RBI Increases Repo Rate: 50 బేసిస్ పాయింట్లు రెపోరేట్ పెంచుతూ ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు 4.9 శాతానికి చేరింది. పెంచిన వడ్డీ రేట్లు తక్షణం అమల్లోకి వస్తాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. దీంతో హోం, కారు, పర్సనల్ లోన్ ఈఎమ్ఐలు భారీగా పెరగనున్నాయి.
భారీ షాక్
నిత్యావసరాల ధరలు భారీగా పెరుగుతోన్న వేళ, ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతున్న సమయంలో సామాన్యులకు రిజర్వ్ బ్యాంక్ మరో షాక్ ఇచ్చింది. గత నెలలో రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచి 4.40 శాతానికి చేర్చిన ఆర్‌బీఐ. ఇప్పుడు మరో 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 4.9 శాతానికి చేరింది. సోమవారం ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం జరిగింది. గవర్నర్ శక్తికాంత దాస్ వడ్డీరేట్లపై బుధవారం ప్రకటన చేశారు.
దేనిపై ఎంత వడ్డీ
రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచడంతో గృహ, కారు, పర్సనల్ లోన్ ఈఎమ్ఐలు భారీగా పెరగనున్నాయి.
- గృహ రుణం రూ.50 లక్షలు తీసుకుంటే 20 ఏళ్లలో మరో రూ.7 లక్షలు అదనపు వడ్డీ పడనుంది.
- పర్సనల్ లోన్‌పై 12 శాతానికి వడ్డీ పెరిగే అవకాశం ఉంది.
- కారు లోన్‌పై 9.5 శాతానికి వడ్డీ పెరిగే ఛాన్స్
2020 మే 22న చివరిసారిగా వడ్డీ రేట్లలో మార్పులు చేసింది ఆర్‌బీఐ. గత నెలలో ద్రవ్యపరపతి విధాన సమీక్ష లేకుండానే వడ్డీ రేట్లను పెంచింది. దీంతో అనేక బ్యాంకులు కీలకమైన వడ్డీ రేట్లలో మార్పులు చేశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏకంగా నెల రోజుల వ్యవధిలోనే మూడు సార్లు వడ్డీ రేట్లను పెంచింది.
Also Read: LIC IPO: ఇన్వెస్టర్లు లబోదిబో! ఏకంగా 20% పతనమైన ఎల్‌ఐసీ షేర్లు - ఇంకెంత పెయిన్ మిగిలుందో!!