recession hard to avoid  :   సంవత్సరాంతానికి అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తుందని .. ఆ తర్వాత  కొన్ని దేశాలు తీవ్ర మాంద్యంలో చిక్కుకుంటాయని ప్రపంచ బ్యాంక్‌ తాజా నివేదిక వెల్లడించింది. ఎన్ని తీవ్ర ప్రయత్నాలు చేసినా చాలా దేశాలు ఆర్థిక మాంద్యం బారిన పడకుండా తప్పించుకోలేవని ప్రపంచబ్యాంక్ హెచ్చరిస్తోంది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధి అంచనాల్ని ప్రపంచ బ్యాంక్‌ భారీగా కుదించింది. 


న్యూయార్క్‌ కోర్టులో బొద్దింకల దండయాత్ర- కేసు వాయిదా వేసి అంతా పరార్!


ఇప్పటికే వృద్ధి అంచనాల్ని తగ్గించిన ప్రపంచ బ్యాంక్ 


2021లో 5.7 శాతంగా ఉన్న వృద్ధి రేటు ప్రస్తుత ఏడాది 2.9 శాతానికి దిగిపోతుందన్నది. 2022 జనవరిలో ప్రకటించిన 4.1 శాతం అంచనాలకంటే ఇది బాగా తక్కువ. కొవిడ్‌ వేవ్స్‌తో అంతర్జాతీయంగా సరఫరా అవరోధాలు ఏర్పడటం, వర్థమాన దేశాల్లో ఆదాయ వృద్ధి, పేదరిక నిర్మూలనా చర్యల్లో విఘాతం కలగడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2022 ప్రారంభంలోనే వృద్ధి అంచనాల్ని తగ్గించింది.


టొమోటో కెచప్ దొరకడం కష్టమే! డెన్మార్క్‌ పరిశోధకుల ఆసక్తికరమైన అంశాలు


వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థల్ని అతలాకుతలం చేసే ‘స్టాగ్‌ఫ్లేషన్‌’


వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థల్ని అతలాకుతలం చేసే ‘స్టాగ్‌ఫ్లేషన్‌’ను ప్రపంచ బ్యాంక్‌ నివేదికలో  పలుమార్లు ప్రస్తావించారు. ఒకవైపు వృద్ధి కనిష్ఠస్థాయికి పడిపోవడం, మరోవైపు ధరలు గరిష్ఠస్థాయికి పెరగడాన్ని స్టాగ్‌ఫ్లేషన్‌గా వ్యవహరిస్తారు. ‘కొద్ది సంవత్సరాలపాటు సగటు కంటే అధిక ద్రవ్యోల్బణం, సగటుకంటే తక్కువ వృద్ధి కొనసాగవచ్చునని ప్రపంచ బ్యాంక్ అంచనా వేస్తోంది. ముంచుకొస్తున్న మాంద్యం వల్ల అల్ప, మధ్యాదాయ ఆర్థిక వ్యవస్థలకు ముప్పుగా పరిణమిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 


భారత్‌కు ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా వార్నింగ్- కీలక నగరాల్లో దాడులు చేస్తామని లేఖ


కొన్ని దేశాలు తట్టుకోగలవనే అంచనా


గతంలో స్టాగ్‌ఫ్లేషన్‌ వచ్చినపుడు ద్రవ్య విధాన వాతావరణం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది.  1970వ దశకంలో అధిక చమురు ధరలతో ద్రవ్యోల్బణం పరుగులు తీసింది. మధ్యప్రాచ్య దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకునే దేశాల్లో మాంద్యం ఆవరించింది. ఇప్పుడు కూడా అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి.  ద్రవ్యోల్బణం కారణంగా రేట్లు పెరుగుతూపోతే ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోయి, మాంద్యంలోకి జారుకుంటుంది. 2008లో ఆర్థిక సంక్షోభం కారణంగా జరిగిన మార్కెట్‌ పతనాల్ని ప్రస్తుత ‘మాంద్యం’ హెచ్చరికలు గుర్తుచేస్తున్నాయి. భారీ స్థాయిలో కాకపోయినా  చిన్నపాటి మాంద్యం అయినా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని ప్రపంచ బ్యాంక్‌ హెచ్చరిస్తున్నది.