New York Courtroom: ఒక్కొక్కరి నిరసన ఒక్కొక్క రకంగా ఉంటుంది. అయితే అమెరికా న్యూయార్క్‌లో ఓ మహిళ తన నిరసనను వింతగా తెలియజేసింది. న్యూయార్క్ కోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా ఆమె చేసిన పనికి అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా?


బొద్దింకల దాడి


న్యూయార్క్‌లో ఓ మహిళను స్థానికంగా గొడవలు చేసిందనే కారణంతో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను అల్బానీ నగరంలోని కోర్టులో హజరుపర్చారు.  కోర్టులో విచారణ జరుగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. ఇందులో ఆ మహిళ తనపై వ్యతిరేక వాదనలే ఎక్కువగా వస్తున్న విషయాన్ని గమనించి కోపంతో ఊగిపోయింది.






ఇంకేముంది తెలిసిన వారితో డబ్బాల నిండా బొద్దింకలను కోర్టుకు తెప్పించుకుంది. అదును చూసి కోర్టులో వాటిని వదిలేసింది. నిమిషంలో కోర్టు హాల్ మొత్తం బొద్దింకలతో నిండిపోయింది. ఏకంగా వంద‌ల సంఖ్య‌లో బొద్దింక‌లు రావ‌డంతో కేసును వాయిదా వేశారు.







కోర్టు మూసేశారు


బొద్దింక‌ల‌ను త‌రిమేందుకు పొగ‌పెట్టాలని అధికారులు నిర్ణయించారు. దీంతో కోర్టును కూడా మూసివేశారు. మహిళ చర్య కారణంగా కోర్టు కార్యకలాపాల్లో తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. ఇదంతా మహిళ కావాలని చేసిన పనిగా బయటపడింది. దీంతో కోర్టు ఆమె చేసిన పనిని తీవ్రంగా పరిగణించింది. దీంతో ప్రస్తుతం ఆమెను పోలీసులు కస్టడీలోనికి తీసుకొని ఈ ఘటపై విచారిస్తున్నారు.


Also Read: India's First Sologamy Marriage: సోలోగా సోలోగమీ మ్యారేజ్- వరుడు తప్ప ఇక్కడ అన్నీ ఉంటాయ్!


Also Read: Weather Update: రుతుపవనాల రాకలో ఆలస్యం లేదు- 2 రోజుల్లో ఇక దంచుడే దంచుడు: IMD