Weather Update: రుతుపవనాల రాకలో ఆలస్యం లేదు- 2 రోజుల్లో ఇక దంచుడే దంచుడు: IMD

ABP Desam Updated at: 09 Jun 2022 04:39 PM (IST)
Edited By: Murali Krishna

Weather Update: నైరుతి రుతుపవనాల రాకలో ఎలాంటి జాప్యం లేదని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

రుతుపవనాల రాకలో ఆలస్యం లేదు- 2 రోజుల్లో ఇక దంచుడే దంచుడు: IMD ( Image Source : Getty Images )

NEXT PREV

Weather Update: నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. రుతుపవనాలు సాధారణంగానే పయనిస్తున్నాయని, రాబోయే రెండు రోజుల్లో మహారాష్ట్రను తాకుతాయని ఐఎండీ పేర్కొంది. మే 31- జూన్​ 7 మధ్య దక్షిణ, మధ్య అరేబియా మహాసముద్రం, కేరళ సహా కర్ణాటక, తమిళనాడుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండీ వెల్లడించింది.











రుతుపవనాల రాకలో ఎలాంటి ఆలస్యం లేదు. రాబోయే రెండు రోజుల్లో రుతుపవనాలు మహారాష్ట్రలోకి ప్రవేశిస్తాయి. తర్వాత రెండు రోజుల్లో ముంబయిలోనూ వర్షాలు పడొచ్చు. ఈసారి నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు బాగా కురుస్తాయి. గోవా, మహారాష్ట్రల్లోని ఇతర ప్రాంతాలు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడులో రెండు రోజుల్లో రుతుపవనాల్లో పురోగతి కనిపిస్తుంది.                                                                                   - ఐఎండీ


Also Read: Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల- జులై 18న పోలింగ్


Also Read: Bihar News: కుమారుడి శవం ఇచ్చేందుకు లంచం డిమాండ్- డబ్బుల్లేక తండ్రి భిక్షాటన!

Published at: 09 Jun 2022 04:25 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.