Delhi Road Accident: రోడ్డు డివైడర్‌పై నిద్రిస్తోన్న వారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు- నలుగురు మృతి!

ABP Desam   |  Murali Krishna   |  21 Sep 2022 11:06 AM (IST)

Delhi Road Accident: దిల్లీలో రోడ్డు డివైడర్‌పై నిద్రిస్తోన్న వారిపై నుంచి ఓ ట్రక్కు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మృతి చెందారు.

(Image Source: PTI)

Delhi Road Accident: దిల్లీలో దారుణ ఘటన జరిగింది. సీమాపురి ప్రాంతంలోని డీటీసీ డిపో రెడ్‌ లైట్ క్రాసింగ్ వద్ద రోడ్డు డివైడర్‌పై నిద్రిస్తోన్న ఆరుగురిపై ఓ ట్రక్కు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 

ఇదీ జరిగింది

దిల్లీలో బుధవారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. సీమాపురి రోడ్డు డివైడరుపై నిద్రిస్తున్న వారిపై వేగంగా వచ్చిన ట్రక్కు దూసుకుపోయింది. ఈ ఘటనలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కును కనుగొనేందుకు దిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. క్షతగాత్రులను జీటీబీ ఆసుపత్రికి తరలించారు.  

అర్ధరాత్రి 1:51 గంటలకు.. సీమాపురిలోని DTC డిపో రెడ్‌ లైట్‌ను దాటుతుండగా, రోడ్డు డివైడర్‌పై నిద్రిస్తున్న వారిపై నుంచి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన క్షణంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. తర్వాత మరొకరు మృతి చెందారు. నాలుగో వ్యక్తి ప్రాథమిక చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. మరో ఇద్దరికి జీటీబీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేశాం.                                                 -   పోలీసులు

దర్యాప్తు

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్రక్కును గుర్తించి, డ్రైవర్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

చనిపోయిన నలుగుర్ని.. కరీం (52), చోటే ఖాన్ (25) , షా ఆలం (38), రాహుల్ (45)గా గుర్తించాం. మనీష్ (16) ప్రదీప్ (30) ఈ ఘటనలో గాయపడ్డారు. ఈ ఘటనపై తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ప్రమాదానికి కారణమైన ట్రక్కును వీలైనంత త్వరగా పట్టుకుంటాం. -                                   పోలీసులు

Also Read: Congress President Elections: అప్పుడు కాదన్నారు, ఇప్పుడే సరే అంటున్నారు - కాంగ్రెస్ ప్రెసిడెంట్‌ పదవిపై అశోక్ గెహ్లోట్ ఆసక్తి?

Also Read: Jaipur Student Rewarded: ఇన్‌స్టాలో బగ్ కనిపెట్టిన ఇండియన్ కుర్రాడు- రూ.38 లక్షలు ఇచ్చిన సంస్థ!

Published at: 21 Sep 2022 10:51 AM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.