Coronavirus Cases: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 5,233 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏడుగురు కరోనాతో మృతి చెందారు. 93 రోజుల తర్వాత రోజువారీ కేసులు ఐదువేలకు పైగా నమోదయ్యాయి.  తాజాగా 3345 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.72 శాతానికి చేరింది. మరణాల రేటు 1.22 శాతంగా ఉంది.






మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసులు 0.07 శాతం ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 1.67 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 1.12 శాతంగా వద్ద ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.



  • మొత్తం కరోనా కేసులు:4,31,90,282‬

  • ‬మొత్తం మరణాలు: 5,24,715

  • యాక్టివ్​ కేసులు: 28,857

  • మొత్తం రికవరీలు: 4,26,36,710


వ్యాక్సినేషన్







దేశంలో కొత్తగా 14,94,086 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,94,43,26,416కు చేరింది. మరో 3,13,361 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం ఫోర్త్ వేవ్ అంచనాలకు బలం చేకూరుస్తున్నాయి. అయితే కరోనా నిబంధనలను పాటించాలని, మాస్కును తప్పనిసరి ధరించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి.


Also Read: RBI Monetray Policy: భారీగా వడ్డీ రేట్లు పెంచిన RBI- ఇక EMIల బాదుడే బాదుడు!


Also Read: CDS Eligibility Rules: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకంపై కేంద్రం కీలక నిర్ణయం, సరికొత్త మార్గదర్శకాలు జారీ