Pawan Cartoons On Jagan :  జనసేన అధినేత పవన్ కల్యాణ్ కార్టూన్లతో జగన్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వినూత్న రీతిలో విమర్శలు చేస్తున్నారు. వరుసగా ఒక్కో సమస్యపై జగన్ సర్కార్ వైఫల్యాన్ని వివరించేలా కార్టూన్ పెడుతున్నారు. తాజాగా ఆయన పిల్లల స్కూళ్లను మూసేస్తున్న వైనంపై కార్టూన్ పోస్ట్ చేశారు. ఇది వైరల్ అవుతోంది. జగన్ తనను తాను పిల్లలకు మామయ్యగా చెప్పుకుంటూ ఉంటారు. అ మాటతో .. బడులు మూసేస్తున్న వైనంపై కార్టూన్ వేయించారు. ముద్దుల మామయ్య కాదు దొంగ మామయ్యని బడిని ఎత్తుకెళ్తున్నారని పిల్లలు కోపంగా చూస్తూండటాన్ని కార్టూన్‌గా వేయించి తన ట్విట్ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 



ప్లీనరీలోనే గౌరవాధ్యక్షురాలి రాజీనామా ప్రకటనా ? షాక్‌లో వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు !


పవన్ కల్యాణ్ గురువారం… నిరుద్యోగ సమస్యపై కార్టూన్‌ను పోస్ట్ చేశారు. జాబ్ క్యాలెండ్ చేతిలో పెట్టి జాబుల్లేకుండా చేసిన విషయాన్ని అందులో వివరించారు. 



మద్య నిషేధంపైనా ఇలాంటి కార్టూనే పోస్టు చేశారు. ఖరీదైన మద్యాన్ని నిషేధించామని అంటే బ్రాండెడ్ లిక్కర్ నిషేధించామని ఓ వైసీపీ నేత వాదిస్తున్న వైనం వివరించారు. 



అది ప్లీనరీ కాదు విజయమ్మ వీడ్కోలు సభ - సొంత పార్టీ కార్యక్రమంపై రఘురామ సెటైర్లు !





 కార్టూన్లు వేస్తోంది ఎవరో కానీ మంచి లైన్‌తో వేస్తున్నారు. దీంతో ఇవి వైరల్ అవుతున్నాయి. ప్లీనరీ సందర్భంగా నరవత్నాల్లోని లోపాలను ప్రశ్నిస్తూ .. .నవ సందేహాలను కూడా పోస్ట్ చేశారు. పవన్ కల్యాణ్ ప్రయత్నానికి నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.   కార్టూన్లను విపరీతంగా షేర్ చేస్తున్నారు.  అసలు నేరుగా విమర్సలు చేయకుండా కార్టూన్ ద్వారా చెబితే ప్రజల్లోకి బాగా వెళ్తుందని జనసేన వర్గాలు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. 


నవరత్నాలపై నవ సందేహాలు - పవన్ ప్రశ్నలకు ఆన్సర్లొస్తాయా?