాగే ఈ ఘటనపై దతన స్పందన ఏమిటో ఇప్పటి వరకూ బయట పెట్టలేదు.
అల్లు అర్జున్ అరెస్టుపై ఇప్పటి వరకూ స్పందించని పవన్
అసలు ఈ అరెస్టు, అర్జున్ వ్యవహారం, సినీ పరిశ్రమతో రేవంత్ రెడ్డి భేటీ అంశాలపై పవన్ స్పందన తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు.కానీ పవన్ కల్యాణ్ ఎవరికీ అవకాశం ఇవ్వడం లేదు. కడప జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగిపై దాడి ఘటనలో .. ఉద్యోగిని పరామర్శించాడనికి వెళ్లిన పవన్ రిమ్స్ ఆస్పత్రి ఎదుట మీడియాతో మాట్లాడారు. ఆ ఘటనపై అంతా మాట్లాడి అయిపోయిన సమయంలో ఓ జర్నలిస్టు అల్లు అర్జున్ అరెస్టు గురించి ప్రశ్నించారు.
సందర్భం లేని ప్రశ్నపై అసహనం వ్యక్తం చేసిన పవన్
అ ప్రశ్న విని పవన్ కల్యాణ్ ఆసక్తి లేదన్నట్లుగా ఫేస్ పెట్టారు. ఇక్కడ అరాచకం జరుగుతోందని సినిమాల ప్రస్తావన ఎందుకని ఆయన జర్నలిస్టుకు క్లాస్ తీసుకున్నారు. అంటే పవన్ కల్యాణ్ అల్లు అర్జున్ అంశంపై స్పందించడానికి ఏ మాత్రం ఆసక్తిగా లేరని అర్థమవుతుంది. అదే సమయంలో తాను ఏం మాట్లాడినా అది రివర్స్ అవుతుందని... విపరీత ప్రచారాలు జరుగుతాయని.. అందుకే ఆ టాపిక్ పై స్పందించాల్సి వచ్చినప్పుడు స్పందిస్తే చాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ అధికారిక పర్యటనలకు వెళ్లినప్పుడు రాజకీయ, వ్యక్తిగత,సినిమా అంశాలపై దాదాపుగా స్పదించరు. సినిమా అభిమానులు పవన్ ను చూసిన ప్పుడల్లా ఓజీ ఓజీ అని కేకలు వేస్తూ ఊంటారు. వారిపైన కూడా పవన్ చిరాకుపడుతున్నారు. సినిమాల ప్రస్తావన తెస్తున్న ఫ్యాన్స్‌పై చిరాకుపడుతున్నారు పవన్. ఆయన దృష్టి అంతా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ప్రజల బతుకుల్ని మార్చడంపైనే ఉందని చెబుతున్నారు. అయినా ఓ రిపోర్టర్ మాత్రం సీరియస్ టాపిక్ టాపిక్ మధ్యలో సినిమాలో ప్రస్తావన తెచ్చారు.ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా అని పవన్ మండిపడ్డారు.