ABP  WhatsApp

Lawsuit Against Trump: 'డ్రెస్సింగ్‌ రూమ్‌లో నన్ను రేప్ చేశాడు'- డొనాల్డ్ ట్రంప్‌పై సంచలన ఆరోపణలు

ABP Desam Updated at: 21 Sep 2022 11:47 AM (IST)
Edited By: Murali Krishna

Lawsuit Against Trump: డొనాల్డ్ ట్రంప్ తనపై అత్యాచారం చేసినట్లు రచయిత్రి ఈ జీన్ కారోల్ ఆరోపించారు.

(Image Source: Getty)

NEXT PREV

Lawsuit Against Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఓ రచయిత్రి సంచలన ఆరోపణలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ తనను అత్యాచారం చేశారంటూ రచయిత్రి ఈ జీన్ కారోల్ ఆరోపించారు.


కోర్టులో దావా


1996లో మిడ్‌టౌన్ మాన్‌హాటన్‌లోని బెర్గ్‌డార్ఫ్ గుడ్‌మాన్ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లోని డ్రెస్సింగ్ రూమ్‌లో ట్రంప్ తనపై అత్యాచారం చేశారని రచయిత్రి ఈ జీన్ కారోల్ ఆరోపించారు. ట్రంప్‌పై తన క్లయింట్ అయిన రచయిత్రి  జీన్ కారోల్ కోర్టులో దావా వేయాలని యోచిస్తున్నట్లు ఆమె తరఫు న్యాయవాది తెలిపారు.


ట్రంప్ తనపై అత్యాచారం చేయడం వల్ల తాను మానసిక క్షోభను అనుభవించానని కారోల్ ఆరోపించారు. అందుకే  కోర్టులో దావా వేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. 


తోసిపుచ్చిన ట్రంప్


ఈ ఆరోపణలను ట్రంప్ ఖండించారు. కారోల్‌పై తాను అత్యాచారం చేయలేదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కారోల్ రాసిన పుస్తకాన్ని విక్రయించడానికి తనపై అత్యాచార ఆరోపణలు చేస్తున్నట్లు ట్రంప్ అన్నారు. 


కీలక వ్యాఖ్యలు


అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓటమిపాలైన డొనాల్డ్ ట్రంప్.. అప్పుడప్పుడూ మీడియా ముందుకు వస్తున్నారు. వచ్చిన ప్రతిసారీ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీపై డొనాల్డ్ ట్రంప్‌ ప్రశంసల వర్షం కురిపించారు. సవాళ్లను అధిగమిస్తూ మోదీ అద్భుతమైన పాలన అందిస్తున్నారంటూ కితాబిచ్చారు.



భారత ప్రధాని నరేంద్ర మోదీ నాకు మంచి స్నేహితుడు. అలానే భారత్‌కు నా కన్నా మంచి మిత్రుడైన అమెరికా అధ్యక్షుడు మరొకరు ఉండరని నేను అనుకుంటున్నాను. ఎన్నో సవాళ్లను అధిగమించి ప్రజారంజకమైన పాలనను మోదీ అందిస్తున్నారు. -                   డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు


మళ్లీ పోటీపై


ఇటీవల ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసే అంశంపై డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తాను. విజయం సాధిస్తాను. కీలకమైన అధికారిక రహస్య పత్రాలను ఫ్లోరిడాలోని నా నివాసం నుంచి ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకుందన్న వార్తలు అవాస్తవం. ఎఫ్‌బీఐ అధికారులే ఆ పత్రాలను తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టి నాటకమాడారు. మళ్లీ నేను అధికారంలోకి వచ్చాక ఈ పని చేసిన వారికి సరైన బుద్ధి చెబుతాను.                        - డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు


Also Read: Delhi Road Accident: రోడ్డు డివైడర్‌పై నిద్రిస్తోన్న వారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు- నలుగురు మృతి!


Also Read: Congress President Elections: అప్పుడు కాదన్నారు, ఇప్పుడే సరే అంటున్నారు - కాంగ్రెస్ ప్రెసిడెంట్‌ పదవిపై అశోక్ గెహ్లోట్ ఆసక్తి?

Published at: 21 Sep 2022 11:45 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.