Custard Apple: సీతాఫలం... శీతాకాలం పండు... పోషకాల సమాహారం... అనారోగ్యాల నివారిణి
సీతా ఫలాన్ని... శీతాకాలం పండు అని కూడా అంటారు. ఈ కాలంలో మూడు నెలలకు పైగా లభిస్తుంది సీతాఫలం. సీతాఫలం ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, రాగి పుష్కలంగా ఉంటాయి. (Image Credit: Pixabay)
మెక్సికో, మధ్య దక్షిణ అమెరికాల్లో పుట్టిపెరిగిన సీతాఫలం ( అనోనా స్క్వామోజా ) మనదగ్గరకు పదహారో శతాబ్దంలో పోర్చుగీసు వాళ్లతోపాటు వచ్చింది. సీతాఫలం గుజ్జు రక్తంలో 'హీమోగ్లోబిన్' శాతాన్ని బాగా పెంచుతుంది. అందుకే దీన్ని 21వ శతాబ్దపు సూపర్ ఫ్రూట్‌గానూ చెబుతారు. (Image Credit: Pixabay)
అన్ని వయసులవారూ సీతాఫలం తినొచ్చు. ఇవి మన స్కిన్ టోన్‌ను మెరుగుపరుస్తాయి. జుట్టును పట్టుగా చేస్తాయి. కంటి చూపును పెంచుతాయి. మన బ్రెయిన్ బాగా పని చేస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఇందులో పెద్ద మొత్తంలో బయో యాక్టివ్ మాలిక్యూల్స్ ఉంటాయి. అవి అధిక బరువు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వాటితో పోరాడతాయి. కాబట్టి అందరూ సీతాఫలం తినొచ్చు అని చెబుతున్నారు వైద్యులు. (Image Credit: Pixabay)
సీతాఫలం తింటే... మన రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగవుతుంది. ఇందులోని సీ విటమిన్, పొటాషియం, మాంగనీస్ వంటివి గుండెకు మేలు చేస్తాయి. అందువల్ల సీతాఫలం తింటే గుండెకు మంచిదే. హార్ట్ పేషెంట్లు కూడా సీతాఫలాన్ని చక్కగా తినేయొచ్చు.(Image Credit: Pixabay)
సీతాఫలం జీర్ణవ్యవస్థను సరిచేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలాగే విరేచనాల్ని తగ్గిస్తుంది. మరో గొప్ప విషయమేంటంటే... కడుపులో అల్సర్లు, ఏసీడీటీ వంటి వాటిని ఈ పండు తగ్గిస్తుంది. ఇందులోని విటమిన్ B కాంప్లెక్స్, ముఖ్యంగా విటమిన్ B6 అనేది మనకు ఎంతో మేలు చేస్తుంది. (Image Credit: Pixabay)
ఉబ్బసం రోగులు వైద్యుల సలహా తీసుకుని తినాలి. సీతాఫలాలను ఖాళీ కడుపుతో తినకూడదు, భోజనం చేశాకే తినాలి. తిన్నాక మంచినీళ్లు ఎక్కువగా తాగాలి.(Image Credit: Pixabay)
అవకాడో, జామ, బొప్పాయిల్లో ఎక్కువగా ఉండే ఫొలేట్ ( బి-9 ) విటమిన్ సీతాఫలంలోనూ ఎక్కువే. అందుకే గర్భిణులకు ఈ పండు ఎంతో మంచిది. వేవిళ్లతో బాధపడేవాళ్లకు వికారాన్ని తగ్గిస్తుంది.(Image Credit: Pixabay)
పండుగా తినడంతోపాటు స్వీట్లు, జెల్లీలు, ఐస్‌క్రీములు, జామ్‌లు చేస్తుంటారు. (Image Credit: Pixabay)