Raghurama :   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షరాలి పదవికి వైఎస్ విజయలక్ష్మి రాజీనామా చేయడంపై ఆ పార్టీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శనాత్మకంగా స్పందించారు. పార్టీ ప్లీనరీలో ఈ అంశాన్ని ప్రకటించడంపై ఆయన సెటైర్లు వేశారు. పార్టీ ప్లీనరీ లాగా లేదని అది విజయమ్మ వీడ్కోలు సభలా ఉందన్నారు. అమ్మ రాజీనామా చేశారా.. అమ్మతో రాజీనామా చేయించారా అన్న చర్చ జరుగుతోందన్నారు. అయితే అమ్మ రాజీనామా కరెక్ట్ అని.. అలాగే అమ్మతో రాజీనామా కూడా కరెక్టేనని రఘురామ వ్యాఖ్యానించారు. ప్లీనరీ వేదికపై విజయమ్మకు అవమానం జరిగిందని రఘురామ విశ్లేషించారు. పార్టీ గౌరవాధ్యక్షులకు ఎక్కడైనా పెద్దపీట వేస్తారన్నారు. 


వైఎస్ఆర్‌ సీపీ గౌరవాధ్యక్షురాలిగా వైఎస్ విజయమ్మ రాజీనామా, ప్లీనరీలో సంచలన ప్రకటన


మా పార్టీలో మాత్రం పెద్ద కుర్చీలో సీఎం జగన్ కూర్చుంటారని.. చిన్న కుర్చీలో  గౌరవాధ్యక్షురాల్ని కూర్చోబెడతారని సెటైర్ వేశారు. రఘురామ ఎప్పుడు వైఎస్ఆర్‌సీపీ గురించి ప్రస్తావించాల్సి వచ్చిన మా పార్టీ అనే అంటూ ఉంటారు. ఆయన వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేయలేదు. ఆ పార్టీ కూడా సస్పెండ్ చేయలేదు. గౌరవాధ్యక్షురాలికి పెద్ద పీట వేస్తే గౌరవం దక్కేదన్నారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీ కోసం విజయమ్మ, షర్మిల విపరీతంగా కష్టపడ్డారన్నారు. జగన్ బెయిల్ కోసం విజయమ్మ... సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్నారని సమాచారం ఉందన్నారు. 


గజదొంగలంతా ఏకమైనా మనల్ని అధికారంలోకి రాకుండా అడ్డుకోలేరు: వైఎస్ జగన్ ధ్వజం


జగనమోహన్ రెడ్డి తన పాలనలో చెప్పినవన్నీ చేస్తున్నారని విజయమ్మ చెప్పారని.. అసలేమీ చేయలేదని తాను విజయమ్మకు చెబుతానని రఘురామ వ్యాఖ్యానించారు. ప్లీనరీలో ఏర్పాటు చేసిన మెనూపైనా రఘురామ కృష్ణరాజు సెటైర్లు వేశారు. ప్లీనరీకి జనం రావడం లేదని మెనూ పెట్టారన్నారు. అయితే రెండు లక్షల మందికి భోజనాలురెడీ చేస్తే వచ్చింది ముఫ్పై వేల మందేనన్నారు. అయితే ప్లీనరీ వల్ల తమ పార్టీకీ నష్టం లేదన్నారు. ఎందుకంటే భోజనాల ఖర్చు ఒకరిది.. బియ్యం ఖర్చు మరొరరిదని.. ఇలా అన్ని ఖర్చులూ పార్టీ నేతలు పంచుకున్నారన్నారు.  పార్టీ కి శాశ్వత అధ్యక్షుడు అంటూ ఎవరు ఉండరని స్పష్టం చేశారు. ఒక వేళ జగన్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడు అయితే.. తాను కోర్టుకెళ్తానని ప్రకటించారు. ఏపీలో అధికారులను బెదిరిస్తున్నారని..  సివిల్ సర్వీస్ అధికారులను కూడా తనకుగతంలో ఇచ్చినట్లే ట్రీట్ మెంట్ ఇస్తున్నారన్నారు.  


రాహుల్‌ని ప్రధాని చెయ్యాలనేది వైఎస్ కోరిక, అలా జరిగితేనే ఆత్మకు శాంతి: రేవంత్ రెడ్డి