Jaipur Student Rewarded: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆ ఇన్‌స్టాలో ఓ బగ్‌ను కనిపెట్టిన ఓ యువకుడు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాడు. ఈ బగ్ కనిపెట్టిన ఆ కుర్రాడికి ఇన్‌స్టాగ్రామ్ సంస్థ ఏకంగా రూ. 38 లక్షలు ఇచ్చింది.
ఇదీ సంగతి
రాజస్థాన్ జైపుర్‌కు చెందిన నీరజ్ శర్మ ఈ ఏడాది జనవరిలో ఇన్‌స్టాలో ఓ బగ్‌ను గుర్తించాడు. అదేంటంటే ఇతర యూజర్‌ల లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ అవసరం లేకుండానే ఏ ఇన్‌స్టా ఖాతా నుంచైనా వారి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు చెందిన థంబ్‌నెయిల్‌ను మార్చేందుకు వీలు కల్పించే బగ్‌ను నీరజ్ కనిపెట్టాడు.
నీరజ్ తన అకౌంట్‌లో ఈ బగ్‌ను గుర్తించాడు. దీనిపై 'ఫేస్‌బుక్'కు అతను రిపోర్టు చేశాడు. దీంతో కంపెనీ ప్రతినిధులు ఈ లోపానికి సంబంధించిన డెమో ఇవ్వాలని అడిగారు. ఈ క్రమంలోనే లాగిన్ వివరాలు అవసరం లేకుండానే ఇతరుల ఇన్‌స్టాగ్రామ్ రీల్ థంబ్‌నెయిల్‌ను మార్చి చూపుతూ.. ఓ 5 నిమిషాల డెమోను నీరజ్.. ఫేస్‌బుక్‌కు పంపాడు.
భారీ రివార్డు
దీనిపై విచారణ చేసిన సంస్థ మే నెలలో ఈ లోపాన్ని అంగీకరించింది. దీంతో నీరజ్‌కు 45 వేల డాలర్ల (రూ.35 లక్షలు) రివార్డు అందజేసింది. దీంతోపాటు రివార్డు అందజేయడంలో నాలుగు నెలల ఆలస్యానికిగానూ మరో 4500 డాలర్లు (రూ.3.5 లక్షలు) అదనంగా ప్రకటించింది. దీనిపై నీరజ్ హర్షం వ్యక్తం చేశాడు.
Also Read: Rahul Gandhi: టీ20 ప్రపంచకప్‌లో భారత ఓపెనర్‌గా రాహుల్ గాంధీ- ఇదేందయ్యా ఇది!
Also Read: Multiplex in Kashmir: మూడు దశాబ్దాల తర్వాత కశ్మీర్‌లో వెండితెరపై సినిమా!