Lizard in Cold Drink: మామూలుగానే బల్లి కనిపిస్తే ఛీ యాక్ అంటాం. అలాంటిది మనం మరికొన్ని క్షణాల్లో తాగేందుకు సిద్ధంగా ఉన్న కూల్ డ్రింక్‌లో బల్లి వస్తే పరిస్థితి ఏంటి. సరిగ్గా ఇలాంటి సీన్ అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో జరిగింది. అయితే బాధితుడు విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో కూల్ డ్రింక్‌లో బల్లి వచ్చిన ఫొటోలు సోషల్ మీడియాలో మీడియాలో వైరల్‌గా మారాయి. మొదట ఔట్‌లెట్‌ను తాత్కాలికంగా మూసివేసిన ఏఎంసీ అధికారులు.. అది సర్వ్ చేసిన సంస్థకు రూ.1 లక్ష భారీ జరిమానా విధించారు. ఆ వివరాలిలా ఉన్నాయి..
భార్గవ్ జోషి అనే వ్యక్తి మే 21న అహ్మదాబాద్‌లో మెక్‌డొనాల్డ్స్‌కు వెళ్లాడు. ఏదో ఆర్డర్ చేసి తిన్నాడు. ఆపై కూల్ డ్రింక్ సైతం ఆర్డర్ చేశాడు. అయితే అతడికి సర్వ్ చేసిన కూల్ డ్రింక్‌లో ఉన్న జీవిని చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు బాధితుడు. ఆ పానియంలో చనిపోయిన బల్లి వచ్చింది. వెంటనే ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మెక్ డోనాల్డ్స్‌లో కూల్ డ్రింక్ ఆర్డరిస్తే తనకు ఏం సర్వ్ చేశారో చూడండంటూ భార్గవ్ జోషి పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన పౌరసరఫరాల సంస్థ.. మూడు నెలల పాటు రెస్టారెంట్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్టు తెలిపింది.
మెడికల్ ఆఫీసర్ ఏమన్నారంటే..
మెక్‌డొనాల్డ్స్‌లో కూల్ డ్రింక్‌లో బల్లి రావడం అనేది సాధారణ విషయం కాదని, ఇలాంటి వాటిని ఉపేక్షించకూడదని అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (AMC) మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ భవన్ జోషి అన్నారు. అహ్మదాబాద్‌లోని సోలా ప్రాంతంలోని మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌కు రూ. 1 లక్ష జరిమానా విధించారు. జరిమానా చెల్లించిన తర్వాత, రెస్టారెంట్‌ను శుభ్రం చేయడానికి రెండు రోజుల సమయం ఇస్తామన్నారు. ఆ తరువాత సైతం ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని ఆ మెక్‌డొనాల్డ్స్ బ్రాంచీని హెచ్చరించారు.
మెక్‌డొనాల్డ్స్ వివరణ..
‘మేం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. అత్యంత కఠినమైన ఆహార భద్రతా విధానాలు, విధివిధానాలు అనుసరిస్తాం. కూల్ డ్రింక్‌లో బల్లి వచ్చిందన్న ఆరోపణలపై అంతర్గత సమీక్ష నిర్వహించాం. ఇది కచ్చితంగా మా రెస్టారెంట్‌లో జరగదని మేము విశ్వసిస్తున్నాము. అధికారులకు సైతం ఇదే ప్రాథమికంగా సమాధానం ఇచ్చామని’ మెక్‌డొనాల్డ్స్ ఓ ప్రకటన విడుదల చేసింది.
Also Read: కీలక నిర్ణయాలు తీసుకొనే ముందు సెక్స్ చేయాలట! నిపుణులు ఏం చెప్పారో చూడండి
Also Read: తగ్గేదేలే, కొత్త పెళ్లికొడుకు అత్యాశ ఫలితం, 20 రోజులుగా అంగస్తంభన, ఇక జీవితాంతం అంతేనట!