TDP MP Kesineni Nani: విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నాని కుటుంబ వివాదం తారా స్దాయికి చేరుతోంది. త‌న పేరు,హోదాను ఉపయోగించుకొని, గుర్తు తెలియని వ్యక్తులు వ్య‌వ‌హ‌రాలు సాగిస్తున్నార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. విజయవాడ పార్ల మెంటు సభ్యుడిగా తాను వినియోగించే వీఐపీ వాహన స్టిక్కర్ నకిలీది సృష్టించి, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో తిరుగుతు,త‌న పేరు వాడుకుంటున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. అలాంటి వారి పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, వాహనం నెంబరు టీఎస్ 07 హెచ్ డబ్ల్యూ 7777గా పేర్కొంటూ విజ‌య‌వాడ పటమట పోలీసులకు ఎంపీ కేశినేని నాని ఫిర్యాదు చేశారు.


ఎంపీ నాని ఫిర్యాదుతో కేసు నమోదు.. 
మే నెల 27న ఎంపీ నాని ఫిర్యాదు చేయగా జూన్ 9వ తేదీన పోలీసులు, ఎఫ్ఐ ఆర్ నమోదు చేశారు. ఐపీసీ 420, 416, 415, 468, 499 35 3534 80 (ఎఫ్ఐఆర్ 523/2022) నమోదు చేశారు. అయితే ఇదే  వాహనాన్ని సోమవారం హైదరాబాద్ పోలీసులు గుర్తించి తనిఖీ చేశారు. అన్నీ సవ్యంగానే ఉన్నట్లు గుర్తించి వదిలివేశారు. అయితే ఈ వాహనం కేశినేని జానకి లక్ష్మి పేరు మీద ఉంది. దీన్ని ఆమె భర్త కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని వినియోగిస్తున్నారు. కేశినేని చిన్ని స్వయంగా నానికి సోదరుడు కావ‌టం విశేషం. చిన్ని హైదరాబాద్ లో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. సొంత సోదురుడి పైనే ఫిర్యాదు చేయడంతో ఎఐఫ్ఆర్ నమోదు కావడం, పోలీసులు విచారణ చేయడంతో ఈ వ్య‌వ‌హ‌రం అంతా ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వచ్చి టీడీపీలో చ‌ర్చ‌నీయాశంగా మారింది.


విజయవాడ ఎంపీగా కేశినేని నాని టీడీపీ నుంచి రెండు సార్లు గెలుపొందారు. ఎన్నికల ప్రచారంలో కూడ సోదరుడు కేశినేని చిన్ని కీలకపాత్ర పోషించారు. ఇటీవల చిన్ని క్రియా శీలకంగా టీడీపీ రాజకీయాల్లో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. విజయవాడ పార్లమెంటు స్థానానికి చిన్ని కూడ ప్ర‌య‌త్నాలు మెద‌లు పెట్ట‌టంతో ఎంపీ కేశినేని నానికి ఇష్టం లేక‌పోయింద‌ని, దీంతో ఇరువురి మ‌ద్య గ్యాప్ పెరిగింద‌ని చెబుతున్నారు. మరోవైపు కేశి నేని నాని రెండో సారి గెలిచిన తర్వాత పార్టీ వ్యవహా రాలపై కొంత అసంతృప్తిగానే ఉన్నారు. సోష‌ల్ మీడియా కేంద్రంగా నాని చేసిన కామెంట్స్ కూడ సొంత పార్టిలోనే వివాదాలు దారితీసింది. పార్లమెంటు నియోజకవర్గంలో పలువురు నాయకులతో నానికి విభేదాలు ఉన్నాయి.


మైలవరం ఇంఛార్జిగా ఉన్న దేవినేని ఉమా, పశ్చిమ నియో జకవర్గానికి చెందిన బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, జగ్గయ్యపేటకు చెందిన శ్రీరాంతాతయ్య లతో అభిప్రాయబేధాలు వచ్చాయి. నగరపాలక సంస్థ ఎన్నికల్లో తన కూతురును మేయర్ అభ్యర్థిగా ప్రకటించటంతో బెజ‌వాడ టీడీపీలో నానికి వ్య‌తిరేక‌త పెరిగింది.ఆ త‌రువాత చంద్ర‌బాబు కూడ నానికి మ‌ద్ద‌తు ఇవ్వంతో పార్టీ నాయ‌కులు మాట్లాడ‌లేదు..సైలెంట్ గా ఓటింగ్ లో త‌మ ప‌ని త‌నం చూపించారు. ఫ‌లితంగా వైసీపీ విజ‌య‌వాడ కార్పోరేష‌న్‌లో జెండా ఎగ‌రవేసింది.


వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమార్తె, ప్ర‌స్తుత టీడీపీ కార్పోరేట‌ర్ శ్వేత‌ను తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుండి బ‌రిలో కి దింపి, ఎంపీగా మాజీ ప్ర‌స్తుత తూర్పు శాస‌న స‌భ్యుడు గ‌ద్దె రామోహ‌న్ ను ఎంపీగా బ‌రిలోకి దింపాల‌ని కేశినేని నాని భావిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని పార్టీలో చాలా మంది వ్య‌తిరేకించారు. త‌న సోద‌రుడు చిన్ని కూడా ఎంపీ ప‌ద‌వికి రేసులో ఉండ‌టంతో ఎంపీ నానికి ఆగ్ర‌హం తెప్పించింద‌ని చెబుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ వివాదం తెర మీద‌కు వ‌చ్చింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.