ABP  WhatsApp

Rahul Gandhi: టీ20 ప్రపంచకప్‌లో భారత ఓపెనర్‌గా రాహుల్ గాంధీ- ఇదేందయ్యా ఇది!

ABP Desam Updated at: 20 Sep 2022 04:50 PM (IST)
Edited By: Murali Krishna

Rahul Gandhi: రానున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున రాహుల్ గాంధీ ఓపెనింగ్ చేస్తారని ఓ న్యూస్ యాంకర్ తప్పుగా చెప్పారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.

టీ20 ప్రపంచకప్‌లో భారత ఓపెనర్‌గా రాహుల్ గాంధీ- ఇదేందయ్యా ఇది!

NEXT PREV

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో యాత్రతో బిజీబిజీగా ఉన్నారు. అయితే త్వరలో జరగనున్న క్రికెట్ టీ20 వరల్డ్ కప్‌లో ఆయన రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందేంటి.. రాహుల్ గాంధీకి క్రికెట్‌తో సంబంధమేంటని షాక్ అవుతున్నారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.


ట్రోల్


కొన్నిసార్లు టీవీ ఛానెల్‌లు, వెబ్‌సైట్‌లు అనుకోకుండా పొరపాటు చేస్తాయి. ఇలాంటివి దొరికితే ట్రోలర్స్ ఓ రేంజ్‌లో ఆడుకుంటారు. తాజాగా సోషల్ మీడియాకు అలాంటి వార్త ఒకటి దొరికింది. భారత క్రికెట్ జట్టు గురించి మాట్లాడుతూ ఒక టీవీ యాంకర్ పెద్ద తప్పే చేశారు.


టీ20 ప్రపంచ కప్‌లో కేఎల్ రాహుల్ తనతో పాటు ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగుతాడని కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు. ఈ వార్తను వీలైనంత తొందరగా ఇవ్వాలనుకున్న ఓ హిందీ న్యూస్ ఛానల్‌కు చెందిన యాంకర్.. పెద్ద పొరపాటు చేశాడు. లైవ్ టీవీలో మాట్లాడుతూ కేఎల్ రాహుల్‌ ఓపెనింగ్‌ చేస్తాడు అనబోయి రాహుల్ గాంధీ పేరు చెప్పాడు.











భారతీయ టీమ్‌ కే కప్తాన్ రోహిత్ శర్మ నే కహా కీ T20 ప్రపంచ కప్ మే ఓపెన్ కరేంగే రాహుల్ గాంధీ. విరాట్ కోహ్లీ కో భీ కై మ్యాచ్ మే పెన్ కర్నా ప్యాడ్ సక్తా హై," (భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ భారత్‌కు ఓపెనింగ్ చేస్తారని చెప్పాడు. T20 ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లి కూడా ఆ పాత్రను కొన్ని మ్యాచ్‌ల్లో ప్రదర్శించాల్సి వస్తుందని తెలిపాడు)                             - న్యూస్ యాంకర్


ఈ వీడియో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్రికెట్ ఫ్యాన్స్ ఈ వార్తను తెగ షేర్ చేస్తున్నారు.


Also Read: Multiplex in Kashmir: మూడు దశాబ్దాల తర్వాత కశ్మీర్‌లో వెండితెరపై సినిమా!


Also Read: Congress President Polls: కేసీ వేణుగోపాల్‌కు సోనియా నుంచి అత్యవసర పిలుపు- రీజన్ ఇదే!

Published at: 20 Sep 2022 04:50 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.