ABP  WhatsApp

Prophet Remarks Row: భారత్‌కు ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా వార్నింగ్- కీలక నగరాల్లో దాడులు చేస్తామని లేఖ

ABP Desam Updated at: 08 Jun 2022 12:28 PM (IST)
Edited By: Murali Krishna

Prophet Remarks Row: భారత్‌లోని కీలక నగరాల్లో ఆత్మాహుతి దాడులు చేస్తామని అంతర్జాతీయ ఉగ్రసంస్థ అల్‌ఖైదా హెచ్చరించింది.

భారత్‌కు ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా వార్నింగ్- కీలక నగరాల్లో దాడులు చేస్తామని లేఖ

NEXT PREV

Prophet Remarks Row: అంతర్జాతీయ ఉగ్రసంస్థ అల్‌ఖైదా.. భారత్‌ను హెచ్చరించింది. మహమ్మద్‌ ప్రవక్తను అవమానించిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని అల్‌ఖైదా ప్రకటించింది. భారత్‌లోని కీలక నగరాలపై ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని హెచ్చరించింది.







ప్రవక్త గౌరవం కోసం మేం పోరాడతాం. ప్రవక్తను అవమానించిన వారిని అంతమొందిస్తాం. ఎలాంటి శాంతి వచనాలు, భద్రతలు వారిని కాపాడలేవు. ప్రవక్తను అవమానించి క్షమాపణలు చెప్పినంత మాత్రాన ఈ దుమారం ఆగదు.  శరీరాలకు పేలుడు పదార్థాలను బిగించిన ఆత్మాహుతి దళాలను రంగంలోకి దించుతాం. మా పిల్లలను సైతం ఇందుకు వినియోగిస్తాం. -                                                                  అల్‌ఖైదా, అంతర్జాతీయ ఉగ్రసంస్థ


కీలక నగరాల్లో


భారత్‌లోని దిల్లీ, ముంబయి నగరాలతో పాటు, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలలో ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని అల్‌ఖైదా హెచ్చరించింది. మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను వదలబోమని 6వ తేదీతో వెలువడిన లేఖలో ఉగ్రసంస్థ పేర్కొంది.


భాజపా మాజీ అధికార ప్రతినిధులు నుపుర్‌ శర్మ, నవీన్‌కుమార్‌ జిందాల్‌ వ్యాఖ్యలపై ఇస్లామిక్‌ దేశాలు తీవ్ర నిరసనలు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని దేశాలు మన రాయబారులకు సమన్లు జారీ చేశాయి. అయితే కొందరు వ్యక్తుల వ్యాఖ్యలను ప్రభుత్వానికి ఆపాదించడం, తగదని భారత దౌత్యాధికారులు ఇప్పటికే ఆయా దేశాలకు స్పష్టం చేశారు.


Also Read: Delhi: పార్కింగ్ ఏరియాలో చెలరేగిన మంటలు- 10 కార్లు, 80 ఈ- రిక్షాలు దగ్ధం


Also Read: Coronavirus Cases: దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ భయాలు- 93 రోజుల తర్వాత 5వేలకు పైగా కేసులు


 

Published at: 08 Jun 2022 12:19 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.