Pawan Kalyan :   జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. గత వారం తూర్పు గోదావరి జిల్లాలో రైతు భరోసా యాత్రతో పాటు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.  హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఒంట్లో నలతగా ఉండటంతో టెస్టులు చేయించుకున్నారు. వైరల్ ఫీవర్ వచ్చినట్లుగా తేలింది. అదే సమయంలో పవన్ కల్యాణ్ భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందికి కూడా పెద్ద ఎత్తున అనారోగ్యం బారిన పడ్డారు. ఈ కారణంగా ప్రతీ ఆదివారం నిర్వహించాలనుకున్న జనవాణి కార్యక్రమాన్ని వచ్చే వారం వాయిదా వేశారు. మాములుగా అయితే వచ్చే ఆదివారం జరగాల్సి ఉంది. కానీ పవన్ కల్యాణ్‌కు జ్వరం రావడం వల్ల వచ్చే వారం జనవాణి కార్యక్రమాన్ని నిలిపివేశారు. 





మళ్లీ నెలాఖరు రోజున అంటే 31వ తేదీన ఆదివారం జనవాణి కార్యక్రమం ఉంటుందని ఎక్కడ జరుగుతుందన్నదానిపై తర్వాత ప్రకటన చేస్తామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇప్పటికి రెండు వారాలు విజయవాడలో.. ఓ వారం తూ.గో జిల్లాలో జరిగింది. అందుకే ఈ సారి ఉత్తరాంద్ర, రాయలసీమ జిల్లాల్లో నిర్వహించనున్నారు.


అక్రమాలు చేసి గెలిచేదానికి ఎన్నికలెందుకు ? తిరుపతి సహకార బ్యాంక్ ఎలక్షన్స్‌పై టీడీపీ విమర్శలు !


ప్రజలతో మేమేకం అయ్యేందుకు పవన్ కల్యాణ్ రెండు ప్రధాన కార్యక్రమాలు చేపట్టారు. అందులో ఒకటి ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు సాయం చేసేందుకు నిర్వహించే రైతు భరోసా యాత్ర కాగా.. మరొకటి.. ప్రజల సమస్యలను ఆర్జీల రూపంలో స్వీకరించే జనవాణి. వరుసగా జిల్లాలు తిరుగుతూ కార్యక్రర్తల్లో పవన్ కల్యాణ్ ఉత్సాహం నింపుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయనకు వైరల్ ఫీవర్ రావడంతో ఓ వారం గ్యాప్ వస్తోంది.


2 నెలల ముందు టెంకాయ కొడితే శంకుస్థాపనా? ఇంతకంటే మోసం ఉందా? - బాబుపై జగన్ ధ్వజం


రైతు భరోసా యాత్రను ఇంకా పలు జిల్లాల్లో కొనసాగించాల్సి ఉంది. దసరా నుంచి బస్ యాత్ర ప్రారంబిస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. సినిమా షూటింగ్‌లను కూడా దసరాలోపు పూర్తి చేసుకుని .. ప్రారంభం కాని సినిమాలను పెండింగ్‌లో పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.